జై, రష్మీ గౌతమ్
‘‘దర్శకుడిగా నా తొలి చిత్రం ‘అంతకు మించి’. మా చిత్రం పోస్టర్స్ విడుదలైన తర్వాత అందరూ రష్మీ ఎక్స్‌పోజింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. రేపు సినిమా విడుదలైన తర్వాత ఆమె నటన గురించి మాట్లాడతారు’’ అని దర్శకుడు జానీ అన్నారు. జై హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘అంతకు మించి’. రష్మీ గౌతమ్ కథానాయిక. యూ అండ్ ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది.
ఈ చిత్రం టైటిల్ సాంగ్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. హీరో–నిర్మాత జై మాట్లాడుతూ– ‘‘అంతకు మించి’ సినిమా లాస్ట్ టూ రీల్స్‌లో ప్రేక్షకులు కచ్చితంగా భయపడతారు. ఈ సినిమాకు ‘అంతకు మించి’ టైటిల్ ఎందుకు పెట్టామో ఇంటర్వెల్‌లో అర్థం అవుతుంది. రష్మీగారు తన నటనతో సినిమాకు ప్రాణం పోశారు’’ అన్నారు. ‘‘కేక్‌లా డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో సినిమా ఉంటుంది’’ అన్నారు రష్మీ. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: భానుప్రకాష్ తేళ్ల, కన్నా తిరుమనాధం.
Comments
Please login to add a commentAdd a comment