
ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 75 ఏళ్ల భారత స్వతంత్ర్య వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల కోసం థియేటర్లలో గాంధీ సినిమాను ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు(శుక్రవారం) ఉదయం ఆటను శేఖర్ కమ్ముల విద్యార్థులతో కలిసి దేవి థియేటర్లో చూశారు. అనంతరం ఆయన ట్వీట్ చేస్తూ.. వందల మంది విద్యార్థులతో కలిసి గాంధీ సినిమా చూడటం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందన్నారు.
చదవండి: మంచు లక్ష్మికి అరుదైన గౌరవం, 100 మంది మహిళల్లో ఒకరిగా..
‘ఈ రోజు ఉదయం దేశి థియేటర్లో గాంధీ సినిమాను వందల మంది విద్యార్థులతో కలిసి చూశాను. ఇదోక మర్చిపోలేని అనుభవం. గాంధీజీ చేపట్టిన సత్యాగ్రాహంలో భాగంగా ఈ చిత్రంలో వచ్చే సన్నివేశాలకు దేశభక్తితో పిల్లలు స్పందిస్తుంటే గర్వంగా అనిపించింది. లాంటి కార్యక్రమంలో భాగమవడం సంతోషంగా ఉంది. మీరూ గాంధీ సినిమాను చూడండి’ అని పిలుపునిచ్చారు. అలాగే భారత స్వతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన తెలంగాణ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
చదవండి: Anasuya Bharadwaj: ఇక్కడ గిల్లితే గిల్లించుకోవాలి: అనసూయ సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment