
ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగలరు వెంకటేష్. తన కథలో ప్రేక్షకులను లీనం చేయగలుగుతారు దర్శకుడు శేఖర్ కమ్ముల. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కడానికి సన్నాహాలు మొదలు కాబోతున్నాయనేది ఫిల్మ్‌నగర్ టాక్. ఈ లాక్‌డౌన్ సమయంలో ఓ స్క్రిప్ట్‌ను రెడీ చేశారట శేఖర్ కమ్ముల. ఈ కథలో వెంకటేష్ హీరోగా నటించబోతున్నారట. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్ ‘నారప్ప’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. అలాగే నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల ‘లవ్‌స్టోరీ’ అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment