నెల్లూరు రూరల్: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ తన ఉనికిని కోల్పోతోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలో చేరిన అనంతరం నెల్లూరు ఎంపీ, వైఎస్సార్‌సీపీ రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పలు ప్రాంతాలకు చెందిన వారు అధిక సంఖ్యలో వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు.
శనివారం రాత్రి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి అనుచరులు, నెల్లూరు రూరల్ పరిధిలోని 28వ డివిజన్‌కు చెందిన కొండిశెట్టి జగదీష్, 22వ డివిజన్‌కు చెందిన గుంజి రవి ఆధ్వర్యంలో పేర్నాటి ప్రసాద్, అజయ్, చరణ్‌రెడ్డి, పవన్, రాములతోపాటు సుమారు వెయ్యి మంది యువకులు ఎంపీ ఆదాల నివాసంలో ఆయన సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. అంతకుముందు భారీ ర్యాలీ నిర్వహించి ఆదాల నివాసం ఎదుట బాణసంచా కాల్చి సంబరాలు చేశారు.
భారీ గజమాలతో ఎంపీ ఆదాలను సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపునకు సమష్టిగాకృషి చేయాలని పిలుపునిచ్చారు. యువతకు వైఎస్సార్‌సీపీలో సముచిత స్థానం కల్పిస్తామని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగా రెడ్డి, కార్పొరేటర్లు విజయభాస్కర్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, రైల్వే బోర్డు మెంబర్ వెంకయ్య, మర్రిపాడు జెడ్పీటీసీ సభ్యుడు మల్లు సుధాకర్‌రెడ్డి, టీవీఎస్ కమల్, కాలేషా, రఫీ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment