Bootcut Balaraju Movie
-
అలాంటి కాల్స్‌తో అమ్మాయిల టార్చర్.. పోలీసుల మాటకు షాక్ అయ్యా..: సోహెల్
బుల్లితెర నుంచి మినిమమ్ హీరోగా ఎదిగిన సయ్యద్ సోహెల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఆయన కెరియర్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. ఇప్పటికే సోహెల్ పలు సినిమాల్లో హీరోగా మెప్పించాడు. తాజాగా 'బూట్‌కట్ బాలరాజు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు ఆయన వచ్చాడు. ఫిబ్రవరి 2న విడుదలైన ఈ సినిమా ఆశించినంత స్థాయిలో ఆడకపోయిన తన నటన,కామెడీతో సోహెల్ మెప్పించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు అమ్మాయిల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ గురించి ఆయన ఇలా రియాక్ట్ అయ్యాడు. 'ఒక అమ్మాయి నుంచి నాకు రోజు ఫోన్ కాల్ వస్తుంది.. ఫోన్ లిఫ్ట్ చేస్తే చాలు గలీజ్‌గా మాట్లాడుతుంది. ఇలా ఇప్పటి వరకు సుమారుగా 11 మంది అమ్మాయిలు కాల్స్ చేస్తున్నారు. అందుకే వారి పేర్లకు బదులు టార్చర్-1, టార్చర్-2 అంటూ నా ఫోన్లో నంబర్స్ సేవ్ చేసుకున్నాను. డ్రైవ్‌కు వెళ్దాం.. చేద్దాం... కావాలి అంటూ గలీజ్‌గా మెసేజ్‌లు చేస్తున్నారు. (ఇదీ చదవండి: టాలీవుడ్ డైరెక్టర్లపై మెగాస్టార్ కీలక వ్యాఖ్యలు) ఒక అమ్మాయి అయితే ఏకంగా ఇంటి దగ్గర వచ్చేస్తుంది. ఎక్కడికైనా వెళ్దాం అంటుంది. మా అమ్మ వార్నింగ్ ఇచ్చి పంపినా కూడా మళ్లీ వచ్చి టార్చర్ చూపుతుంది. నేను ఎక్కడికి పోతే అక్కడకు ఆ అమ్మాయి రావడం పదా పోదాం అంటూ టార్చర్ పెట్టేది. ఆ అమ్మాయి మీద కేసు పెడదామని అరియానతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాను. కేసు పెడితే నాకే ఇబ్బంది ఉంటుందని పోలీసులు తెలిపారు. దీంతో షాక్ అయ్యాను. ఏం చేయలేక అక్కడి నుంచి వచ్చేశాను. అదే ఒక అమ్మాయి ఇంటికి అబ్బాయి వెళ్లి ఇలా రచ్చ చేస్తే పోలీసులు ఊరుకుంటారా..? లోపలేసి నాలుగు తగిలిస్తారు. అబ్బాయిలకు ఒక న్యాయం, అమ్మాయిలకు ఒక న్యాయం ఉంటుందా అనిపిస్తుంది. ఇవన్నీ చూశాక మగవారి సంఘానికి లీడర్‌గా ఉండాలని ఉంది. అమ్మాయిల వల్ల ఎవరైన మోసపోయిన వారికి అండగా ఉండడంతో పాటు వారి వల్ల ఎవరైన టార్చర్‌కు గురి అవుతున్నవారికి అండగా ఉంటాను.' అని సోహెల్ అన్నాడు. -
ఓటీటీలోకి 'బూట్ కట్ బాలరాజు'.. కనీసం ఇప్పుడైన చూడండయ్యా!
బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ హీరోగా శ్రీ కోనేటి తెరకెక్కించిన చిత్రం 'బూట్ కట్ బాలరాజు' ఓటీటలోకి వచ్చేందుకు రెడీగా ఉంది. ఫిబ్రవరి 2న రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని గ్లోబల్ ఫిలిమ్స్ & కథ వేరుంటాది బ్యానర్స్‌పై సోహైల్ నిర్మించాడు. ఈ చిత్రంలో మేఘ లేఖ హీరోయిన్గా నటించగా.. సునీల్, సిరి హన్మంత్ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు. వినోదాత్మకంగా సాగే ఓ ఆసక్తికర కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను మాత్రం పెద్దగా మెప్పించలేదని చెప్పవచ్చు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. మార్చి 1 నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటన కూడా రావచ్చని ప్రచారం ఉంది. సినిమా విడుదల సమయంలో థియేటర్లకు ప్రేక్షకులు పెద్దగా రాకపోవడంతో సోహైల్ ఎమోషనల్ అయ్యాడు.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. కానీ అప్పటికీ కూడా పెద్దగా ప్రేక్షకులు థియేటర్ల బాట పట్టలేదు. సినిమా కథ బాగున్నప్పటికీ కొత్త దనం లేకపోవడంతో సినిమా ఫెయిల్‌కు ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో సోహైల్ కామెడీ మరో రేంజ్లో ఉంటుంది. పేద, ధనిక అంతరాలతో కథ నడిపించిన తీరు బాగానే ఉన్న కమర్షియల్‌గా పెద్దగా మెప్పించలేదని చెప్పవచ్చు. థియేటర్లో చూడలేకపోయిన వారు ఓటీటీలో తప్పక చూడాల్సిన సినిమా అని చెబుతూ.. కనీసం ఇప్పుడైన 'బూట్ కట్ బాలరాజు'పై ఒక లుక్ వేయండయ్యా అంటూ ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మార్చి 1న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి 'బూట్ కట్ బాలరాజు' వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి అప్పుడు ఇంట్లోనే చూసేయండి. అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. -
నా సినిమా కూడా చూడండి...బోరున ఏడ్చిన సోహైల్
-
Bootcut Balaraju: బూట్‌కట్ బాలరాజు మూవీ రివ్యూ
బిగ్‌బాస్‌తో వచ్చిన ఫేమ్‌ను కాపాడుకుంటూ హీరోగా నిలదొక్కుకుంటున్నాడు సోహైల్. గతంలో మిస్టర్ ప్రెగ్నెంట్‌తో మెప్పించిన ఇతడు తాజాగా(ఫిబ్రవరి 2న) బూట్‌కట్ బాలరాజుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి సోహైల్ నిర్మాతగానూ వ్యవహరించాడు. మేఘలేఖ హీరోయిన్గా నటించగా సునీల్, ఇంద్రజ, అవినాష్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీనివాస్ కోనేటి దర్శకత్వం వహించారు. కథ ఏంటంటే.. తండ్రి (సుమన్)కు ఇచ్చిన మాట కోసం పటేలమ్మ(ఇంద్రజ) తన భర్తను కూడా వదిలేసి ఊరిపెద్దగా మారుతుంది. ఆమె కూతురు మహాలక్ష్మి(మేఘలేఖ)ని అందరూ గౌరవించేవారు. అదే సమయంలో భయంతో ఎవరూ దగ్గరకు వచ్చేవారు కాదు. స్కూల్లో కూడా ఎవరూ తనతో స్నేహం చేయరు. అలాంటి సమయంలో బాలరాజు (సోహైల్) మహాలక్ష్మిని అందరితో సమానంగా చూస్తాడు. అలా వీరిమధ్య స్నేహం మొదలవుతుంది. కట్ చేస్తే.. కాలేజీ లైఫ్‌లో బాలరాజును అదే కళాశాలలో చదువుకునే సిరి(సిరి హన్మంతు) ప్రేమిస్తుంది. అయితే మహాలక్ష్మి కూడా తనకు తెలియకుండానే బాలరాజుతో ప్రేమలో పడుతుంది. సిరి కన్నా ముందే మహాలక్ష్మి తన మనసులోని మాట చెప్పేస్తుంది. అలా ఇద్దరి ప్రేమ మొదలవుతుంది. ఈ విషయం తెలిసి పటేలమ్మ.. బాలరాజును ఊరువదిలి వెళ్లిపోవాలంటుంది. ఆ సమయంలో ఇద్దరికీ మాటామాటా పెరుగుతుంది. నా మీద గెలిచి సర్పంచ్ అయితే నా కూతురిని నీకిచ్చి పెళ్లి చేస్తా అంటుంది పటేలమ్మ. ఊరిలో మంచి పేరు లేని బాలరాజు సర్పంచ్ అయ్యాడా? తన ప్రేమ గెలిచిందా? లేదా? అన్న వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే! ఎలా ఉందంటే? గొప్పింటి అమ్మాయిని పేదింటి కుర్రాడు ప్రేమించడం, ఏదో ఒక ఛాలెంజ్ వేసి తన ప్రేమ గెలిపించుకోవడం చాలా సినిమాల్లో చూశాం. ఈ మూవీ కూడా దాదాపు అదే కోవలోకి వస్తుంది. కథ అంత కొత్తగా అనిపించదు కానీ దాన్ని డీల్ చేసిన విధానం పర్వాలేదనిపించింది. ఫస్టాఫ్‌లో పాత్రల పరిచయం, హీరోహీరోయిన్ల మధ్య స్నేహం ప్రేమగా మారిన వైనాన్ని చూపించారు. సెకండాఫ్‌లో బాలరాజు సర్పంచ్ అవడానికి ఏం చేశాడనేది చూపించారు. కామెడీ బాగానే వర్కవుట్ అయింది. సోహైల్ హైపర్ యాక్టివ్‌గా ఉండే కుర్రాడిగా మెప్పించాడు. చివర్లో ఎమోషన్స్ కూడా పిండేశాడు. పటేలమ్మగా ఇంద్రజ నటనకు వంక పెట్టాల్సిన పని లేదు. హీరోయిన్ మేఘలేఖ పల్లెటూరమ్మాయిగా ఒదిగిపోయింది. అవినాష్, సద్దాం కామెడీ బాగుంది. సినిమా చూస్తున్నంతసేపు నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడనట్లు కనిపిస్తుంది. పల్లెటూరి విజువల్స్ అంత చక్కగా ఉన్నాయి. పాటలు కొన్ని బోర్ కొట్టిస్తాయి. దర్శకుడు కథను ఇంకాస్త బెటర్‌గా ప్రజెంట్ చేసుంటే బాగుండేది. ఓవరాల్‌గా సినిమా పర్వాలేదు. -
'బిగ్‌బాస్‌లో సపోర్ట్.. ఇప్పుడేమైంది? ప్లీజ్, నా సినిమాకు వెళ్లండి'
బిగ్‌బాస్ వల్ల వచ్చే ఫేమ్ శాశ్వతంగా ఉండదు. దాన్ని నిలబెట్టుకోవడం కంటెస్టెంట్ల చేతిలోనే ఉంటుంది. విజేతలతో సహా చాలామంది కంటెస్టెంట్లు దాన్ని సరిగా వాడుకోలేకపోయారు. సినిమాల్లో నిలదొక్కుకోలేకపోయారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ సోహైల్ మాత్రం వరుసపెట్టి సినిమాలకు సంతకం చేశాడు. ఆ మధ్య మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ చేయగా దీనికి పాజిటివ్ స్పందన వచ్చింది. సోహైల్ నటనకు మార్కులు పడటంతో పాటు కలెక్షన్లు కూడా వచ్చాయి. హీరో, నిర్మాతగా సోహైల్ తాజాగా అతడు నటించిన బూట్‌కట్ బాలరాజు మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో సోహైల్ హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించాడు. మేఘలేఖ హీరోయిన్గా నటించింది. సునీల్, ఇంద్రజ, ముక్కు అవినాష్ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీనివాస్ కోనేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న రిలీజ్ అయింది. ఈ చిత్రాన్ని చూసేందుకు జనాలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో సోహైల్ కంటతడి పెట్టుకున్నాడు. నేను కూడా అలాంటివి చేయను అతడు మాట్లాడుతూ.. 'ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాను. ఇందులో కంటెంట్ ఉంది కాబట్టే మాట్లాడుతున్నాను. రూ.5 కోట్లు పెట్టి తీసిన సినిమాకు నో షో బోర్డులు పెట్టడమేంటన్నా? జనాలు ఎక్కువగా లేరని షోలు క్యాన్సిల్ చేస్తున్నారు. ఒక థియేటర్‌కు కనీసం 30 మందైనా వెళ్లండన్నా.. ఫ్యామిలీ చూడగలిగే సినిమాలు తీయండన్నారు కదా మరి ఇప్పుడేమైందన్నా? నేను తీస్తే ఎందుకు ఆదరించడం లేదు? ప్రమోషన్స్ చేయడానికి మా దగ్గర అంత డబ్బులు కూడా లేవు. నా స్థోమతలో ప్రీరిలీజ్ ఈవెంట్ ఒక్కటే చేయగలిగాను. అయినా ఫ్యామిలీ సినిమాలు చూడరు కదా.. నేను కూడా ఇకపై అలాంటివి చేయను. ముద్దు సన్నివేశాలుండేవే చేస్తాను. అరె.. కుటుంబమంతా కలిసి చూడగలిగే సినిమా ఇది! క్యూట్ సినిమా తీశావని కొందరు మెచ్చుకుంటున్నారు. నిజంగానే బూట్‌కట్ బాలరాజు బానే ఉంది కదా.. ఏం చేస్తున్నారు మరి? ఎప్పుడూ స్నేహితులతోనే కాదు ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూడండి. నా సినిమాకు వెళ్లండన్నా.. బిగ్‌బాస్ షోలో ఉన్నప్పుడు నాకు మద్దతుగా వేల కామెంట్లు పెట్టారు కదా.. ఇప్పుడేమైందన్నా?' అంటూ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ పక్కనే ఉన్న అవినాష్ అతడిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఇది చూసిన కొందరు.. బిగ్‌బాస్ గుర్తింపుతో సినిమాల్లో రాణించవచ్చనుకోవడం నీ పొరపాటని విమర్శిస్తున్నారు. నీ సినిమాలో దమ్ముంటే నువ్వు అడక్కపోయినా జనాలు వస్తారని కామెంట్లు చేస్తున్నారు. కంటెంట్ ఉండే చిత్రాలపై దృష్టి సారించమని సలహా ఇస్తున్నారు. #BootcutBalaraju - Mee Jeethalatho maa Jeevithalu marchandi ✅pic.twitter.com/1cUsZWMj9a — GetsCinema (@GetsCinema) February 2, 2024 చదవండి: భర్తతో కలిసి ఉదకశాంతి పూజ చేసిన గీతా మాధురి.. 'దమ్ మసాలా' సాంగ్‌కు సితార డ్యాన్స్.. మిలియన్లకొద్ది వ్యూస్