విరాజ్.జె. అశ్విన్, రిద్ధి కుమార్
విరాజ్.జె. అశ్విన్ హీరోగా రూపొందిన చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. ఇందులో రిద్ధి కుమార్, రాధా బంగారు కథానాయికలుగా నటించారు. ప్రతాప్ తాతంశెట్టి దర్శకత్వంలో కె.సతీష్ కుమార్ సమర్పణలో కేఎల్‌ఎన్ రాజు నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. డిసెంబర్ రెండో వారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా కేఎల్‌యన్ రాజు మాట్లాడుతూ– ‘‘సినీ పరిశ్రమలో నిర్మాతగా, ఫైనాన్షియర్‌గా వ్యవహరించాను.
ఆ తర్వాత వ్యాపారాలతో బిజీ అయిపోయాను. తిరిగి చిత్రాలను నిర్మించాలన్న ఆలోచన వచ్చినప్పుడు ప్రతాప్ చెప్పిన కథ నచ్చింది. మా మామగారు డీవీఎస్ రాజుగారు ఉత్తమమైన చిత్రాలను నిర్మించారు. కొత్తవాళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ సినిమాలో కూడా ఎక్కువగా కొత్తవాళ్లే ఉన్నారు. హీరో అశ్విన్ చక్కగా నటించాడు. ప్రతాప్ బాగా తీశాడు. హీరోయిన్స్ మంచి నటన కనబరచారు. తొలి కాపీ చూసినప్పుడు మంచి సినిమా తీశాననే నమ్మకం కలిగింది’’ అన్నారు. ఈ సినిమాకు కె.సి. అంజన్ స్వరకర్త.
Comments
Please login to add a commentAdd a comment