బుల్లితెర నుంచి మినిమమ్ హీరోగా ఎదిగిన సయ్యద్ సోహెల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఆయన కెరియర్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. ఇప్పటికే సోహెల్ పలు సినిమాల్లో హీరోగా మెప్పించాడు. తాజాగా 'బూట్‍కట్ బాలరాజు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు ఆయన వచ్చాడు. ఫిబ్రవరి 2న విడుదలైన ఈ సినిమా ఆశించినంత స్థాయిలో ఆడకపోయిన తన నటన,కామెడీతో సోహెల్ మెప్పించాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు అమ్మాయిల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ గురించి ఆయన ఇలా రియాక్ట్ అయ్యాడు. 'ఒక అమ్మాయి నుంచి నాకు రోజు ఫోన్ కాల్ వస్తుంది.. ఫోన్ లిఫ్ట్ చేస్తే చాలు గలీజ్‌గా మాట్లాడుతుంది. ఇలా ఇప్పటి వరకు సుమారుగా 11 మంది అమ్మాయిలు కాల్స్ చేస్తున్నారు. అందుకే వారి పేర్లకు బదులు టార్చర్-1, టార్చర్-2 అంటూ నా ఫోన్‌లో నంబర్స్ సేవ్ చేసుకున్నాను. డ్రైవ్‌కు వెళ్దాం.. చేద్దాం... కావాలి అంటూ గలీజ్‌గా మెసేజ్‌లు చేస్తున్నారు.
(ఇదీ చదవండి: టాలీవుడ్ డైరెక్టర్లపై మెగాస్టార్ కీలక వ్యాఖ్యలు)
ఒక అమ్మాయి అయితే ఏకంగా ఇంటి దగ్గర వచ్చేస్తుంది. ఎక్కడికైనా వెళ్దాం అంటుంది. మా అమ్మ వార్నింగ్ ఇచ్చి పంపినా కూడా మళ్లీ వచ్చి టార్చర్ చూపుతుంది. నేను ఎక్కడికి పోతే అక్కడకు ఆ అమ్మాయి రావడం పదా పోదాం అంటూ టార్చర్ పెట్టేది. ఆ అమ్మాయి మీద కేసు పెడదామని అరియానతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాను. కేసు పెడితే నాకే ఇబ్బంది ఉంటుందని పోలీసులు తెలిపారు. దీంతో షాక్ అయ్యాను. ఏం చేయలేక అక్కడి నుంచి వచ్చేశాను. అదే ఒక అమ్మాయి ఇంటికి అబ్బాయి వెళ్లి ఇలా రచ్చ చేస్తే పోలీసులు ఊరుకుంటారా..? లోపలేసి నాలుగు తగిలిస్తారు.
అబ్బాయిలకు ఒక న్యాయం, అమ్మాయిలకు ఒక న్యాయం ఉంటుందా అనిపిస్తుంది. ఇవన్నీ చూశాక మగవారి సంఘానికి లీడర్‌గా ఉండాలని ఉంది. అమ్మాయిల వల్ల ఎవరైన మోసపోయిన వారికి అండగా ఉండడంతో పాటు వారి వల్ల ఎవరైన టార్చర్‌కు గురి అవుతున్నవారికి అండగా ఉంటాను.' అని సోహెల్ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment