సంక్రాంతికి రెడీ | Director Parasuram launches Shiva 143 title song | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి రెడీ

Published Fri, Dec 20 2019 12:21 AM | Last Updated on Fri, Dec 20 2019 12:21 AM

Director Parasuram launches Shiva 143 title song - Sakshi

శైలేష్‌ సాగర్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘శివ 143’. ఎలీషా ఆదరహ, హ్రితిక సింగ్, డి.ఎస్‌.రావ్, ప్రియ పాల్వాయి ఇతర పాత్రల్లో నటించారు. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా జనవరి 12న సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమాలోని టైటిల్‌ సాంగ్‌ని ‘గీత గోవిందం’ ఫేమ్‌ డైరెక్టర్‌ పరుశురాం విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ట్రైలర్స్, పాటలు చాలా బాగున్నాయి.

ఇప్పటి పరిస్థితుల్లో చిన్న బడ్జెట్‌ సినిమాకి చాలా ఇబ్బందులు ఉన్నాయి.. కానీ వాటిని అధిగమించి  ‘శివ 143’ చిత్రం ఇంత బాగా రావటానికి కారణం రామ సత్యనారాయణగారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ మనోజ్‌ కొత్తవాడైనా పాటలు బాగున్నాయి’’ అన్నారు. ‘‘సంక్రాంతికి విడుదలకానున్న మా సినిమా సక్సెస్‌ సాధిస్తుంది’’ అన్నారు టి. రామసత్యనారాయణ. ‘‘పరుశురాంగారు విడుదల చేసిన పాట సినిమాలో సందర్భానుసారం వస్తుంది. ప్రేక్షకులకు నచ్చేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు శైలేష్‌ సాగర్‌.
∙సాగర్, ఎలీషా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement