
‘బిగ్ బాస్’ ఫేమ్ సయ్యద్ సోహైల్, మోక్ష జంటగా నటిస్తున్న చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. ఎ.ఆర్. అభి దర్శకత్వంలో హరిత గోగినేని నిర్మింన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ వేడుకలో సోహైల్ మాట్లాడుతూ– ‘‘సక్సెస్ ఉన్నా లేకపోయినా అభిమానులు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. వారే నా ధైర్యం.
ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసేలా ‘లక్కీ లక్ష్మణ్’ ఉంటుంది’’ అన్నారు. ‘‘సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి’’ అన్నారు అభిరామ్. ‘‘మా సినిమా బాగా రావడానికి ఏం చేయాలో అవన్నీ చేశాం. ఇక ప్రేక్షకులదే బాధ్యత. సినిమా బావుందంటే చాలు’’ అన్నారు హరిత.
Comments
Please login to add a commentAdd a comment