
వెంకటేష్, శేఖర్ కమ్ముల
వెంకటేష్ స్పీడ్ మాములుగా లేదు. ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాల (‘నారప్ప’, ‘ఎఫ్ 3’, ‘దృశ్యం2’)ను విడుదలకు సిద్ధం చేస్తున్న వెంకటేష్ తాజాగా మరో సినిమాకు పచ్చజెండా ఉపారని సమాచారం. ఇటీవల శేఖర్ కమ్ముల చెప్పిన కథకు ఇంప్రెస్ అయ్యారట వెంకీ. త్వరలో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనుందని టాక్. ప్రస్తుతం నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’ సినిమా విడుదల పనుల్లో బిజీగా ఉన్నారు శేఖర్ కమ్ముల. ‘లవ్‌స్టోరీ’ వచ్చే నెల 16న విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తర్వాత వెంకీకి చెప్పిన స్క్రిప్ట్‌పై మరింత దృష్టి పెడతారట శేఖర్. ఇక వెంకీ నటిస్తున్న ‘నారప్ప’ మే 14న, ‘దృశ్యం 2’ జూలైలో, ‘ఎఫ్ 3’ ఆగస్టు 27న విడుదలకు షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment