భారీ వర్షం: నెల్లూరు జలమయం | Kotamreddy Sridhar Reddy Visits Nellore Rain Places | Sakshi
Sakshi News home page

నెల్లూరులో భారీ వర్షం: లోతట్టు ప్రాంతాలు జలమయం

Published Thu, Nov 12 2020 10:50 AM | Last Updated on Thu, Nov 12 2020 11:40 AM

Kotamreddy Sridhar Reddy Visits Nellore Rain Places - Sakshi

సాక్షి, నెల్లూరు: జిల్లాలో బుధవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు నగరంలోని పలుచోట్ల రోడ్లు, లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు పొంగిపొర్లుతోంది. భారీ వర్షానికి కోవూరు ప్రాంతంలో నారుమళ్లు నీటి మునిగియి. మాగుంట లే ఔట్‌లో అండర్ బ్రిడ్జి  కింద ప్రవహిస్తున్న నీటిలో ఆర్టీసీ బస్సు ఇరుక్కుపోయింది. భారీ వర్షాలకు అస్తవ్యస్తమైన పలు ప్రాంతాలు, రూరల్ పరిధి డివిజన్లలో స్థానిక వెఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గురువారం పర్యటించారు. రైల్వే పనులు వల్లే ఈ పరిస్థితి ఎదురైందని, కార్పొరేషన్ అధికారులతో రైల్వే శాఖ సమన్వయం చేసుకోకుండా పనులు చేస్తుండటం వల్లనే ఈ దుస్థితి వచ్చిందని ఆయన ఆరోపించారు. వర్షపు నీళ్లు సాధ్యమైనంత త్వరగా బయటకు పంపించి, పరిస్థితిని పునరుద్ధరిస్తాం శ్రీధర్‌రెడ్డి తెలిపారు.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement