
ప్రేమకథల్లో శేఖర్ కమ్ముల ప్రేమకథలు డిఫరెంట్. సున్నితంగా, ఆహ్లాదంగా సాగిపోతాయి. ఇప్పుడు మరో రొమాంటిక్ ప్రేమకథను తీయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ నెలాఖర్లో మొదలవుతుందని తెలిసింది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించనున్నారు. సునీల్ నారంగా నిర్మిస్తారు. డ్యాన్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ తిరగనుందట. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 25న ప్రారంభం కానుంది. తొలి షెడ్యూల్‌లో నాగచైతన్య, సాయి పల్లవి ఇద్దరూ పాల్గొంటారని సమాచారం. డిసెంబర్‌లోపు ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment