హాలీవుడ్ దర్శకుడు రిచర్డ్ అటెన్ బరో మృతి | Hollywood Actor, director Richard Attenborough dies | Sakshi
Sakshi News home page

హాలీవుడ్ దర్శకుడు రిచర్డ్ అటెన్ బరో మృతి

Published Mon, Aug 25 2014 8:17 AM | Last Updated on Sat, Sep 2 2017 12:26 PM

హాలీవుడ్ దర్శకుడు  రిచర్డ్ అటెన్ బరో మృతి

హాలీవుడ్ దర్శకుడు రిచర్డ్ అటెన్ బరో మృతి

న్యూయార్క్ : ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు, నటుడు రిచర్డ్ అటెన్ బరో (90) కన్నుమూశారు. రిచర్డ్ అటెన్ బరో దర్శకత్వం వహించిన గాంధీ (1982) చిత్రానికి 8 విభాగాల్లో ఆస్కార్ అవార్డులు వరించాయి. గాంధీ చిత్రానికి ఉత్తమ చిత్రం, దర్శకుడు విభాగాల్లో రిచర్డ్ అటెన్ బరో ఆస్కార్ అవార్డులు అందుకున్నారు.

జురాసిక్ పార్క్, మిరాకిల్‌ ఆన్‌ 34 స్ట్రీట్, బ్రైటన్‌ రాక్ , పకూన్ వంటి చిత్రాల్లో రిచర్డ్ అటెన్ బరో నటించారు. ఓ వాట్ ఎ లవ్లీ వార్, చాప్లిన్‌, షాడో లాండ్స్, గాంధీ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. రిచర్డ్ అటెన్ బరో నటించిన ఆఖరి చిత్రం క్లోసింగ్ ద రింగ్. కాగా ఆయన మృతిపై ఇంగ్లాండ్ ప్రధాని డేవిడ్ కామెరూన్ సంతాపం తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement