సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘అనగనగా ఓ ప్రేమకథ’ | Anaganaga O Premakatha Censor Report | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 14 2018 9:59 AM | Last Updated on Wed, Nov 14 2018 9:59 AM

Anaganaga O Premakatha Censor Report - Sakshi

విరాజ్‌ జె అశ్విన్‌ను హీరోగా పరిచయం చేస్తూ థౌజండ్ లైట్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న చిత్రం అనగనగా ఓ ప్రేమకథ. ప్రతాప్‌ తాతంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రిద్ధి కుమార్‌, రాధా బంగారులు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ ఫైనాన్షియర్‌ కె.ఎల్‌.యన్‌ రాజు ఈ సినిమాకు నిర్మాత.

ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్‌ ఫార్మాలిటీస్‌ను కూడా  పూర్తి చేసుకొని ‘యు’ సర్టిఫికెట్ పొందింది. ఈ సందర్భంగా..చిత్ర నిర్మాత కె.ఎల్.యన్.రాజు మాట్లాడుతూ..‘సినీ పరిశ్రమలో నిర్మాతగా, ఎన్నో చిత్రాలకు ఫైనాన్షియర్ గా వ్యహరించిన నేను ఆ తరువాత నా వ్యాపారాలలో బిజీగా ఉండటం జరిగింది. 

చాలాకాలం తరువాత చిత్రాలను నిర్మించాలన్న ఆలోచనలో భాగంగా కథలను వింటూ వస్తుండగా ఈ చిత్ర దర్శకుడు ప్రతాప్ చెప్పిన కథవిని చిత్రాన్ని నిర్మించటం జరిగింది. కుటుంబ సభ్యులంతా కలసి చూసే చిత్రం గా ఇది ఉంటుందని చెప్పగలను. ఈ చిత్రం ను డిసెంబర్ 2 వ వారంలో విడుదల చేస్తున్నాము. చిత్రం  విడుదల తేదీని, అలాగే ప్రీ రిలీజ్ వేడుక వంటి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నా’రు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement