టెంపర్ టైటిల్ సాంగ్ వీడియో విడుదల | Jr.NTR Temper title song released | Sakshi
Sakshi News home page

టెంపర్ టైటిల్ సాంగ్ వీడియో విడుదల

Published Wed, Jan 28 2015 2:53 PM | Last Updated on Sat, Sep 2 2017 8:25 PM

టెంపర్ టైటిల్ సాంగ్ వీడియో విడుదల

టెంపర్ టైటిల్ సాంగ్ వీడియో విడుదల

పూరీ జగన్నాథ్, ఎన్టీఆర్ దర్శకత్వంలో రూపొందుతున్న టెంపర్ సినిమా టైటిల్ సాంగ్ వీడియో యూట్యూబ్లో విడుదలైంది. ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఈ పాటను రిలీజ్ చేసింది. ఇంతకుముందు సమంతతో రభస చేసిన ఎన్టీఆర్.. ఇప్పుడు మంచి సక్సెస్ కోసం చూస్తున్నాడు. నందమూరి ఫ్యామిలీలో కళ్యాణ్ రామ్ పటాస్తో మంచి హిట్ కొట్టడంతో.. ఇప్పుడు అదే సెంటిమెంటు ఎన్టీఆర్కు కూడా వర్కవుతుందని అంచనా వేస్తున్నారు. టెంపర్ టైటిల్ సాంగ్ వీడియోలో ఎన్టీఆర్ లుక్ బాగా స్టైలిష్గా కనిపిస్తోంది.

సినిమాను సంక్రాంతికే విడుదల చేయాల్సి ఉన్నా, నందమూరి కుటుంబంలో జరిగిన విషాద ఘటన కారణంగా దాన్ని వాయిదా వేశారు. ఇప్పుడు వాలెంటైన్స్డేకు ఒక్కరోజు ముందు సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చిన ఈ టైటిల్ సాంగును భాస్కరభట్ల రవికుమార్ రాశారు. ఈ పాటకు తారక్ తనదైన శైలిలో డాన్సులు చేస్తాడని అంటున్నారు. 'నీ తాత టెంపర్, నీ అయ్య టెంపర్, బాబాయి టెంపర్, నువ్వింకా టెంపర్ ఏ.. బ్లడ్లోనే ఉందమ్మా బెండు తీసే టెంపర్.. దమ్మున్న ప్రతోడికి ఉందమ్మా టెంపర్.. సబ్కో ఫటాలే సబ్కో బచాలే నాచ్ నాచ్...' అంటూ ఈ పాట సాగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement