నాన్‌స్టాప్‌ ఎక్స్‌ప్రెస్‌ | Naga Chaitanya, Sai Pallavi team up for Sekhar Kammula next movie | Sakshi
Sakshi News home page

నాన్‌స్టాప్‌ ఎక్స్‌ప్రెస్‌

Published Fri, Oct 11 2019 1:22 AM | Last Updated on Fri, Oct 11 2019 1:22 AM

Naga Chaitanya, Sai Pallavi team up for Sekhar Kammula next movie - Sakshi

నాగచైతన్య

బ్రేక్‌ లేకుండా నెల పాటు షూటింగ్‌ చేయనున్నారట నాగచైతన్య. సాయిపల్లవితో కలిసి హైదరాబాద్‌ పరిసరాలను చుట్టేయనున్నారట. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ఓ సినిమా రూపొందనుంది. ప్రేమకథగా తెర కెక్కనున్న ఈ చిత్రాన్ని ఏషియన్‌ సినిమాస్‌ సునీల్‌ నారంగ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ఈ నెల 14నుంచి ప్రారంభం కానుంది. వరుసగా 30 రోజులపైనే ఓ షెడ్యూల్‌ను ప్లాన్‌ చేశారట చిత్రబృందం. ఈ షెడ్యూల్‌ మొత్తం హైదరాబాద్‌లోనే జరగనుందని తెలిసింది. మధ్యతరగతి ప్రేమకథగా ఈ చిత్ర కథాంశం ఉంటుందని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement