
నాగచైతన్యకు టీచర్‌గా మారారు శేఖర్ కమ్ముల. ఏం పాఠాలు నేర్పించారంటే తెలంగాణ యాస మాట్లాడేందుకు శిక్షణ ఇచ్చారు. ఎందుకంటే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న ‘లవ్‌స్టోరీ’ సినిమాలో నాగచైతన్య పాత్ర తెలంగాణ యాస మాట్లాడుతుంది. ఇందులో సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్నారు. నారాయణ్‌దాస్ కె. నారంగ్, పి. రామ్మోహనరావు నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది. మలి షెడ్యూల్ మంగళవారం హైదరాబాద్‌లో మొదలైంది.
ఈ ‘లవ్‌స్టోరీ’ విడుదలకు డేట్ లాక్ చేశారని సమాచారం. ఏప్రిల్ 2న సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారట. ఉన్నత స్థాయికి ఎదగాలనే పట్టుదలతో ఓ మారుమూల గ్రామం నుంచి హైదరాబాద్ వచ్చే యువకుడిగా నాగచైతన్య, కలను నిజం చేసుకోవాలనుకునే తపనతో తన ఊరి నుంచి హైదరాబాద్ చేరుకునే యువతిగా సాయిపల్లవి నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఎలా ప్రేమ చిగురించింది? ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment