Richard Attenborough
-
రిచర్డ్‌తో పనిచేయడమే అద్భుతం
గాంధీ సినిమా దర్శకుడు రిచర్డ్ అటెన్బరోతో కలసి పనిచేయడం అద్భుతమని ఇందులో కస్తూరీబా పాత్రలో కనిపించిన రోహిణి హట్టంగడి అన్నారు. ఆయన ఈ సినిమా స్క్రిప్టు ఇచ్చిన తరువాత, కథ నుంచి నటులెవరూ దృష్టి మరల్చకుండా జాగ్రత్తలు తీసుకున్నారని ప్రశంసించారు. గాంధీ సినిమాతో ఆస్కార్ సాధించిన ఈ బ్రిటిష్ దర్శకుడు 90 ఏళ్ల వయసులో ఆదివారం మరణించారు. ‘కస్తూరీ బా పాత్ర నాకు ఎలా వచ్చిందో లీలగా గుర్తుంది. మరాఠీ నాటకాల్లో నటిస్తున్న సమయంలో డాలీ ఠాకూర్ అనే ఏజెంట్ వచ్చి రిచర్డ్ సార్‌ను కలవాలని చెప్పింది. ఆయన ఢిల్లీ మీదుగా లండన్ వెళ్తూ ముంబైలో ఆగారు. నేను కూడా ఆ రోజు ముంబైలోనే ఉండడంతో గంటసేపు మాట్లాడగలిగాను. తెల్లవారి డాలీ ఫోన్ చేసి నాకు కస్తూరి పాత్ర దక్కిందని చెప్పింది. డాలీ సాయంతో ఎలాగొలా పాస్‌పోర్టు సంపాదించి లండన్ వెళ్లాను’ అని వివరించారు. రిచర్డ్ గాంధీ సినిమా నటులందరికీ స్క్రిప్టు ప్రతులు ఇచ్చి హోంవర్క్ చేయాలని సూచించేవారు. దీంతో రోహిణి కస్తూరీ బాపై వచ్చిన పుస్తకాలన్నింటినీ అధ్యయనం చేశారు. యాస లేకుండా ఇంగ్లిష్ మాట్లాడాలని సూచించడంతో ఈమె ప్రత్యేకంగా వక్తృత్వ తరగతులకు కూడా వెళ్లాల్సి వచ్చింది. అంతేగాక చరఖా వడకడం నేర్చుకోవాలని గాంధీ పాత్రధారి బెన కింగ్స్లేతోపాటు తనకూ సూచించారని రోహిణి చెప్పారు. 1982లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి రెండు ఆస్కార్ అవార్డులు అందుకుంది. ‘అప్పుడు నా వయసు చాలా చిన్నది కాబట్టి కస్తూరి పాత్ర ప్రాధాన్యం సరిగ్గా అర్థం కాలేదు. కేవలం పాత్రలాగే భావించి చేస్తూపోయాను. తదనంతరం ఈ సినిమా ప్రచారం కోసం ఎన్నో దేశాలు తిరిగి తరువాత ఈ పాత్ర గొప్పదనం ఏంటో అర్థమయింది. నటన విషయంలో రిచర్డ్ నాకు ఎంతో స్వేచ్ఛ ఇచ్చేవారు’ అని వివరించారు. -
గాంధీ సినిమా దర్శకుడుతో పనిచేయడమే అద్భుతం
ముంబై: గాంధీ సినిమా దర్శకుడు రిచర్డ్ అటెన్బరోతో కలసి పనిచేయడం అద్భుతమని ఇందులో కస్తూరీబా పాత్రలో కనిపించిన రోహిణి హట్టంగడి అన్నారు. ఆయన ఈ సినిమా స్క్రిప్టు ఇచ్చిన తరువాత, కథ నుంచి నటులెవరూ దృష్టి మరల్చకుండా జాగ్రత్తలు తీసుకున్నారని ప్రశంసించారు. గాంధీ సినిమాతో ఆస్కార్ సాధించిన ఈ బ్రిటిష్ దర్శకుడు 90 ఏళ్ల వయసులో ఆదివారం మరణించారు. ‘కస్తూరీ బా పాత్ర నాకు ఎలా వచ్చిందో లీలగా గుర్తుంది. మరాఠీ నాటకాల్లో నటిస్తున్న సమయంలో డాలీ ఠాకూర్ అనే ఏజెంట్ వచ్చి రిచర్డ్ సార్‌ను కలవాలని చెప్పింది. ఆయన ఢిల్లీ మీదుగా లండన్ వెళ్తూ ముంబైలో ఆగారు. నేను కూడా ఆ రోజు ముంబైలోనే ఉండడంతో గంటసేపు మాట్లాడగలిగాను. తెల్లవారి డాలీ ఫోన్ చేసి నాకు కస్తూరి పాత్ర దక్కిందని చెప్పింది. డాలీ సాయంతో ఎలాగొలా పాస్‌పోర్టు సంపాదించి లండన్ వెళ్లాను’ అని వివరించారు. రిచర్డ్ గాంధీ సినిమా నటులందరికీ స్క్రిప్టు ప్రతులు ఇచ్చి హోంవర్క్ చేయాలని సూచించేవారు. దీంతో రోహిణి కస్తూరీ బాపై వచ్చిన పుస్తకాలన్నింటినీ అధ్యయనం చేశారు. యాస లేకుండా ఇంగ్లిష్ మాట్లాడాలని సూచించడంతో ఈమె ప్రత్యేకంగా వక్తృత్వ తరగతులకు కూడా వెళ్లాల్సి వచ్చింది. అంతేగాక చరఖా వడకడం నేర్చుకోవాలని గాంధీ పాత్రధారి బెన్ కింగ్స్లేతోపాటు తనకూ సూచించారని రోహిణి చెప్పారు. 1982లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి రెండు ఆస్కార్ అవార్డులు అందుకుంది. ‘అప్పుడు నా వయసు చాలా చిన్నది కాబట్టి కస్తూరి పాత్ర ప్రాధాన్యం సరిగ్గా అర్థం కాలేదు. కేవలం పాత్రలాగే భావించి చేస్తూపోయాను. తదనంతరం ఈ సినిమా ప్రచారం కోసం ఎన్నో దేశాలు తిరిగి తరువాత ఈ పాత్ర గొప్పదనం ఏంటో అర్థమయింది. నటన విషయంలో రిచర్డ్ నాకు ఎంతో స్వేచ్ఛ ఇచ్చేవారు’ అని వివరించారు. -
‘గాంధీ’ చిత్ర దర్శకుడు రిచర్డ్ అటెన్‌బరో ఇక లేరు
-
‘గాంధీ’ చిత్ర దర్శకుడు రిచర్డ్ అటెన్‌బరో కన్నుమూత
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు, నటుడు, ‘గాంధీ’ చిత్రం ద్వారా మనదేశంలో సుప్రసిద్ధుడూ అయిన రిచర్డ్ అటెన్‌బరో (90) ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఆదివారం మధ్యాహ్న సమయంలో తుది శ్వాస విడిచారు. దాదాపు అర్ధశతాబ్దం పైగా నటునిగా, దర్శకునిగా హాలీవుడ్‌కి రిచర్డ్ అందించిన సేవలు కొనియాడదగ్గవి. ‘ఇన్ విచ్ వియ్ సర్వ్’ చిత్రం ద్వారా 1942లో నటునిగా చిత్రరంగప్రవేశం చేశారు రిచర్డ్. అయితే, ఆ చిత్రం టైటిల్స్‌లో ఆయన పేరు ఉండదు. ఆ తర్వాత లండన్ బిలాంగ్స్ టు మీ, మార్నింగ్ డిపార్చర్, బ్రైటన్ రాక్ తదితర చిత్రాల ద్వారా నటునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం 1950లో దర్శక, నిర్మాత బ్రయాన్ ఫోర్బ్స్తో కలిసి ఓ నిర్మాణ సంస్థ ఆరంభించి, ‘లీగ్ ఆఫ్ జెంటిల్‌మేన్’, ‘ది యాంగ్రీ సెలైన్స్’, ‘విజిల్ డౌన్ ది విండ్’ తదితర చిత్రాలు నిర్మించారు. నిర్మాతగా విజయవంతంగా కొనసాగుతున్న సమయంలోనే దర్శకునిగా మారారు రిచర్డ్. ఆయన దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘ఓ! వాట్ ఎ లవ్లీ వార్’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత దర్శక, నిర్మాతగా కొనసాగడంతో దాదాపుగా నటన తగ్గించేశారు. మహాత్మా గాంధీ జీవితం ఆధారంగా ఆయన దర్శకత్వం వహించిన ‘గాంధీ’ చిత్రం ప్రపంచ ప్రేక్షకుల కితాబులు అందుకుంది. ఈ చిత్రానికి ఎనిమిది ఆస్కార్ అవార్డులు దక్కాయి. ఆ చిత్రంలో గాంధీ పాత్ర పోషించిన బెన్ కింగ్స్లే ‘నా జీవితాంతం గుర్తుంచుకోదగ్గ చిత్రం ఇది. అటెన్‌బరోని మర్చిపోలేను’ అని పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఈ చిత్రం స్క్రీన్‌ప్లే పుస్తకరూపంలో కూడా దొరుకుతోంది. ‘గాంధీ’ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో ‘చాప్లిన్’ ఒకటి. చార్లీ చాప్లిన్ జీవితం ఆధారంగా ఆయన ఈ చిత్రం రూపొందించారు. దర్శక, నిర్మాతగా కొనసాగుతున్న సమయంలోనే ‘జురాసిక్ పార్క్’లో చేసిన జాన్ హమ్మొండ్ పాత్రకు అభినందనలు అందుకున్నారు. ఆయన నటించిన చివరి చిత్రం ‘పకూన్’. 2002లో ఇది విడుదలైంది. దర్శక, నిర్మాతగా ‘క్లోజింగ్ ది రింగ్’ చివరి చిత్రం. 2007లో ఈ చిత్రం విడుదలైంది. ఆ తర్వాత అటెన్‌బరో సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అనారోగ్యం కారణంగా కొంత కాలంగా ఆయన ఓ నర్సింగ్ హోమ్‌లో ఉంటూ, అక్కడే తుది శ్వాస విడిచారు. ఈ నెల 29న రిచర్డ్ అటెన్‌బరో తన 91వ పుట్టినరోజు జరుపుకోవాలి. ఈలోపే ఈ విషాదం సంభవించింది. 90 నిండి 91లోకి అడుగుపెట్టాల్సి ఉండగా, అనారోగ్యం ఆయనను కబళించింది. రిచర్డ్ మరణం పట్ల ఇంగ్లాండ్ ప్రధాని డేవిడ్ కామరూన్ సంతాపం వ్యక్తం చేస్తూ ‘గాంధీ’ చాలా గొప్ప చిత్రమనీ, అటెన్‌బరో మరణం హాలీవుడ్‌కి తీరని లోటని పేర్కొన్నారు. -
హాలీవుడ్ దర్శకుడు రిచర్డ్ అటెన్ బరో మృతి
న్యూయార్క్ : ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు, నటుడు రిచర్డ్ అటెన్ బరో (90) కన్నుమూశారు. రిచర్డ్ అటెన్ బరో దర్శకత్వం వహించిన గాంధీ (1982) చిత్రానికి 8 విభాగాల్లో ఆస్కార్ అవార్డులు వరించాయి. గాంధీ చిత్రానికి ఉత్తమ చిత్రం, దర్శకుడు విభాగాల్లో రిచర్డ్ అటెన్ బరో ఆస్కార్ అవార్డులు అందుకున్నారు. జురాసిక్ పార్క్, మిరాకిల్ ఆన్ 34 స్ట్రీట్, బ్రైటన్ రాక్ , పకూన్ వంటి చిత్రాల్లో రిచర్డ్ అటెన్ బరో నటించారు. ఓ వాట్ ఎ లవ్లీ వార్, చాప్లిన్, షాడో లాండ్స్, గాంధీ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. రిచర్డ్ అటెన్ బరో నటించిన ఆఖరి చిత్రం క్లోసింగ్ ద రింగ్. కాగా ఆయన మృతిపై ఇంగ్లాండ్ ప్రధాని డేవిడ్ కామెరూన్ సంతాపం తెలిపారు.