gandhi movie
-
రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్టర్ శేఖర్ కమ్ముల ధన్యవాదాలు
ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 75 ఏళ్ల భారత స్వతంత్ర్య వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల కోసం థియేటర్లలో గాంధీ సినిమాను ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు(శుక్రవారం) ఉదయం ఆటను శేఖర్ కమ్ముల విద్యార్థులతో కలిసి దేవి థియేటర్లో చూశారు. అనంతరం ఆయన ట్వీట్ చేస్తూ.. వందల మంది విద్యార్థులతో కలిసి గాంధీ సినిమా చూడటం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందన్నారు. చదవండి: మంచు లక్ష్మికి అరుదైన గౌరవం, 100 మంది మహిళల్లో ఒకరిగా.. ‘ఈ రోజు ఉదయం దేశి థియేటర్లో గాంధీ సినిమాను వందల మంది విద్యార్థులతో కలిసి చూశాను. ఇదోక మర్చిపోలేని అనుభవం. గాంధీజీ చేపట్టిన సత్యాగ్రాహంలో భాగంగా ఈ చిత్రంలో వచ్చే సన్నివేశాలకు దేశభక్తితో పిల్లలు స్పందిస్తుంటే గర్వంగా అనిపించింది. లాంటి కార్యక్రమంలో భాగమవడం సంతోషంగా ఉంది. మీరూ గాంధీ సినిమాను చూడండి’ అని పిలుపునిచ్చారు. అలాగే భారత స్వతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన తెలంగాణ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: Anasuya Bharadwaj: ఇక్కడ గిల్లితే గిల్లించుకోవాలి: అనసూయ సంచలన వ్యాఖ్యలు -
తొలి భారతీయ ఆస్కార్ విజేత కన్నుమూత
సాక్షి,ముంబై: భారతదేశానికి తొలి ఆస్కార్ అవార్డును అందించిన ప్రఖ్యాత కాస్ట్యూమ్ డిజైనర్ భాను అథియా (91) ఇక లేరు. దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం తుదిశ్వాస తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె రాధిక గుప్తా ధృవీకరించారు. ఎనిమిది సంవత్సరాల క్రితం, మెదడులో కణితి కారణంగా గత మూడేళ్లుగా, ఆమె మంచానికే పరిమితయ్యారని తెలిపారు. చివరకు గురువారం తెల్లవారు ఝామున నిద్రలోనే కన్నుమూసినట్టు ఆమె చెప్పారు. దక్షిణ ముంబైలోని చందన్వాడి శ్మశానవాటికలో తమ తల్లి అంత్యక్రియలను పూర్తి చేసినట్టు రాధిక ప్రకటించారు. 1982లో గాంధీ చిత్రానికి దుస్తుల రూపకల్పనలో ఆమె కృషికి గాను కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఆస్కార్ అవార్డు అందుకున్నారు. తద్వారా ఆస్కార్ అకాడమీ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయురాలిగా అథియా ఘనత దక్కించుకున్నారు. కొల్లాపూర్‌లో జన్మించిన అథియా ఈవ్స్ వీక్లీ సహా బొంబాయిలోని వివిధ మహిళా పత్రికలకు ఫ్రీలాన్స్ రచయితగావృత్తిని ప్రారంభించారు. పత్రిక ఎడిటర్ కోరిక మేరకు దుస్తులను డిజైన్ చేసిన భాను క్రమంగా తనలోని నైపుణ్యానికి పదును పెట్టి డిజైనర్‌గా రాణించారు. అలా ఆమె కెరీర్ గురుదత్ సూపర్ హిట్ మూవీ సీఐడీ (1956)లో ద్వారా కాస్ట్యూమ్ డిజైనర్‌గా కరియర్ ప్రారంభించారు. పాయసా (1957), చౌద్విన్ కా చాంద్ (1960) సాహిబ్ బీబీ ఔర్ గులాం (1962) తదితర గురుదత్ చిత్రాలకు పనిచేసి ఖ్యాతి గడించారు. ఆ తరువాత 1991లో, లగాన్ (2002) చిత్రానికి రెండు జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. 50 సంవత్సరాల కెరీర్లో 100 చిత్రాలు, అనేక అవార్డులను అథియా అందుకున్నారు. తన మరణం తరువాత తన కుటుంబం ట్రోఫీని జాగ్రత్తగా చూసుకోలేదని భావించి తన అకాడమీ అవార్డును ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌కు తిరిగి ఇవ్వాలని నిర్ణయించారు.15 డిసెంబర్ 2012 న, ట్రోఫీని అకాడమీకి తిరిగి ఇచ్చారు. అంతేకాదు ది ఆర్ట్ ఆఫ్ కాస్ట్యూమ్ డిజైన్ అనే పుస్తకాన్ని కూడా ఆమె రాశారు. -
హాలీవుడ్ దర్శకుడు రిచర్డ్ అటెన్ బరో మృతి
న్యూయార్క్ : ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు, నటుడు రిచర్డ్ అటెన్ బరో (90) కన్నుమూశారు. రిచర్డ్ అటెన్ బరో దర్శకత్వం వహించిన గాంధీ (1982) చిత్రానికి 8 విభాగాల్లో ఆస్కార్ అవార్డులు వరించాయి. గాంధీ చిత్రానికి ఉత్తమ చిత్రం, దర్శకుడు విభాగాల్లో రిచర్డ్ అటెన్ బరో ఆస్కార్ అవార్డులు అందుకున్నారు. జురాసిక్ పార్క్, మిరాకిల్ ఆన్ 34 స్ట్రీట్, బ్రైటన్ రాక్ , పకూన్ వంటి చిత్రాల్లో రిచర్డ్ అటెన్ బరో నటించారు. ఓ వాట్ ఎ లవ్లీ వార్, చాప్లిన్, షాడో లాండ్స్, గాంధీ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. రిచర్డ్ అటెన్ బరో నటించిన ఆఖరి చిత్రం క్లోసింగ్ ద రింగ్. కాగా ఆయన మృతిపై ఇంగ్లాండ్ ప్రధాని డేవిడ్ కామెరూన్ సంతాపం తెలిపారు.