Dasari
-
డీ గ్లామర్ పాత్రలే కాదు బోల్డ్ సీన్స్‌లోనూ రచ్చచేసే బ్యూటీ (ఫోటోలు)
-
వెల్కమ్ దాసరి హర్షిత.. జపాన్ నుంచి నేడు స్వదేశానికి..
సాక్షి, కరీంనగర్: తొమ్మిదో జాతీయ ఇన్స్పైర్ అవార్డుల పోటీల్లో సత్తాచాటి జిల్లా పేరు ఇనుమండింపజేసిన దాసరి హర్షిత అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొని ఆదివారం స్వదేశానికి చేరుకోనుంది. రామగిరి మండలం చందనాపూర్ జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న హర్షిత ఈనెల 4 నుంచి 11వ తేదీ వరకు జపాన్ రాజధాని టోక్యో వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సకూర కార్యక్రమంలో పాల్గొంది. గతేడాది సెప్టెంబర్ 14 నుంచి 16వ తేదీ వరకు ఢిల్లీ వేదికగా నిర్వహించిన 9వ జాతీయ ఇన్స్పైర్ అవార్డుల ప్రదర్శన పోటీల్లో జిల్లా నుంచి నలుగురు విద్యార్థులు హాజరవగా.. హర్సిత ప్రతిభ చూపించింది. కేంద్ర శాస్త్ర,సాంకేతిక శాఖమంత్రి జితేంద్రసింగ్ నుంచి అవార్డును అందుకున్నట్లు డీఈవో మాధవి తెలిపారు. అలాగే ఈఏడాది ఏప్రిల్ 10 నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన ఫైన్ కార్యక్రమంలో పాల్గొని నేరుగా రాష్ట్రపతికి తను రూపొందించిన బహుళ ప్రయోజనకర హెల్మెట్ గురించి వివరించి మన్ననలు పొందింది. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ప్రగతిమైదాన్‌లో మే 10, 11, 12వ తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనలోనూ ప్రతిభ చాటింది. మనరాష్ట్రం నుంచి 9వ జాతీయ ప్రదర్శన పోటీల్లో విజేతలైన 8 మంది విద్యార్థులతో కలిసి అంతర్జాతీయ కార్యక్రమానికి ఎంపికై ంది. దేశం నలుమూలల నుంచి ఏడు, ఎనిమిది, తొమ్మిదో జాతీయ ఇన్స్పైర్ అవార్డు– మనక్ పోటీల్లో విజేతలైన 59 మంది విద్యార్థులు, అధికారులు ఇందులో పాల్గొన్నారు. మనరాష్ట్రం నుంచి ఆరుగురు విద్యార్థులు ఇందులో ఉన్నారు. ఆదేశంలోని మన రాయబార కార్యాలయంతోపాటు పలు విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక వారసత్వం కలిగిన 15కు పైగా ప్రదేశాలను తిలకించి రావడం హర్షిత ప్రత్యేకత. పాఠశాల స్థాయి నుంచే.. పాఠశాలస్థాయి ప్రదర్శన నుంచే చైనా, సైప్రస్, ఉజ్బెకిస్తాన్, తజబిస్తాన్ లాంటి దేశాల విద్యార్థులు పాల్గొన్న అంతర్జాతీయస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనడానికి అరుదైన అవకాశం మనదేశంలోని గ్రామీణి ప్రాంతానికి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని హర్షితకు రావడం విశేషం. ఆమెను ప్రో త్సాహించిన గైడ్ టీచర్ సంపత్‌కుమార్‌ను డీఈవో మాధవి, జిల్లా సైన్స్ అధికారి రవినందన్‌రావు, హెచ్ఎం లక్ష్మి, ఉపాధ్యాయులు అభినందించారు. -
దాసరి సినీ అవార్డుల ప్రదానోత్సవం
ఫిలిం ఎనాలిటికల్ అండ్ అప్రిషియేషన్ సొసైటీ (ఫాస్) ఈ ఏడాది దాసరి ఫిల్మ్ అవార్డు విజేతల ఎంపిక వివరాలను సంస్థ అధ్యక్షులు, పూర్వ సెన్సార్ బోర్డ్ సభ్యులు కె. ధర్మారావు వెల్లడించారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఈ నెల 6న హైదరాబాద్‌లో జరగనుంది. డైరెక్టర్ ఆఫ్ ది ఇయర్‌గా శేఖర్ కమ్ముల (ఫిదా), ఉత్తమ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ఉత్తమ గాయని మధుప్రియ, ప్రశంసా దర్శకుడు అవార్డు వడ్డేపల్లి కృష్ణ (లావణ్య విత్ లవ్‌బాయ్స్), దాసరి ప్రతిభా పురస్కారాలను సంపూర్ణేష్ బాబు, శివపార్వతి, సంగీత దర్శకులు వాసూరావు, మాటల రచయిత సంజీవని, దాసరి విశిష్ట సేవా పురస్కారాన్ని రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడు లయన్ డా.ఎ. నటరాజుకు ప్రదానం చేయనున్నారు. ఫాస్–దాసరి కీర్తి కిరిట సిల్వర్క్రౌన్ అవార్డులను దర్శకులను కోడి రామకృష్ణ, టీవీ యాంకర్ సుమ కనకాలకు అందజేయనున్నారు. దాసరి జీవన సాఫల్య పురస్కారాన్ని సూపర్‌హిట్ సినీ వార పత్రిక ఎడిటర్ అండ్ పబ్లిషర్ నిర్మాత బీఏ రాజు అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నటి జమున హాజరు కానున్నారు. సభాధ్యక్షులుగా కైకల సత్యానారాయణ వ్యవహరిస్తారు. డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ. బి సభను ప్రారంభించనున్నారు. సన్మానకర్తగా దర్శకుడు ఎన్.శంకర్ విచ్చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చైర్మన్‌గా రేలంగి నరసింహారావు, ఫెస్టివల్ చైర్మన్‌గా లయన్ ఎ. విజయ్‌కుమార్ వ్యవహరించనున్నారు. శ్రీమతి టి.లలితబృందం దాసరి సినీ విభావరి నిర్వహించనున్నారు. -
అందుకే మోహన్‌బాబు ‘నట విశ్వ సార్వభౌమ’ – టీయస్సార్
‘‘నటుడిగా నేను 40 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా నన్ను తెలుగు తెరకు పరిచయం చేసిన దాసరిగారి సమక్షంలో వైజాగ్‌లో ఫంక్షన్ చేశారు టీయస్సార్. కళాకారులను గౌరవించాలనే ఆలోచన రావడం మామూలు విషయం కాదు. ఈ ఆలోచన వచ్చిన వ్యక్తి నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో వన్ అండ్ వోన్లీ పర్సన్ టీయస్సార్. ఇది డబ్బుతో కూడుకున్న విషయం కాదు. మనసు ఉండాలి. అభినందనలు వేరు కానీ నాకు ఈ బిరుదు (విశ్వ నట సార్వభౌమ) ప్రదానం చేయటం ఇబ్బందిగా అనిపించింది. టీయస్సార్ నేను ఊళ్లో లేనప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత నీకీ బిరుదు ఇస్తున్నాం అంటే కాదనలేకపోయాను’’ అన్నారు మంచు మోహన్‌బాబు. టి.సుబ్బిరామి రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్, విశాఖపట్టణం, బెంగళూర్, ముంబై, ఢిల్లీ.. ఇలా పలు ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ 17న హైదరాబాద్‌లో ‘కాకతీయ కళా వైభవ మహోత్సవం’ నిర్వహించనున్నారు. ఈ విశేషాలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో టీయస్సార్ మాట్లాడుతూ– ‘‘దాదాపు 600 ఏళ్ల క్రితం ఓరుగల్లు ముఖ్య పట్టణంగా కాకతీయ రాజులు తెలుగు కళలను, నాగరికతను అద్భుతంగా ప్రోత్సహించారని ప్రసిద్ధి. వారి పాలన స్వర్ణ యుగం అని కవులు వర్ణించారు. ఆ తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఎంతో ప్రోత్సహించారు. ఈసారి మేం టీయస్సార్ కాకతీయ లలిత కళా పరిషత్ ఏర్పాటు చేశాం. తెలంగాణ ముఖ్య ప్రాంతాలలో కాకతీయ కళా వైభవోత్సవాలు చేయాలి, తెలుగు ప్రజల్ని మరోసారి రంజింపజేయాలని నిశ్చయించుకున్నాం. ఇందులో భాగంగా ముందు హైదరాబాద్‌లో ఈ నెల 17న భారీ కార్యక్రమం ఏర్పాటు చేశాం. 42 ఏళ్లుగా ఏకధాటిగా నటిస్తూ, 560 సినిమాల్లో విభిన్న పాత్రలు చేసి, తనకంటూ ఓ స్థాయి క్రియేట్ చేసుకున్న మోహన్‌బాబుకు ‘విశ్వ నట సార్వభౌమ’ బిరుదును ప్రదానం చేయబోతున్నాం. ఆ రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుగారు వస్తున్నారు’’ అన్నారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ – ‘‘సుబ్బిరామి రెడ్డిగారి ఇంటి పేరు ‘టి’ అని కాకుండా కళా అని పెట్టి ఉంటే బావుండేది. కళాకారులను సత్కరించి తాను సంతృప్తి పొందుతుంటాడు. కాకతీయ శబ్దాన్ని కళా పరిషత్‌లోకి తీసుకొచ్చారు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని చేసిన రాజ్యాధినేత రుద్రమదేవి. కాకతీయ ద్వారంలోనే కళ కనపడుతుంది. మోహన్‌బాబు తెర మీద కనపడగానే ఈలలు కొడతారు. ఆయన మమల్ని ఆప్యాయంగా అగ్రజా అని పిలుస్తుంటారు. ఆయనకు సన్మానం జరుగుతుంది అంటే మాకు జరిగినట్టే. ఆ బిరుదుకు మోహన్‌బాబు అర్హుడు’’ అన్నారు. రాజేంద్రప్రసాద్, విష్ణు, మనోజ్, పోసాని కృష్ణమురళి, అలీ, జయప్రద, జయసుథ, లక్ష్మీప్రసన్న, శ్రియ తదితర సినీరంగ ప్రముఖులు, మధుసూ«ధనాచారి, కె. స్వామిగౌడ్‌తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొననున్నారు. -
దాసరిగారు మనుషుల్లో మాణిక్యం– చిరంజీవి
‘‘దాసరిగారి గురించి ఇలాంటి పుస్తకాలు ఎన్ని రాసినా, ఇంకా మిగిలి ఉండే ఘనమైన చరిత్ర ఆయనది. ఆయన తెలుగువారికి దిగ్దర్శకులుగా ఉండటం మనం చేసుకున్న అదృష్టం. తెలుగు పరిశ్రమ ఉన్నంత కాలం ఆయన్ను మర్చిపోలేము’’ అన్నారు నటుడు చిరంజీవి. దర్శకరత్న దాసరి నారాయణరావుగారు జీవితంపై సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు రచించిన ‘తెరవెనుక దాసరి’పుస్తకాన్ని చిరంజీవి ఆవిష్కరించి, కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డికి అందించారు. రెండో ప్రతిని దర్శకుడు రాఘవేంద్రరావుకి అందించారు. చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఈ సభలో ముఖ్యంగా ఇద్దరి గురించి ప్రస్తావించుకోవాలి. ఒకరు మట్టిలో మాణిక్యం. ఒకరు మనుషుల్లో మాణిక్యం. మనుషుల్లో మాణిక్యం అన్నా... సినీ పరిశ్రమలో తలమానికం అన్నా.. సినీకార్మికులకు గుండె ధైర్యం ఇచ్చే భరోసా అన్నా... అది మరెవరో కాదు లేట్ ది గ్రేట్ దాసరిగారు. ఒక దాతగా, దర్శకునిగా, దార్శనికుడిగా ఆయన ఆర్జించిన కీర్తి విశేషం. అలాంటి చరిత్రకారుడు మన మధ్య లేకపోవడం తీరని లోటు. కానీ ఆయన చాలా మంది హృదయాల్లో జీవించి ఉండటం చాలామందికి స్ఫూర్తిదాయకం. అలాంటి దాసరిగారి గురించి ‘తెరవెనుక దాసరి’ పుస్తకాన్ని తీసుకువచ్చిన మట్టిలో మాణిక్యం పసుపులేటి రామారావుగారు. దాసరిగారి స్టేటస్‌కి తగ్గట్లుగా ఈ పుస్తకావిష్కరణను మెగా లెవల్లోనే చేద్దామనుకున్నాం. వెంటనే టి.సుబ్బిరామిరెడ్డిగారిని, ఈ వేడుకకు మీరెంతవరకు సహాయం చేస్తారని అడిగితే, ఓకే అన్నారు. నేను అన్ని స్థాయిల్లో నుంచి వచ్చాను. అవకాశాలు వస్తాయా? రావా? ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలనా లేదా? అనే ఆశ నిరాశల మధ్య ఊగిసలాడాను. కాన్ఫిడెన్స్‌ను, కష్టాన్ని నమ్ముకున్నాను. ఇప్పుడు నాలాంటి వారు చాలామంది ఉన్నారు. వారందరికీ ఈ పుస్తకం సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. దాసరిగారు అంటూ ఉండేవారు ‘ఏ అడ్రస్ లేకుండా చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చి ఎదిగాడు అని’. నేను కాదు.. నాకు స్ఫూర్తి దాసరిగారు. దాసరి గారి తరువాత.. దాసరి ముందు అని చెప్పే బ్రిడ్జ్‌లా ఉన్నారాయన. ఎలాంటివారికైనా మంత్రంలాంటిది ఈ పుస్తకం’’ అన్నారు. ‘‘కథారచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా ఎంతోమంది నటులను తీర్చిదిద్దిన దాసరి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు అర్హుడు. అయనకు ఆ అవార్డ్ రావటానికి కృషి చేస్తాను’’ అని టీఎస్సార్ అన్నారు. ‘‘గురువుగారి జీవితంపై పుస్తకం రాయాలనుకున్నప్పుడు బీఏ రాజు నైతిక బలం అందించారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా ప్రోత్సహించారు. నేను రాసిన అన్ని పుస్తకాలకు అరవింద్ గారి సహకారం ఉంది. ఈ పుస్తకాన్ని చిరంజీవిగారు ఆవిష్కరిస్తే బాగుంటుందని అరవింద్‌గారికి చెప్పా. ఆ తర్వాత సురేశ్ కొండేటి కూడా సహాయం చేశారు. స్వయంగా చిరంజీవిగారు ఫోన్ చేస్తే, నేను గొంతు గుర్తుపట్టలేదు. ‘రామారావు గారూ.. మనది 40 ఏళ్ల అనుబంధం. గుర్తుపట్టలేకపోతే ఎలా’ అన్నారు. అప్పుడు బుక్ ఆవిష్కరణ గురించి చెప్పా. గ్రాండ్‌గా చేద్దామన్నారు. సహకరించిన, విచ్చేసినవారికి ధన్యవాదాలు’’ అన్నారు పసుపులేటి రామారావు. కె. రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, కోడి రామకృష్ణ, మురళీ మోహన్, సి. కల్యాణ్, యస్వీ కృష్ణారెడ్డి, రాజా వన్నెంరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు తదితరులు దాసరి గురించి మాట్లాడారు. దాసరి కుమారులు ప్రభు, అరుణ్‌కుమార్, కుమార్తె హేమాలయకుమారి, అల్లుడు రంగనా£Š పాల్గొన్నారు. -
స్వర్గం నరకం
స్త్రీ చేతి సంసారపు సున్నితపు త్రాసు నాటి సినిమా నరకంలో సలసలకాగే నూనెలో మనిషిని వేగిస్తారట. అది సంసారంలో భార్య పలికే పరుషమైన మాటతో సమానం కావచ్చు. స్వర్గంలో తేనె ప్రవాహాలు దప్పిక తీరుస్తాయట. అది సంసారంలో భార్య ఆదరంగా అందించే మంచినీరే కావచ్చు. స్వర్గం ఏదో ఆకాశంలో... నరకం పాతాళంలో ఉండవు. అవి పక్క పక్కనే ఉంటాయి– బొమ్మా బొరుసులా. భార్య దేనిని ఎంచుకుంటే అది దక్కుతుంది. సంసారం సున్నితపు త్రాసులాంటిది. మగవాడు ఉత్త దండెంలాంటి వాడు.స్త్రీ తన చేతితో ఆ దండేన్ని స్వర్గం వైపు వంచితే జీవితం స్వర్గం అవుతుంది. నరకం వైపు వంచితే బతుకు నరకం అవుతుంది. మంచి మాటలే తూకం రాళ్లు... పట్టువిడుపులే తక్కెడ గొలుసులు... దయా క్షమలే చెరోవైపు పళ్లేలుగా వ్యవహరిస్తే ఏ కాపురపు ముల్లైనా స్వర్గం వైపు వొంగుతుంది. లేదంటే అది నరకాన్ని దభేలున తాకుతుంది. జయలక్ష్మి (పాత్ర పేరు కూడా అదే), అన్నపూర్ణ (పాత్ర పేరు అన్నపూర్ణే) కాలేజీలో స్నేహితులు. జయలక్ష్మి టపాకాయ లాంటిది. మంచికీ చెడ్డకీ టపాటపామని పేలుతుంటుంది. అన్నపూర్ణ మౌనంగా వెలిగి అగరుబత్తీ లాంటిది. నిశ్శబ్దంగా పరిమళం ఇవ్వడమే తప్ప, తనను తాను కాల్చుకోవడం తప్ప ఎదుటివారి మీద నిందలు వేసే మనిషి కాదు. జయలక్ష్మికి మగవాళ్లంటే సదభిప్రాయం లేదు. వాళ్లు తాగుతారని, తిరుగుతారని, పెళ్లి చేసుకుని భార్యలను అవస్థల పాలు చేస్తారని అనుకుంటూ ఉంటుంది. అన్నపూర్ణ మాత్రం అలాంటి బుద్ధులు కేవలం మగవారికే ఉండవని ఆడవారి అండ లేకుండా తప్పు చేసే మగవాడు ఉండడని అభిప్రాయపడుతూ ఉంటుంది. ఈ ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒకరి పెళ్లికి మరొకరు హాజరవుదామనుకుంటారు. కాని అనుకోకుండా ఇద్దరి పెళ్లిళ్లూ ఒకే ముహుర్తానికి నిశ్చితమవుతాయి. ఇద్దరూ స్వర్గంలాంటి కాపురాలను ఊహిస్తారు. కాని జయలక్ష్మి కాపురం స్వర్గం. అన్నపూర్ణ కాపురం నరకం. జయలక్ష్మి భర్త ఈశ్వరరావు (పాత్ర పేరు అదే) లెక్చరర్. మంచివాడు. భార్య అంటే పంచ ప్రాణాలు. ‘ఏమండీ సాయంత్రం ఐదు గంటలకే ఇంటికి వచ్చేస్తారుగా’ అని భార్య అడిగితే ‘ఐదు వరకు ఎందుకు... నాలుగున్నరకే వచ్చేస్తాను’ అని భార్య చుట్టే తిరిగే రకం. జయలక్ష్మికి కూడా భర్త అంటే ఎంతో అనురాగం. భర్తను విడిచి ఒక్కరోజు ఊరు వెళ్లాల్సి వస్తే స్పృహ తప్పి పడిపోతుంటుంది. భర్త కాలేజీ క్యాంప్‌కు వారం రోజులు వెళతానంటే ఏడుపు మొదలెడుతుంటుంది. భర్త వారం రోజులు క్యాంప్‌కు వెళతాడు. అతణ్ణి రిసీవ్ చేసుకోవడానికి జయలక్ష్మి స్టేషన్‌కు వెళుతుంది. స్టేషన్లో కంపార్ట్మెంట్లో నుంచి భర్త దిగుతాడు. అతడితో పాటు మరో లేడీ లెక్చరర్ కూడా దిగుతుంది. ‘ఈమె మా కాలేజ్ లెక్చరర్.’ అని పరిచయం చేస్తాడు. అంతే. జయలక్ష్మి గుండెల్లో అనుమానపు టపాకాయలు టపాటపామని పేలుతాయి. ఈశ్వరరావు కొంచెం మతిమరుపు మనిషి. మాటల్లో పడితే ఇంటి దగ్గర భార్యను మర్చిపోతుంటాడు. ఒకరోజు జయలక్ష్మి ఇంటికి త్వరగా రమ్మంటుంది. కాని సాయంత్రం స్నేహితులతో మాటల్లో పడి ఎగ్జిబిషన్‌కు వెళతాడు. అక్కడ తోటి కాలేజీ లెక్చరర్ కనిపిస్తే ఆమెతో మాటల్లో పడతాడు. అంతే కాదు పొరపాటున తన అద్దాలకు బదులు ఆమె అద్దాలను ఇంటికి తెస్తాడు. అతడి రాకలో ఆలస్యానికి ఇల్లు పీకి పందిరేసున్న జయలక్ష్మిని చూసి కంగారుగా ఏవో అబద్ధాలు చెప్తాడు. కాని అతడు తెచ్చిన అద్దాలు అతడు పని చేసే కాలేజీ లెక్చరర్వని బయటపడగానే జయలక్ష్మిలో అనుమానం రూఢీ అవుతుంది. అతడికి ఆమెతో సంబంధం ఉందని నమ్ముతుంది. ఆ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ఈశ్వరరావు జీవితాన్ని నరకప్రాయం చేస్తుంది. ‘మీరు ఎవరితో తిరిగితే నాకేం. ఎందరితో తిరిగితే నాకేం. మీరు దాంతోనే తిరగండి’ అని పుట్టింటికి వెళ్లిపోతుంది. ఈశ్వరరావుకు నిజంగానే ఇదంతా నరకం. మరోవైపు అన్నపూర్ణ సంసారం ఘోరంగా ఉంటుంది. ఆమెను మోసం చేసి పెళ్లి చేసి ఉంటారు. భర్త మోహన్‌బాబు (పాత్ర పేరు మోహన్‌బాబు) ఉత్త తిరుగుబోతు. పెళ్లయిన రోజు రాత్రి కార్యం వేళకు అందరూ పెళ్లికొడుకును వెతుకుతుంటే అతడు భార్యతో కాకుండా మరొకరితో గడుపుతూ పట్టుబడతాడు. పెళ్లింట్లోనే పెద్ద గొడవైపోతుంది. అన్నపూర్ణ తండ్రి ఈ పెళ్లిని పెటాకులు చేద్దామని చూస్తాడు. కాని అన్నపూర్ణ ఒప్పుకోదు. తన రాత ఇలాగే ఉందని గ్రహించి మోహన్‌బాబుతోనే వెళ్లడానికి ఇష్టపడుతుంది. అత్తారింటికి చేరాక కూడా ఆమెకు సుఖం ఉండదు. భర్త ఆడవాళ్లను నేరుగా ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాడు. లేదంటే స్నేహితులతో పేకాటకు వెళ్లిపోతుంటాడు. అన్నపూర్ణ సహనంగా అతడి ప్రవర్తనను భరిస్తూ ఉంటుంది. మధ్యలో స్నేహితురాలిని చూడటానికి వచ్చిన జయలక్ష్మి అతడి ప్రవర్తన చూసి అన్నపూర్ణను చెడామడా తిడుతుంది. ‘నాతో వచ్చెయ్. అలాంటి వెధవకు వెంటనే విడాకులు ఇచ్చి పారెయ్’ అంటుంది. అయినా అన్నపూర్ణ వినదు. అతడి ప్రవర్తన చూసి చూసి తల్లి ఎదిరించి ఆ పెనుగులాటలో మెట్ల మీద పడి దొర్లి చనిపోతుంది. అప్పుడు కూడా అన్నపూర్ణ భర్తతో మెత్తగా అతడి బాధ్యతను గుర్తు చేస్తుంది తప్ప తీవ్ర నిందకు దిగదు. ఇదంతా చూసి మోహన్‌బాబు కరిగిపోతాడు. ఇంత దుర్మార్గంగా ఉన్నా ఈ స్త్రీ ఇంత సహనంగా ఉండటం చూసి మారిపోతాడు. భార్యను మనస్ఫూర్తిగా అంగీకరిస్తాడు. ఇప్పుడు ఆ సంసారం స్వర్గం. స్వర్గంలా ఉండాల్సిన కాపురాన్ని జయలక్ష్మి సర్వనాశనం చేసుకుంది. లేడీ లెక్చరర్ ఇంటికి వెళ్లి భర్త ఏదో మాట్లాడుతుండగా జనాన్ని వేసుకొని వెళ్లి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నానని గొడవ గొడవ చేస్తుంది. అంతే కాదు భర్తకు కావల్సింది తన అడ్డు తొలగడమే అని భావించి ఆత్మహత్యాయత్నానికి కూడా పూనుకుంటుంది. విడాకుల కాగితం రాసి భర్త మొహాన కొడుతుంది. వీటన్నింటి పరాకాష్టగా ఆ లేడీ లెక్చరర్ ఈమె చేసే రాద్ధాంతాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటుంది. ‘మంచి మనిషి ఈశ్వరరావు కాపురం అవస్థల పాలు కాకుండా ఉండేందుకే ఈ పని చేస్తున్నానని’ ఆమె రాసి చచ్చిపోతుంది. ఆమె చావు చూసి సున్నిత మనస్కుడైన ఈశ్వరరావు పిచ్చివాడైపోతాడు. అసలు వాస్తవాలను ఎట్టకేలకు గ్రహించిన జయలక్ష్మి భర్తను వెతుక్కుంటూ బయలుదేరి అతణ్ణి చేరుకోవడంతో కథ ముగుస్తుంది. భర్తలకు సంపాదించడం తెలుసు. బాధ్యతలను మోయడం తెలుసు. అవసరాలు తీర్చడం తెలుసు. కాని సంసారపు ఆటుపోట్లను సజావుగా అర్థం చేసుకోవడం తెలీదు. సంసారానికి స్త్రీయే కేంద్రకం తప్ప పురుషుడు కాదు. ఆమె సంయమనం సమయస్ఫూర్తి సహనం లౌక్యం లేకపోతే ఆ సంసారం అభాసుపాలవుతుంది. పాలూనీళ్లులా కలిసి ఉండాల్సిన భార్యభర్తలు నిప్పు ఉప్పుల్లా మారరాదని చెప్పిన సినిమా స్వర్గం నరకం.కలతలతో కలహాలతో చిన్న గొడవలను పెద్ద సమస్యలుగా సృష్టించుకుంటున్న భార్యాభర్తల ఇవాళ్టి రోజుల్లో కూడా ఈ సినిమా ఒక లెసన్. ఒక పర్సనాల్టీ కరెక్షన్ క్లాస్. ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్. యూ ట్యూబ్‌లో ఉంది. వాచ్ ఇట్. కొత్తవాళ్లతో దాసరి తీసిన సూపర్‌హిట్ స్వర్గం నరకం 1975లో విడుదలైంది. ఇది దర్శకుడు దాసరి నారాయణరావుకు పదో సినిమా. గతంలో ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్తవాళ్లతో ‘తేనె మనసులు’ తీసి కృష్ణ వంటి స్టార్‌కు జన్మనిచ్చారు. ఆ స్ఫూర్తితో దాసరి కూడా కొత్తవాళ్లతో సినిమా తీయాలని ‘స్వర్గం– నరకం’కు నడుం బిగించారు. హైదరాబాద్‌లో నాటకాల్లో కనిపించిన విశ్వేశ్వరావును ‘ఈశ్వరరావు’గా పేరు మార్చి ఒక హీరోగా తీసుకున్నారు. మరో పాత్రకు బోసుబాబు అనే నటుడు పోటీ పడ్డాడు. కాని దాసరి ఆ వేషాన్ని భక్త వత్సలం అనే నటుడికి ఇచ్చారు. ఆ భక్తవత్సలానికి పేరు మార్చి ‘మోహన్‌బాబు’గా ‘స్వర్గం–నరకం’లో పురుడుపోశారు. బెజవాడలో నాటకాల్లో ఫేమస్ అయిన అన్నపూర్ణ ఒక హీరోయిన్ కాగా తర్వాతి రోజుల్లో ‘ఫటాఫట్’ జయలక్ష్మిగా పేరు పొందిన జయలక్ష్మి మరో హీరోయిన్. ఈ సినిమాలో దర్శకుడు కోడి రామకృష్ణ ఒక పాత్రలో కనిపిస్తాడు. అలాగే ఆ తర్వాతి కాలంలో ఫేమస్ అయిన ఆర్.నారాయణమూర్తి, జీవా తదితరులు అతి చిన్న పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో ఆచారి అనే పాత్ర ముఖ్యమైంది. అది కథకు అనుసంధానకర్తగా ఉంటుంది. పరాన్నభుక్కుగా జీవిస్తూ అందరి తలలో నాలుకలా ఉండే ఆ పాత్రను దాసరే స్వయంగా పోషించారు. ‘ఫినిష్’ అనేది ఆయన ఊతపదం. అప్పట్నించి ఆ మాట చాలా ఫేమస్ అయ్యింది. ఇప్పటికీ ‘ఫినిష్’ ఫేమస్సే. దాసరి సింబాలిక్ షాట్స్ ఈ సినిమాలో దాసరి సింబాలిక్ షాట్స్‌ను వాడారు. దానికి కారణం ఉంది. సినిమా పూర్తయ్యాక అన్నపూర్ణ క్లోజప్స్ పంపిణీదారులకు నచ్చలేదు. ఏం చేయాలా అని ఆలోచించిన దాసరి క్లోజప్స్ వచ్చినప్పుడల్లా కాలుతున్న అగరుబత్తుల్ని సింబాలిక్‌గా చూపించారు. అవసరం కోసం చూపినా ప్రేక్షకులు అది దర్శకుడి మంచి సృజనగా భావించారు. అలాగే జయలక్ష్మి మనసులో భావోద్వేగాలు కలిగినప్పుడల్లా టపాకాయలు పేలుతున్న చప్పుడు వినిపిస్తుంది. ఇదీ జనానికి నచ్చింది. సినిమా క్లయిమాక్స్‌లో భార్యాభర్తల అనుబంధాన్ని పాలూ నీళ్లతో పోలుస్తూ సింబాలిక్ షాట్స్ చూపడం ఆ రోజుల్లో కొత్తదనంగా భావించారు. ‘‘ఆడది మగవాణ్ణి గుప్పిట్లో కాదమ్మా పెట్టుకోవాల్సింది.. గుండెల్లో పెట్టుకోవాలి. మాటల్తో కాదమ్మా కట్టేయాల్సింది మనసుతో కట్టేయాలి. హక్కుల కోసం కాదమ్మా పోరాడాల్సింది బాధ్యతలతో పోరాడాలి. బరువు బాధ్యతలతో బయట తిరిగే మనిషి లక్షా తొంభై సమస్యలతో ఇంట్లో అడుగు పెడతాడు. ఇంట్లో అడుగు పెట్టీ పెట్టగానే ఏమండీ... ఇంట్లో ఉప్పు లేదు పప్పు లేదు కుర్రాడికి జబ్బు చేసింది నాకు తలనొప్పి వచ్చింది మీరు ఎక్కణ్ణుంచి వచ్చారు ఎలా వచ్చారు ఎందుకింత ఆలస్యంగా వచ్చారు దేంతో తిరిగి వచ్చారు అని అడిగితే ఆ మగాడు ఏం సమాధానం చెప్తాడమ్మా.. ఆ ఇల్లు నరకం కాకుండా ఏమవుతుందమ్మా’’ – జయలక్ష్మి పాత్రతో ఆచారి పాత్ర – కె -
నేడు జిల్లాకు ‘దాసరి’
కిర్లంపూడిలో ముద్రగడతో భేటీ సాక్షి ప్రతినిధి, కాకినాడ : దర్శకరత్న దాసరి నారాయణరావు శుక్రవారం జిల్లాకు వస్తున్నారు. హైదరాబాద్ నుంచి సాయంత్రం 4 గంటల విమానంలో మధురపూడిలోని రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడనుంచి కిర్లంపూడిలోని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళతారు. అక్కడ రాత్రి విందు తీసుకున్న అనంతరం విశాఖపట్నం వెళ్తారు. కాపులకు బీసీ రిజర్వేషన్ల కోసం ముద్రగడ చేపట్టిన ఉద్యమంపై చంద్రబాబు సర్కార్ ఉక్కుపాదం మోపుతూ పోలీసు కేసులతో ఇబ్బందులపాలే్జస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి కాపు జేఏసీ ప్రతినిధులు ఈ నెల 11న రాజమహేంద్రవరంలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై రోజంతా చర్చించారు. దీనిపై త్వరలో హైదరాబాద్‌లో సమావేశమై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఇంతలో దాసరి ముద్రగడను కలిసేందుకు కిర్లంపూడి రానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ రాదు!
ముద్రగడ పోరుకు కాపు నేతల సంపూర్ణ మద్దతు సాక్షి, హైదరాబాద్: ‘కాపు రిజర్వేషన్ల ఉద్యమం ఉధృతమైంది. ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ రాదు. ఎంత దూరమైనా పోవాల్సిందే, పోరాడాల్సిందే’ అని కాపు ప్రముఖులు శపథం చేశారు. పోరాటంపై భవిష్యత్ కార్యక్రమాన్ని చర్చించేందుకు హైదరాబాద్‌లో పర్యటిస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ఆయన అనుచరుల గౌరవార్థం ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు మంగళవారమిక్కడి తన స్వగృహంలో విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ముద్రగడ.. ఉద్యమ ప్రారంభం నుంచి తాను, తన కుటుంబ సభ్యులు, కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులు ఎదుర్కొన్న కష్టాలను సుదీర్ఘంగా వివరించారు. వెన్నంటే ఉంటా: చిరంజీవి ముద్రగడకు మద్దతు ఇవ్వడంతో మీడియాలో ఓ వర్గం తనను కొందరివాడిగా ముద్ర వేసిందని, అయినా జంకే పరిస్థితి లేదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అన్నారు. ఉద్యమాన్ని వెన్నంటే ఉంటానన్నారు. ముద్రగడ ఎంతవరకు పోరు చేస్తే అంతవరకు వెళతానని దాసరి భరోసా ఇచ్చారు. తమను శత్రువులుగా చూసే వారి పట్ల జాలి పడడం తప్ప చేయగలిగిందేమీ లేదని అంబటి రాంబాబు అన్నారు. వచ్చేనెల 11న రాజమహేంద్రవరంలో తలపెట్టిన జేఏసీ సమావేశానికి కాపు ప్రముఖులందర్నీ ఆహ్వానించినట్టు ముద్రగడ చెప్పారు. చంద్రబాబు మాట మీద నిలబడే పరిస్థితి కనిపించడం లేదని, అందుకు భవిష్యత్ కార్యాచరణకు రూపుదిద్దుతున్నామన్నారు. వచ్చే నెల 16 తర్వాత మరోసారి హైదరాబాద్ వచ్చి ప్రముఖులందరితో చర్చలు జరుపుతామన్నారు. విందుకు మాజీ కేంద్ర మంత్రి పళ్లంరాజు, వైఎస్సార్సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బీజేపీ నాయకుడు అద్దేపల్లి శ్రీధర్, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. -
కాపులపై విషం చిమ్ముతున్న ముఖ్యమంత్రి
♦ దాసరి, చిరంజీవి, పల్లంరాజు, బొత్స తదితరుల మండిపాటు ♦ కాపు మంత్రులతో పూటకో మాట మాట్లాడిస్తున్నారని ధ్వజం ♦ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: కాపు వర్గీయుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విషపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆ వర్గానికి చెందిన ప్రముఖ నాయకులు పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం దీక్షను కూడా తప్పుదారి పట్టించే రీతిలో మంత్రుల చేత తప్పుడు విమర్శలు, ఆరోపణలు, విభిన్న ప్రకటనలు చేయిస్తున్నారని కాపు సామాజికవర్గ ప్రముఖులు దాసరి నారాయణరావు, కొణిదల చిరంజీవి, ఎం.పల్లంరాజు, బొత్స సత్యనారాయణ, సి.రామచంద్రయ్య, తోట చంద్రశేఖర్, అంబటి రాంబాబు, కె.కన్నబాబు, ఎం.వి.కృష్ణారావు, గంగయ్యనాయుడులు గురువారం విడుదల చేసిన ఓ ప్రకటన లో ఖండించారు. ముద్రగడకు ఇచ్చిన హామీ ల విషయంలో కలెక్టర్, డీఐజీ ఇచ్చిన వివరణకు భిన్నంగా ముగ్గురు కాపు మంత్రులు చేసిన ప్రకటనల పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ముగ్గురు మంత్రులు మాట్లాడక ముందు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారని, ఆయన ఆదేశాల మేరకు కలెక్టర్, డీఐజీల వివరణకు భిన్నంగా ప్రకటనలు చేశారన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు విషపూరిత చర్యగా అనుమానం వ్యక్తం చేశారు. ఇంతగా అవమానిస్తారా..: ముద్రగడ కుటుంబీకులను ముఖ్యంగా కుమారుడిని పైశాచికంగా తరిమి కొట్టిన విధానాన్ని, ముద్రగడ కోడలిపై ఉచ్చరించడానికి వీలుగాని పరుష పదజాలం ఉపయోగించి ఆ కుటుంబాన్ని అవమానించిన తీరును తప్పుపట్టారు. ఈ అవమానం ఆయన కుటుంబానికి జరిగినది కాదని, మొత్తం కాపు జాతికి జరిగిందిగా భావిస్తున్నామన్నారు. గతంలో దీక్ష విరమింప చేయడానికి కిర్లంపూడిలో మధ్యవర్తులైన మంత్రులు ఇచ్చిన హామీలను, అమలు పరచకుండా మోసం చేసినట్టుగానే ఇప్పుడూ మోసం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ముద్రగడ సమక్షంలో కలెక్టర్, డీఐజీ ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు. కాగా, ముద్రగడ దీక్షను సమర్థిస్తూ ఈ నెల 13న కాపు ప్రముఖులు సమావేశమై ప్రభుత్వ వైఖరిని ముక్తకంఠంతో ఖండించి, దీక్షను విరమించే ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేసి ముద్రగడ ప్రాణాలు కాపాడాలని చేసిన డిమాండ్‌కు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ఒత్తిడితోనే ప్రభుత్వం స్పందించిందన్నారు. తామంతా ముద్రగడ దీక్షపై చర్చించేందుకు గురువారం విజయవాడ వెళ్లాల్సి ఉండిందని, అయితే బుధవారం రాత్రి దీక్షపై కలెక్టర్, డీఐజీల ప్రకటన వెలువడిన నేపథ్యంలో పర్యటనను విరమించుకున్నామన్నారు. -
ముద్రగడకు ఏదైనా హాని జరిగితే సర్కారుదే బాధ్యత
చంద్రబాబుపై కాపు ప్రముఖుల ఫైర్ సాక్షి, హైదరాబాద్: కాపు రిజర్వేషన్ల పోరాట సమితి నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని, తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని కాపు ప్రముఖులు హెచ్చరించారు. ప్రభుత్వం రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించాలని చంద్రబాబుకు అల్టిమేటమ్ ఇచ్చారు. సామాజిక సమస్యను టైస్టు సమస్యగా మారుస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు జాతిపై బురద జల్లాలని చూస్తే చంద్రబాబు పై చల్లడానికి తమ వద్ద అంతకన్నా పెద్ద బురద ఉంది జాగ్రత్త అని హెచ్చరించారు. ముద్రగడ పద్మనాభం దీక్ష, కాపు రిజర్వేషన్ల పోరాటం, భవిష్యత్ కార్యక్రమాన్ని చర్చించేందుకు కాపు ప్రముఖులు సోమవారమిక్కడ ఓ హోటల్లో సమావేశమయ్యారు. ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు, సినీనటుడు - కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి, వైఎస్సార్సీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, కురసాల కన్నబాబు, కాంగ్రెస్ నేతలు పల్లంరాజు, సి.రామచంద్రయ్య, కాపు ప్రముఖులు ఎంవీ కృష్ణారావు, తోట చంద్రశేఖరరావు, కాపునాడు నాయకులు కఠారి అప్పారావు, బీజేపీ నాయకుడు అద్దేపల్లి శ్రీధర్ తదితరులు హాజరయ్యారు. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ముద్రగడ దీక్ష అనంతర పరిస్థితులను క్షుణ్ణంగా చర్చించారు. ప్రభుత్వ తీరును తీవ్రంగా గర్హించారు. దాసరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ తీరును గర్హిస్తూ పలు తీర్మానాలు చేసింది. అనంతరం కాపు ప్రముఖులు అంబటి రాంబాబు, బొత్స తదితరులతో కలిసి దాసరి, చిరంజీవి మీడియాతో మాట్లాడారు. వాళ్లు ఏమన్నారంటే... ఆ పద్ధతి మంచిది కాదు: దాసరి ‘‘వంగవీటి రంగాను పొగొట్టుకున్న మేము ముద్రగడ పద్మనాభాన్ని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందేమోనన్న ఒక ఆవేదనతో ఈ సమావేశాన్ని ఈరోజున ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం దీనిపట్ల, ఆయన పట్ల, ఆ జాతిపట్ల చూపిస్తున్న వివక్ష చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇది ఒక సామాజిక సమస్య. సామాజిక సమస్యను టైస్టు సమస్యగా భావించి ప్రభుత్వం తీసుకుంటున్న విధానం.. మీడియాను కట్ చేసి... కాపు సోదరులు, సోదరీమణులు ఎవరు బయటికి వచ్చినా వాళ్లను అరెస్టులు చేయడం, సాయంత్రం వరకు పోలీసు స్టేషన్లలో పెట్టడం, మాట్లాడడానికి అవకాశం లేకుండా జామర్లు పెట్టడం, ముద్రగడతో మాట్లాడడానికి అవకాశం లేకుండా ఆస్పత్రిలోనూ జామర్లు పెట్టడం ఇది ఎక్కడా, బహుశా ఎక్కడా ఉండదు.. మనం ఆంధ్రాలో ఉన్నామా, ఇండియాలో ఉన్నామా? పాకిస్తాన్లో ఉన్నామా? అనే వాతావరణం తూర్పు, పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాల్లో కల్పించడం భాదాకరం. కాబట్టి మేము చర్చించడం జరిగింది. దీని మీద ప్రభుత్వం స్పందించి... ఆయన (ముద్రగడ ) జేఏసీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు కాబట్టి ప్రభుత్వం వాళ్లతో చర్చించి దీనికి ఒక పరిష్కారం తీసుకురావాలి. దానికి మేమందరం ఏకకంఠంతో..ఆయన వెనుక మేమున్నామని చెబుతున్నాం. జాతి వెనుక మేమంతా ఉన్నాం, ఎవ్వరూ ఒంటరి మాత్రం అని అనుకోవద్దు అని చెప్పడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ప్రభుత్వానికి వదిలేస్తున్నాం. రెండు రోజుల గడువు ఇస్తున్నాం. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై మా నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి. ’’ ప్రభుత్వానిదే బాధ్యత: చిరంజీవి ‘‘ముద్రగడ పద్మనాభం దీక్ష పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా అప్రజాస్వామికం. దీక్షకు కూర్చున్న రెండు గంటల లోపే ఆ ఇంటి తలుపులు పగులగొట్టి, నిర్బంధించి అయోమయ పరిస్థితి అంతటా కల్పించారు. అక్కడకు వచ్చిన ప్రజల పట్ల ప్రత్యేకించి మహిళల పట్ల అసభ్యంగా, అమానుషంగా ప్రవర్తించారు. చివరకు ముద్రగడ కుటుంబ సభ్యులు చివరకు వారి బిడ్డలు, కోడళ్లు, భార్య పట్ల కూడా పోలీసులు వివక్షతో అమానుషంగా ప్రవర్తించడం హేయమైన చర్య. ఈ పరిస్థితి చాలా దురదృష్టకరం. మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. అయినా ముద్రగడ పద్మనాభం అడక్కూడనిది ఏమి అడిగారు? ముద్రగడ అదనంగా ఏమి అడిగారు గనుక..? మేనిఫెస్టోలో ఏమి పెట్టారో, ఎన్నికల సమయంలో ఏమి చేస్తామని హామీలు ఇచ్చారో.. ఎన్నికల సంఘానికి అఫిడవిట్‌గా సమర్పించిందే అమలు చేయమని ముద్రగడ గారు అడిగారు. తునిలో జరిగిన అనుకోని సంఘటనను మేమెవ్వరం సమర్ధించబోం. హర్షణీయం కాదు. కాకపోతే అమాయకులను అరెస్టు చేయడమే అన్యాయం.ముద్రగడకు సంఘీభావం తెలుపడానికే మేం ఇక్కడ సమావేశమయ్యాం. ఆయన (ముద్రగడ) ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆయనకు ఏమీ జరక్కుండా చూడాలి. ఆయనకు జరగరానిది ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.’’ తీర్మానాలు ఇవీ... : ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్షకు సంపూర్ణ మద్దతును ప్రకటించడమే కాకుండా ఆయన వెంటే అండగా నిలబడాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై సమావేశం ఆందోళనను వ్యక్తం చేసింది. ► ముద్రగడ పద్మనాభం ఇంటి తలుపులు పగులగొట్టి నిర్బంధించిన విధానాన్నీ, మహిళలని కూడా చూడకుండా భార్య, కోడళ్లను కూడా నేరస్తుల కంటే హీనంగా పోలీసులు ప్రవర్తించిన తీరును ఏకకంఠంతో ఈ సమావేశం ఖండించింది. ముద్రగడ తనయుణ్ణి పాశవికంగా పోలీసులు తరిమితరిమి కొట్టి, వేధించిన విషయాన్ని ఆ సమయంలో మీడియాను బలవంతంగా బయటకునెట్టి కొందరి దగ్గర ఉన్న ఈ సంఘటన క్లిప్పింగులను బలవంతంగా లాక్కున్న విధానాన్ని.. ఈ సమావేశం- అప్రజాస్వామ్యం, ఆటవిక చర్యగా పరిగణించి ఖండించింది. ► ఏ కాపు సోదరుడు గానీ, సోదరి గానీ ఇంటి నుంచి బయటకు వస్తే తిరిగి ఇంటికి వెళ్లలేని ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెస్తూ అనధికారికంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించి- 144 మాత్రమే అమల్లో ఉందని కోర్టుకు తెలియజేయడం తీవ్ర ఆక్షేపణీయం. స నిరంకుశత్వంగా మీడియాపై ఆంక్షలు విధించి ఛానల్ ప్రసారాలను నిలిపివేయడం బాహ్య ప్రపంచానికి విషయాలు తెలియకుండా అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం. ఈ తరుణంలో అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు నాయకులతో ప్రభుత్వం మాట్లాడిస్తూ ఎదురుదాడి చేయించడం అప్రజాస్వామ్యం, అనాగరికం. వారిపై వత్తిడి చేసి విభజించి సాధించాలనే ఈ ఎత్తుగడను ఖండిస్తున్నాం. ఆయా నాయకులు దీన్ని అర్థం చేసుకుని సహకరించాలి. ► రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తున్న ఉద్రిక్తతలను తొలగించి తక్షణమే ముద్రగడ దీక్షను విరమింపజేసేందుకు ఆయన కోరిన విధంగా జేఏసీ ద్వారా చర్చలు జరిపి దీక్షను విరమింపజేయాలి. ఈ వ్యవహారంపై మళ్లీ సమావేశం నిర్వహిస్తాం. రెండు రోజుల్లో పరిష్కరించకపోతే భవిష్యత్ కార్యాచరణ.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. దేశ ప్రజల దృష్టికి ఏపీ ప్రభుత్వ తీరు కాపు నేతల సమావేశంలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్ : కాపు రిజర్వేషన్ల పోరాట సమితి నాయకుడు ముద్రగడ పద్మనాభం దీక్ష సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం, పోలీసులు సృష్టించిన బీభత్స వాతావరణాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని సోమవారమిక్కడ సమావేశమైన కాపు ప్రముఖుల సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, పౌరహక్కుల సంఘాలు, ప్రముఖ న్యాయవాదులతో నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేయించాలనే సూచనను సమావేశం సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది. ఈ కమిటీలో కాపులు కాకుండా మిగతా వర్గాల ప్రముఖులు కూడా ఉండేలా చూడాలని భావించింది. -
స్టార్స్‌కి ఆ సత్తా లేదా?
- దాసరి ‘‘చిన్న చిత్రాలకు ఆడియో, ప్రమోషన్ ఫంక్షన్స్ అవసరం. పెద్ద చిత్రాలకు వాటితో పనిలేదు. సినిమా విడుదలకు ముందే ఆడియో ఫంక్షన్స్, ట్రైలర్స్, కొన్ని సీన్స్ విడుదల చేసి ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేస్తున్నారు. విడుదలయ్యాక ఆ అంచనాలు రీచ్ కాలేక ఇటీవల చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. పెద్ద చిత్రాలకు ప్రమోషన్స్ ఎందుకు? థియేటర్లకు ప్రేక్షకులను రప్పించే సత్తా స్టార్స్‌కు లేదా? సినిమా ఫ్లాప్ అయితే హీరోలు తిరిగి డబ్బులు చెల్లించే పరిస్థితి వస్తోంది. సినిమా విడుదలకు ముందు ఎటువంటి ఫంక్షన్స్ చేయొద్దని పెద్ద చిత్రాల నిర్మాతలను కోరుకుంటున్నా. కొత్తవారితో తీసిన ఈ చిత్రం విజయవంతం కావాలి’’ అని దాసరి నారాయణరావు అన్నారు. సమర్, అక్షిత, కిమయ ప్రధానపాత్రల్లో గుండేటి సతీష్ కుమార్ దర్శకత్వంలో పేర్ల ప్రభాకర్, తౌట గోపాల్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కొత్త కొత్తగా ఉన్నది’. వంశీ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని దాసరి ఆవిష్కరించి తెలంగాణ సాంస్కృతికశాఖ చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు అందించారు. ఈ సందర్భంగా నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ- ‘‘రంగస్థల నటుడైన ప్రభాకర్‌గారు నిర్మాతగా మారడం అభినందనీయం. సతీష్ కథపై ఎంతో నమ్మకంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు’’ అన్నారు. ‘‘మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రావాలనే కోరిక ఈ చిత్రంతో తీరింది’’ అని నిర్మాతలు చెప్పారు. -
యాభై ఏళ్ల తర్వాత...
సాక్షి ‘ఫన్డే’ జూన్ 22వ తేదీ సంచిక తిరగేస్తున్నాను. ‘తపాలా’ ఫీచర్ కింద ‘అయ్యో పాప’ శీర్షికన ఓ జ్ఞాపక శకలం... కింద పాలపర్తి ధనరాజ్ అన్న పేరు చూసి, ఉలిక్కిపడ్డాను. విషయం చదివాక, ‘వాడే వీడు’ అని నిర్ధారణైంది. యాభై ఏళ్ల క్రితం కలిసి హైస్కూల్లో చదువుకున్న రోజులు గుర్తుకొచ్చాయి. మాట్లాడదామంటే కాంటాక్ట్ నంబర్ లేదు. వెంటనే సాక్షి మిత్రుడు లక్ష్మణ్ గుర్తొచ్చాడు. ఎలాగైనా వాడి నంబర్ తెలుసుకుని చెప్పమన్నాను. కాసేపటికి ఎస్సెమ్మెస్ చేశాడు. అరక్షణం ఆలస్యం చేయకుండా ధనరాజ్‌తో అరగంటపైగా మాట్లాడాను. పాలకొల్లులో వాడి ఐదుగురు అన్నదమ్ములు, నలుగురు అక్కాచెల్లెళ్లు, వాళ్లమ్మ, నాన్నగార్లతో నాకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నాను. క్షీరారామం, పాలకొలను, పాలకొల్లు... యాభయ్యవ దశకం చివరి వత్సరాలు... రెండు గోపురాలు- పెద్ద గోపురం చిన్నగోపురం- శైవం, వైష్ణవం... రెండే థియేటర్లు... రత్నం టాకీసు, లీలామహల్ (ఇప్పుడు దాసరి పిక్చర్ ప్యాలెస్)... ఎం.ఎం.కె.ఎన్.ఎమ్. హైస్కూలు... బాల్యమిత్రులు దాసరోడు, పినిశెట్టోడు, బండారోడు, గాదిరాజోడు, ఉలిసేవోడు, వంగావోడు పద్మశ్రీలు, భారతరత్నాలకంటే గొప్ప పిలుపులు... చదువుల్లో, కళల్లో పోటీ! స్కూల్ ఫైనల్ పూర్తయ్యాక, అర్ధ శతాబ్ది పాటు ఒకళ్ల గురించి మరొకళ్లకి తెలీదు. కాలచక్రం ముందుకు దూసుకుపోతూ ఒక్కసారి మాకోసం వెనక్కి తిరిగిందనిపించింది. మా స్నేహానికి ఇంకో ఎడబాటు కలగకూడదని ఒట్టేసుకున్నాం. తెగిపోయిన మా స్నేహ బంధాన్ని మళ్లీ కలిపిన ‘సాక్షి’కి మనసారా కృతజ్ఞతలు. - బండారు సత్యనారాయణ, హైదరాబాద్ -
మారిపోయిన వర్మ..!