అక్రమ కేసులపై ఆగ్రహం | illigal cases ..ysrcp fight | Sakshi
Sakshi News home page

అక్రమ కేసులపై ఆగ్రహం

Published Thu, Mar 2 2017 11:40 PM | Last Updated on Tue, May 29 2018 3:42 PM

illigal cases ..ysrcp fight

  • సర్కార్‌ తీరుపై పెల్లుబికిన నిరసనలు  
  • వైఎస్సార్‌ సీపీ శ్రేణుల ఆందోళనలు
  • జగన్‌పై తప్పుడు కేసులు ఎత్తివేయాలని డిమాండు 
  • మానవత్వం లేని ప్రభుత్వమంటూ మండిపాటు
  •  
    టీడీపీ ఎంపీకి చెందిన దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు.. మృత్యుశకటమై.. పదిమంది అమాయకులను బలి తీసుకుంటే.. మరెంతోమందిని క్షతగాత్రుల్ని చేస్తే.. ఆ బాధితుల పక్షాన విపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గళమెత్తడమే చంద్రబాబు సర్కారు దృష్టిలో నేరమైంది. జగన్‌తోపాటు, పార్టీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టింది. న్యాయం చేయాలని అడిగినందుకు నిరంకుశంగా వ్యవహరించిన ప్రభుత్వ తీరును నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా ప్రజలు కదం తొక్కారు. అక్రమ కేసులు తక్షణం ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.
     
    సాక్షి ప్రతినిధి, కాకినాడ :
    దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదం నేపథ్యంలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డిపై అక్రమ కేసులు పెట్టిన టీడీపీ ప్రభుత్వ తీరుపై జిల్లాలో జనాగ్రహం పెల్లుబికింది. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని గొంతెత్తి అడగటమే
    ఆయన చేసిన నేరమా? అంటూ ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీశారు. అక్రమ కేసులకు నిరసన గా పార్టీ పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా వైఎస్సార్‌ సీపీ శ్రేణులు గురువారం కదం తొక్కాయి. జిల్లాలోని 64 మండల కేంద్రాలు, మున్సిపల్‌ కార్యాలయాల వద్ద ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు.
    l వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆధ్వర్యాన నేతలు, కార్యకర్తలు సర్పవరం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో చేసి, చంద్రబాబు సర్కార్‌ తీరును ఎండగట్టారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం చంద్రబాబు ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని, అక్రమ కేసులు ఎత్తివేయాలని నినదించారు. రాస్తారోకోతో పిఠాపురం – కాకినాడ రహదారిపై ట్రాఫిక్‌ నిలిచిపోయింది. పార్టీ ప్రధాన కార్యదర్శి అత్తిలి సీతారామస్వామి, ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
    l కాకినాడ సిటీ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ ఆధ్వర్యాన ఆందోళన నిర్వహించారు.
    l కొత్తపేట పాతబస్టాండ్‌ సెంటర్‌లో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యాన నాయకులు, కార్యకర్తలు ర్యాలీ, రాస్తారోకో చేశారు. సెక్ష¯ŒS–30 అమలులో ఉందంటూ పోలీసులు జగ్గిరెడ్డి సహా పలువురు నేతలను అరెస్టు చేసి, వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.
    l రంపచోడవరం నియోజకవర్గం వై.రామవరంలో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, వైఎస్సార్‌ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్‌లు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వీఆర్‌ పురం, కూనవరం, చింతూరు తదితర విలీన మండలాల్లోని నేతలు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
    l రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి రాగా, అర్బ¯ŒS తహసీల్దార్‌ కార్యాలయం వద్ద పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. రాజమహేంద్రవరం కార్పొరేష¯ŒSలో పార్టీ ఫ్లోర్‌లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, ట్రేడ్‌ యూనియ¯ŒS అధ్యక్షుడు అడపా వెంకటరమణ, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి గుర్రం గౌతమ్‌ తదితరులు పాల్గొన్నారు.
    l రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, గ్రేటర్‌ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ల ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు.
    l సీతానగరంలో సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.
    l అమలాపురం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట పార్టీ పీఏసీ సభ్యుడు‡ పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి తదితరుల ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాస్, బొమ్ము ఇజ్రాయిల్, రైతు విభాగం అధ్యక్షుడు జున్నూరు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
    l పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, మాజీ మంత్రి కొప్పన మోహనరావు; రాజమహేంద్రవరం రూరల్‌లో కో–ఆర్డినేటర్లు ఆకుల వీర్రాజు, గిరజాల వీర్రాజు(బాబు)ల ఆధ్వర్యాన రూరల్‌ తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించి వినతిపత్రాలు అందజేశారు. డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ వెలుగుబంటి అచ్యుతరామ్, రాష్ట్ర కార్యదర్శులు మింది నాగేంద్ర, నక్కా రాజబాబు తదితరులు పాల్గొన్నారు.
    l ముమ్మిడివరంలో కో–ఆర్డినేటర్‌ పితాని బాలకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి పెయ్యల చిట్టిబాబు, పి.గన్నవరం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, కో–ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు, రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహనరావు తదితరులు ధర్నా నిర్వహించారు. రామచంద్రపురం తహసీల్దార్‌ కార్యాలయంలో వైద్య విభాగం అ««దl్యక్షుడు డాక్టర్‌ యనమదల మురళీకృష్ణ, పట్టణ కన్వీనర్‌ గాదంశెట్టి శ్రీధర్‌ తదితరులు తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. అనపర్తిలో కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యాన నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌కు వినతి పత్రం ఇచ్చారు. జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి ఆధ్వర్యాన అర్ధనగ్న ప్రదర్శన చేశారు. పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం ఎదుట కో–ఆర్డినేటర్‌ తోట సుబ్బారావునాయుడు ఆధ్వర్యాన నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.
    l జగ్గంపేటలో కో–ఆర్డినేటర్‌ ముత్యాల శ్రీనివాస్‌ ఆధ్వర్యాన వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి, ర్యాలీ, తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన నిర్వహించి, వినతిపత్రం అందజేశారు. గోకవరం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట పార్టీ శ్రేణులు నల్లబ్యాడ్జీలతో ధర్నా చేశాయి. మలికిపురం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రాష్ట్ర లీగల్‌ సెల్‌ కార్యదర్శి మంగెన సింహాద్రి, ఎస్సీ సెల్‌ కార్యదర్శి నల్లి డేవిడ్‌ తదితరులు ధర్నా చేశారు. కో ఆర్డినేటర్‌ పర్వత ప్రసాద్‌ ఆధ్వర్యాన ఏలేశ్వరంలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. మండపేట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వేగుళ్ళ పట్టాభిరామయ్యచౌదరి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ నేతలు, కార్యకర్తలు ధర్నా చేశారు. కో–ఆర్డినేటర్‌ వేగుళ్ళ లీలాకృష్ణ ఆధ్వర్యాన తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రాయవరంలో రైతు విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కొవ్వూరి త్రినాథరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్తి వెంకటరెడ్డి ధర్నా చేసి వినతిపత్రం అందజేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement