ఇలాంటి సినిమాలనే యూత్‌ ఆదరిస్తున్నారు | Venkatesh Launches Krishna Rao Super Market Teaser | Sakshi
Sakshi News home page

ఇలాంటి సినిమాలనే యూత్‌ ఆదరిస్తున్నారు

Jun 23 2019 12:23 AM | Updated on Jun 23 2019 12:23 AM

Venkatesh Launches Krishna Rao Super Market Teaser - Sakshi

వెంకటేశ్‌తో కృష్ణ, గౌతంరాజు

కమెడియన్‌ గౌతమ్‌రాజు తనయుడు కృష్ణ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘కృష్ణారావ్‌ సూపర్‌మార్కెట్‌’. శ్రీనాథ్‌ పులకరం దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ చిత్రం టీజర్‌ రిలీజైంది.  రిలీజైన ఈ చిత్రం టీజర్‌ను వెంకటేశ్‌ అభినందిస్తూ– ‘‘కృష్ణారావ్‌ సూపర్‌మార్కెట్‌’ టీజర్‌ నాకు చాలా బాగా నచ్చింది. రియలిస్టిక్‌గా ఉంది. ప్రస్తుతం ఇలాంటి సినిమాలనే యూత్‌ ఎంకరేజ్‌ చేస్తున్నారు. కృష్ణ నటుడిగా మంచి గుర్తింపు పొందాలని కోరుకుంటున్నాను. టీమ్‌ అందరికీ ఆల్‌ది బెస్ట్‌’’ అన్నారు వెంకటేశ్‌. ‘‘త్వరలోనే రిలీజ్‌ ప్లాన్‌ చేస్తున్నాం. సపోర్ట్‌ చేసిన వెంకటేశ్‌గారికి కృతజ్ఙతలు’’ అన్నారు గౌతంరాజు. ‘‘టీజర్‌ అందర్నీ ఆకట్టుకుంటుంది. సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం’’ అన్నారు కృష్ణ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement