దర్శకరత్న దాసరి నారాయణరావు శుక్రవారం జిల్లాకు వస్తున్నారు. హైదరాబాద్ నుంచి సాయంత్రం 4 గంటల విమానంలో మధురపూడిలోని రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడనుంచి కిర్లంపూడిలోని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళతారు.
-
కిర్లంపూడిలో ముద్రగడతో భేటీ
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
దర్శకరత్న దాసరి నారాయణరావు శుక్రవారం జిల్లాకు వస్తున్నారు. హైదరాబాద్ నుంచి సాయంత్రం 4 గంటల విమానంలో మధురపూడిలోని రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడనుంచి కిర్లంపూడిలోని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళతారు. అక్కడ రాత్రి విందు తీసుకున్న అనంతరం విశాఖపట్నం వెళ్తారు. కాపులకు బీసీ రిజర్వేషన్ల కోసం ముద్రగడ చేపట్టిన ఉద్యమంపై చంద్రబాబు సర్కార్ ఉక్కుపాదం మోపుతూ పోలీసు కేసులతో ఇబ్బందులపాలే్జస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి కాపు జేఏసీ ప్రతినిధులు ఈ నెల 11న రాజమహేంద్రవరంలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై రోజంతా చర్చించారు. దీనిపై త్వరలో హైదరాబాద్‌లో సమావేశమై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఇంతలో దాసరి ముద్రగడను కలిసేందుకు కిర్లంపూడి రానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.