ప్రతాప్, కేఎల్‌ఎన్ రాజు, విరాజ్, మార్తాండ్
విరాజ్.జె.అశ్విన్ కథానాయకుడిగా పరిచయం కానున్న చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. రిద్ధికుమార్, రాధా బంగారు కథానాయికలుగా నటించారు. కె.సతీష్‌కుమార్ సమర్పణలో థౌజండ్ లైట్స్ మీడియా పతాకంపై ప్రతాప్ తాతంశెట్టి దర్శకత్వంలో కేఎల్‌ఎన్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో కేఎల్‌ఎన్ రాజు మాట్లాడుతూ– ‘‘చక్కని ప్రేమకథా చిత్రమిది. మంచి స్టోరీ లైన్ కుదిరింది. క్లీన్ లవ్‌స్టోరీ. ఊహించని సస్పెన్స్ ఉంది సినిమాలో. హీరో, హీరోయిన్లు బాగా నటించారు.
ప్రతాప్ చక్కగా తెరకెక్కించాడు. కేసీ అంజన్ ఇచ్చిన సంగీతం శ్రోతలను ఆకట్టుకుంటుంది. అవుట్‌పుట్ బాగా వచ్చింది. సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాకు ‘టచ్ హాజ్ ఏ మెమరీ’ అనే ట్యాగ్‌లైన్ ఎందుకు పెట్టారో సినిమా చూస్తే అర్థమవుతుంది. నిర్మాత కేఎల్‌ఎన్ రాజుగారు లేకపోతే ఈ సినిమా లేదు. హీరో, హీరోయిన్లు, దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామేన్ ఇలా అందరం ఈ సినిమాలో కొత్తవాళ్లమే. కొత్త వారితో సినిమా తీసిన కేఎల్‌ఎన్‌రాజుగారు గట్స్ ఉన్న నిర్మాత.
ఆయన కుమారుడు సతీష్‌గారు, కోడలు సునైన గారు కూడా సినిమాలో ఇన్‌వాల్వ్ అయి బాగా ప్రోత్సహించారు. మార్తాండ్‌గారి దగ్గర కొత్త విషయాలు నేర్చుకున్నాను’’ అన్నారు ప్రతాప్. ‘‘హీరో కావాలనే నా కల నిజమైంది. ఇందులో నేను చేసిన సూర్య క్యారెక్టర్‌ను ప్రతాప్ బాగా డిజైన్ చేశారు. నాకు మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు విరాజ్. ‘‘మా విరాజ్‌ని హీరోగా చేసిన కేఎల్‌ఎన్ రాజుగారి సహకారాన్ని మర్చిపోలేను. ట్రైలర్, సాంగ్స్ మాదిరిగానే సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు మార్తాండ్ కె. వెంకటేశ్. ‘‘విరాజ్ హ్యాండ్‌సమ్‌గా ఉన్నాడు. అతనికి మంచి భవిష్యత్ ఉంది’’ అన్నారు నటుడు కాశీ విశ్వనాథ్. కెమెరామెన్ రాజు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment