నాగచైతన్య- సాయిపల్లవి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'తండేల్'. ఈ మూవీకి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తుండగా.. బన్నివాసు నిర్మాతగా ఉన్నారు. అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ చిత్రం రానున్నడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే, ఈ చిత్రం నుంచి 'బుజ్జి తల్లి..' సాంగ్ విడుదలపై మేకర్స్ ఒక ప్రకటన చేశారు.
నాగచైతన్య, సాయిపల్లవి మీద చిత్రీకరించిన బుజ్జి తల్లి పాటను నవంబర్ 21న విడుదల చేస్తున్నట్లు ఒక పోస్టర్‌తో మేకర్స్ ప్రకటించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు అదిరిపోయే సంగీతం ఇచ్చారని మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ క్రమంలో తండేల్ మ్యూజిక్ జర్నీని మేకర్స్ ప్రారంభిస్తున్నారు. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం నాగచైతన్య కెరియర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా నిలుస్తోందని అభిమానులు అంచనా వేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాకు డి.మత్స్యలేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తండేల్ చిత్రం తెరకెక్కుతుంది. వాస్తవ సంఘటనలను తీసుకున్నప్పటికీ.. ఇద్దరు ప్రేమికుల జీవితాల్లోని సంఘటనలు, భావోద్వేగాలను చాలా చక్కగా దర్శకుడు తీశాడని టాక్ వస్తుంది. ఈ సినిమా కోసం కొన్ని భారీ సెట్స్ వేసి బడ్జెట్ విషయంలో కూడా వెనుకాడలేదని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment