
కోడి రామకృష్ణ, శేఖర్ కమ్ముల, సుమ కనకాల, బీఏ రాజు
ఫిలిం ఎనాలిటికల్ అండ్ అప్రిషియేషన్ సొసైటీ (ఫాస్) ఈ ఏడాది దాసరి ఫిల్మ్ అవార్డు విజేతల ఎంపిక వివరాలను సంస్థ అధ్యక్షులు, పూర్వ సెన్సార్ బోర్డ్ సభ్యులు కె. ధర్మారావు వెల్లడించారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఈ నెల 6న హైదరాబాద్‌లో జరగనుంది. డైరెక్టర్ ఆఫ్ ది ఇయర్‌గా శేఖర్ కమ్ముల (ఫిదా), ఉత్తమ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ఉత్తమ గాయని మధుప్రియ, ప్రశంసా దర్శకుడు అవార్డు వడ్డేపల్లి కృష్ణ (లావణ్య విత్ లవ్‌బాయ్స్), దాసరి ప్రతిభా పురస్కారాలను సంపూర్ణేష్ బాబు, శివపార్వతి, సంగీత దర్శకులు వాసూరావు, మాటల రచయిత సంజీవని, దాసరి విశిష్ట సేవా పురస్కారాన్ని రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడు లయన్ డా.ఎ. నటరాజుకు ప్రదానం చేయనున్నారు.
ఫాస్–దాసరి కీర్తి కిరిట సిల్వర్‌క్రౌన్ అవార్డులను దర్శకులను కోడి రామకృష్ణ, టీవీ యాంకర్ సుమ కనకాలకు అందజేయనున్నారు. దాసరి జీవన సాఫల్య పురస్కారాన్ని సూపర్‌హిట్ సినీ వార పత్రిక ఎడిటర్ అండ్ పబ్లిషర్ నిర్మాత బీఏ రాజు అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నటి జమున హాజరు కానున్నారు. సభాధ్యక్షులుగా కైకల సత్యానారాయణ వ్యవహరిస్తారు. డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ. బి సభను ప్రారంభించనున్నారు. సన్మానకర్తగా దర్శకుడు ఎన్.శంకర్ విచ్చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చైర్మన్‌గా రేలంగి నరసింహారావు, ఫెస్టివల్ చైర్మన్‌గా లయన్ ఎ. విజయ్‌కుమార్ వ్యవహరించనున్నారు. శ్రీమతి టి.లలితబృందం దాసరి సినీ విభావరి నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment