![GHMC Workers Thanks to Director Sekhar kammula in Gandhi Hospital - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/14/shekar.jpg.webp?itok=HOpRi8-G)
గాంధీఆస్పత్రి: ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్‌కమ్ముల చూపించిన ఔదార్యానికి జీహెచ్‌ఎంసీ శానిటేషన్ సిబ్బంది విభిన్న రీతిలో కృతజ్ఞతలు తెలిపారు. గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో బుధవారం ‘థాంక్యూ శేఖర్ కమ్ముల గారు’అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. సికింద్రాబాద్ జీహెచ్‌ఎంసీ శానిటేషన్ సిబ్బందికి నెల రోజుల పాటు ప్రతిరోజు బాదంమిల్క్, బటర్ మిల్క్ అందిస్తానని పద్మారావునగర్‌కు చెందిన శేఖర్‌కమ్ముల ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని గత నెల 27న మంత్రి తలసాని సమక్షంలో ప్రారంభించారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన శేఖర్ కమ్ముల సమాజానికి ఎంతో సేవ చేస్తున్న మీకు ఏమి ఇచ్చినా తక్కువేనని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment