Bigg Boss Sohel Lucky Laxman Title Song Released By Shiva Nirvana - Sakshi
Sakshi News home page

Bigg Boss Sohel: రాత్రికి రాత్రే ధనవంతుడైతే.. ఆకట్టుకుంటున్న సాంగ్‌

Published Wed, Aug 3 2022 3:45 PM | Last Updated on Wed, Aug 3 2022 5:36 PM

Bigg Boss Sohel Lucky Laxman Title Song Released By Shiva Nirvana - Sakshi

Bigg Boss Sohel Lucky Laxman Title Song Released By Shiva Nirvana: బిగ్ బాస్ ఫేమ్ సోహైల్  హీరోగా దత్తాత్రేయ మీడియా పతాకంపై రూపొందిస్తోన్న చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. చుట్టూ ఉన్న వారంతా లక్కీఫెలో అంటున్నా.. తాను మాత్రం ఎప్పటికీ అన్‌లక్కీ ఫెలోనే అని ఫీలయ్యే ఓ యువకుడి జీవితంలో జరిగిన అనేక ఆసక్తికర పరిణామాలతో ఔట్ అండ్‌ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది ఈ చిత్రం. ఎ.ఆర్ అభి దర్శకత్వంలో హరిత గోగినేని నిర్మించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా మోక్ష నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 

ఈ సినిమా నుంచి తాజాగా టైటిల్‌ లిరికల్‌ వీడియో సాంగ్‌ను డైరెక్టర్‌ శివ నిర్వాణ విడుదల చేశారు. "అదృష్టం హలో అందిరో.. చందమామ" అంటూ సాగే ఈ గీతం ఆకట్టుకునేలా ఉంది. కథానాయకుడు రాత్రికి రాత్రే ధనవంతుడు అవుతాడనే కాన్సెప్ట్ చుట్టూ ఈ పాట తిరుగుతుంది. ఈ పాటకు సోహైల్  డాన్స్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా చెప్పవచ్చు. ప్రముఖ రచయిత భాస్కర భట్ల రాసిన ఈ గీతాన్ని  సింగర్.. రామ్ మిరియాల చ‌క్క‌గా  ఆలపించారు. ఈ పాటకు విశాల్ అందించిన కొరియోగ్రఫీ  చక్కగా కుదిరింది. డీఓపీ  ఆండ్రు చక్కటి విజువల్స్ ఇచ్చాడు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ రూబెన్స్ పాటలకు ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉంది. ఈ చిత్రంలోని పాటలు కూడా ఆడియెన్స్‌ను మెస్మ‌రైజ్ చేస్తాయని చిత్రబృందం ఆశాభావం తెలిపింది.

ఈ సందర్బంగా ఖుషి డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూలక్కీ ‘‘లక్ష్మణ్’ లోని ఈ టైటిల్ సాంగ్ చాలా బాగుంది. ఈ చిత్ర దర్శకుడు ఏ ఆర్.అభి, నిర్మాత హరిత గిగినేనిలకు ఇది మొదటి చిత్రమైనా చాలా చక్కగా తెరకెక్కించారు. వీరిద్దరికీ ఈ చిత్రం మంచి పేరు తీసుకురావాలి. సోహైల్  నటన బాగుంటుంది. ఇందులో తన డ్యాన్స్ చూడముచ్చటగా ఉంది. వీరి ముగ్గురి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను’ అని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement