
సినిమాలోని హీరోహీరోయిన్లను దాచేయడం కొత్తేం కాదు. కానీ ఇది చివరికి మేలు చేస్తుందా? నష్టం చేస్తుందా అన్నదే ముఖ్యం. అప్పట్లో గుణశేఖర్ వరుడు సినిమాలో ఈ ప్రయత్నమే చేశారు. హీరోయిన్‌ను రివీల్ చేయకుండా దాగుడుమూతలు ఆడారు. అంత ఆసక్తిని పెంచడంతో.. నేరుగా సినిమాలో హీరోయిన్‌ను చూసే సరికి పెదవి విరిశారు.
అందుకే మరీ అంత ఆసిక్తిని పెంచి గోప్యంగా ఉంచడం కూడా మంచిది కాదు. అయితే ‘ఫిదా’ అంటూ పలకరించి.. మళ్లీ పూర్వ వైభవాన్ని సొంతం చేసుకున్నారు శేఖర్ కమ్ముల. ఈ కూల్ డైరెక్టర్ ప్రస్తుతం కొత్త హీరోహీరోయిన్లతో ఓ మూవీని చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నూతన నటీనటుల్ని మాత్రం ఇప్పట్లో మీడియాకు పరిచయం చేయరని సమాచారం. మరి శేఖర్ కమ్ముల చేస్తున్న ఈ చర్య.. సినిమాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment