Director Sekhar Kammula Helped Rs 1 Lakh To Suryapet District Farmer - Sakshi
Sakshi News home page

Shekar Kammula: శేఖర్‌ కమ్ముల పెద్ద మనసు, రైతుకు ఆర్థిక సాయం

Published Tue, Oct 26 2021 3:55 PM | Last Updated on Tue, Oct 26 2021 4:31 PM

Director Sekhar Kammula Helped Rs 1 Lakh To Suryapet Farmer - Sakshi

సెన్సిబుల్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ఇల్లు కాలిపోయి కుటుంబంతో సహా రోడ్డున పడ్డ ఓ రైతుకు అండగ నిలిచి ఆర్థిక సాయం అందించారు. తెలంగాణ సూర్యాపేట జిల్లా నేలమర్రి గ్రామానికి చెందిన లక్ష్మయ్య అనే రైతు ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అతడు నివాసం ఉంటున్న గుడిసే పూర్తిగా దగ్ధం అవ్వగా.. భూమి అమ్మగా వచ్చిన డబ్బు సైతం కాలిపోయింది. దీంతో దిక్కుతోచన స్థితిలో ఉన్న ఆ రైతుకు శేఖర్‌ కమ్ముల లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు.

చదవండి: ముంబైలో పూరీని చూసి ఎమోషనల్‌ అయిన ఫ్యాన్‌.. వీడియో వైరల్‌

లక్ష్మయ్య బ్యాంక్‌ అకౌంట్‌కే ఆ డబ్బును నేరుగా ట్రాన్స్‌ఫర్‌ చేసినట్లు సమాచారం. సూర్యాపేటకు చెందిన కప్పల లక్ష్మయ్య తన సోదరులతో కలిసి ఇటీవల తమకు ఉన్న వ్యవసాయ భూమిని అమ్మారు. అందులో లక్ష్యయ్య వాటాగా రూ.10 లక్షలు వచ్చాయి. ప్రస్తుతం అతడు గుడిసెలో ఉంటున్నాడు. ఆ డబ్బుతో ఇల్లు నిర్మించుకుందామని భావించాడు. 10 లక్షల రూపాయల్లో రూ. 6 లక్షలను ఇంట్లోని బీరువాలో పెట్టాడు. ఈ నేపథ్యంలో ఇటివల తన ఇంట్లో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో అతడి గుడిసెతో పాటు డబ్బులు కూడా కాలిపోవడంతో లక్ష్మయ్య రోడ్డున పడ్డాడు.

చదవండి: Megastar Chiranjeevi: చిరు వాయిస్‌తో కృష్ణవంశీ ‘రంగమార్తాండ’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement