- శవ రాజకీయాలు ‘బాబు’కు కొత్తకాదు
- వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు
టీడీపీ ఎంపీని రక్షించేందుకే జగన్‌పై కేసులు
Published Thu, Mar 2 2017 11:32 PM | Last Updated on Tue, Sep 5 2017 5:01 AM
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
‘‘దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 10 మంది చనిపోతే తెలుగుదేశం ప్రభుత్వం శవరాజకీయాలు చేస్తోంది. మృతి చెందినవారిని పరామర్శించాలనే కనీస మానవత్వం కూడా చంద్రబాబుకు లేదు. ప్రమాదానికి కారణమైన బస్సు టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డికి చెందిన ట్రావెల్స్‌ది కావడంతో.. ఆయనను రక్షించేందుకు చంద్రబాబు సర్కార్ ప్రయత్నిస్తోంది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు అడ్డుకోవడం దారుణం. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వస్తే.. ఆయనపైన, పార్టీ నాయకులపైన అక్రమ కేసులు పెట్టడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం అపహాస్యం పాలు చేసింది’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అ««దl్యక్షుడు కురసాల కన్నబాబు దుయ్యబట్టారు. అక్రమ కేసులను నిరసిస్తూ సర్పవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం నిర్వహించిన ధర్నాలో ఆయన ప్రసంగించారు. అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది లేదని, ప్రజల తరఫున పోరాటం ఆగదని స్పష్టం చేశారు. జగన్Sపైన, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల పైన కేసులు పెట్టడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలవాటైపోయిందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వమే ఎల్లకాలమూ ఉండదన్న విషయం తెలుసుకుని అధికారులు మసలుకోవాలన్నారు. గతంలో కృష్ణా జిల్లాలో తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేసినప్పుడు ఎమ్మెల్యేను కలెక్టర్ వెనకేసుకురావడం, బాధిత అధికారినే మందలించడం చూస్తే ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ఏరకంగా కొమ్ము కాస్తున్నారో అన్న విషయం అర్థమవుతుందన్నారు. డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తే ఆధారాలతో అడ్డంగా దొరికిపోతారనే ఉద్దేశ్యంతోనే కలెక్టర్ బాబు అడ్డుపడ్డారని అన్నారు. జగ¯ŒSపై పెట్టిన అక్రమ కేసులను తక్షణం ఉపసంహరించుకోకుంటే ప్రజలే సరైన బుద్ధి చెబుతారని కన్నబాబు స్పష్టం చేశారు.
Advertisement