reshmi
-
ఇంటర్వెల్లో అర్థమవుతుంది
‘‘దర్శకుడిగా నా తొలి చిత్రం ‘అంతకు మించి’. మా చిత్రం పోస్టర్స్ విడుదలైన తర్వాత అందరూ రష్మీ ఎక్స్పోజింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. రేపు సినిమా విడుదలైన తర్వాత ఆమె నటన గురించి మాట్లాడతారు’’ అని దర్శకుడు జానీ అన్నారు. జై హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘అంతకు మించి’. రష్మీ గౌతమ్ కథానాయిక. యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ చిత్రం టైటిల్ సాంగ్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. హీరో–నిర్మాత జై మాట్లాడుతూ– ‘‘అంతకు మించి’ సినిమా లాస్ట్ టూ రీల్స్‌లో ప్రేక్షకులు కచ్చితంగా భయపడతారు. ఈ సినిమాకు ‘అంతకు మించి’ టైటిల్ ఎందుకు పెట్టామో ఇంటర్వెల్లో అర్థం అవుతుంది. రష్మీగారు తన నటనతో సినిమాకు ప్రాణం పోశారు’’ అన్నారు. ‘‘కేక్‌లా డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో సినిమా ఉంటుంది’’ అన్నారు రష్మీ. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: భానుప్రకాష్ తేళ్ల, కన్నా తిరుమనాధం. -
కూకట్‌పల్లిలో యువతి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న శ్రీ నిలయం అపార్ట్మెంట్ పై నుంచి దూకి గురువారం ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్మీడియట్ చదువుతున్న రేష్మి (18) అనే యువతి ఈ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. అయితే మతిస్థిమితం లేకపోడం వల్లే రేష్మి అపార్ట్మెంట్ పై నుంచి దూకిందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
భీమవరంలో ‘తను నచ్చెనంట’..
భీమవరం : స్థానిక శ్రీ విష్ణు మహిళా ఇంజినీరింగ్ కళాశాలకు శుక్రవారం ‘తను నచ్చెనంట’ సినిమా బృందం ప్రమోషన్ కోసం వచ్చింది. ఈ సినిమా హీరోయిన్, టీవీ యాంకర్ రేష్మీ గౌతమ్ సందడి చేశారు. విద్యార్థులతో సెల్ఫీలు దిగడంతో పాటు డ్యాన్స్‌లు వేసి హుషారెత్తించారు. ఈ సందర్భంగా రేష్మీ మాట్లాడుతూ కళాశాలలోని విద్యార్థులకు తాను సంబ్రమాశ్చర్యాలు కలిగించాలనుకున్నానని, అయితే విద్యార్థినులు యాంకరింగ్, డ్యాన్స్‌లకు తాను ఎంతగానో థ్రిల్లయ్యానన్నారు. తాను ఎన్నో కళాశాలలు తిరిగినా ఇటువంటి వాతావరణం, విద్యార్థుల హుషారు ఇక్కడే ఎక్కువగా ఆశ్వాదించానని రేష్మి చెప్పారు. అనంతరం విద్యార్థులు అడిగిన అనేక ప్రశ్నలకు రేష్మీ సమాధానాలు చెప్పారు. తొలుత చిత్ర బందానికి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాసరాజు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో సినిమా డైరెక్టర్ వెంకట్, నిర్మాత చంద్రశేఖర్ ఆజాద్, కొరియోగ్రాఫర్ యాండి పిళై, కమెడియన్ ఫణి, యాంకర్ నరేష్రాయ్, నటుడు భార్గవ్ పాల్గొన్నారు. -
బంగళాలో ఏం జరిగింది?
ఆనంద్ నందా, రేష్మి, శివకృష్ణ ప్రధాన పాత్రల్లో వి.సినీ స్టూడియో నిర్మాణంలో డి. దివాకర్ నిర్మించిన చిత్రం ‘రాణి గారి బంగళా’. ఈ చిత్రం లోగోను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రం షూటింగ్ డిసెంబరులో మొదలు పెట్టి ఒకే షెడ్యూల్లో పూర్తి చేశాం. రాణిగారి బంగళాలో ఏం జరిగింది? అనేది ఆసక్తికరమైన అంశం. మార్చి చివరి వారంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. ‘‘ ‘జయం’ చిత్రం తర్వాత అంత ప్రాముఖ్యమున్న కాటికాపరి పాత్రలో నటించడం సంతోషంగా ఉంది’’ అని నటుడు శివకృష్ణ తెలిపారు. నిర్మాత ప్రసన్న కుమార్, నటుడు వైజాగ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రభాకర్ రెడ్డి, సమర్పణ: బాలాజీ నాగలింగం, సహ నిర్మాత: శ్రీనివాసరావు. -
గుంటూర్ టాకీస్ చాలా బాగుంటుంది
‘‘కొన్ని పాత్రలు చూసినప్పుడు నేను కూడా ఇన్ స్పైర్ అవుతుంటా. నటనలో నేనూ నిత్య విద్యార్థినే. నేను ఎమ్మెల్యేగా ఉన్న హిందూపూర్‌లో ఈ చిత్రం షూటింగ్ జరగడం సంతోషంగా ఉంది. ‘చందమామ కథలు’తో జాతీయ అవార్డందుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ‘గుంటూర్ టాకీస్’ ట్రైలర్ చూస్తే, చాలా బాగుంది. తప్పకుండా విజయం సాధిస్తుంది’’ అని హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. సిద్ధు జొన్నగడ్డ, నరేశ్, రేష్మీ గౌతమ్, లక్ష్మీ మంచు, శ్రద్ధాదాస్, మహేశ్ మంజ్రేకర్ ముఖ్యపాత్రల్లో ఆర్కె స్టూడియోస్ పతాకంపై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాజ్‌కుమార్ ఎం. నిర్మించిన చిత్రం - ‘గుంటూర్ టాకీస్’. ఈ చిత్రం ట్రైలర్‌ను బాలకృష్ణ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ‘ ‘అగ్ర హీరో బాలకృష్ణ గారు మా చిత్రం ట్రైలర్ ఆవిష్కరణకు రావడం మాకు కొత్త బలాన్నిస్తోంది’’ అని దర్శకుడు అన్నారు. ‘‘ఏ భాషలో తీసినా ఘన విజయం సొంతం చేసుకోగల సత్తా ఉన్న యూనివర్సల్ కథ ఇది. పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా ఇది తెరకెక్కింది’’ అని సీనియర్ నరేశ్ తెలిపారు. రేష్మి గౌతమ్, లక్ష్మీ మంచు, శ్రద్ధాదాస్, సిద్ధు జొన్నగడ్డ, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ తదితరులు మాట్లాడారు. కెమేరామ్యాన్ రామిరెడ్డి, ఎడిటర్ ధర్మేంద్ర, నటుడు రాజా రవీంద్ర, స్నిగ్ధ తదితరులు పాల్గొన్నారు. -
నెల్లూరు సందడి చేసిన టీవీ నటి రష్మీ
-
జిల్లాతో ‘ఉదయ్’ బంధం
భద్రాచలం టౌన్/ ఇల్లెందు, న్యూస్‌లైన్: సినీ హీరో ఉదయ్‌కిరణ్ మరణం జిల్లాలోని ఆయన అభిమానులను తీవ్రంగా కలిచివేసింది. హైద్రాబాద్‌లో ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న సినీ హీరో ఉదయ్‌కిరణ్‌కు జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది. తన చివరి సినిమా జై శ్రీరామ్ విడుదల సందర్భంగా ఆయన భద్రాద్రి రామున్ని దర్శించుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ కూడా జిల్లాలోని ఇల్లెందుకు చెందిన నటి రేష్మాయే కావడం గమనార్హం. జై శ్రీరామ్ చిత్ర విడుదల సందర్భంగా హీరోయిన్ రేష్మ, ఆ చిత్ర నిర్మాతతో కలిసి ఉదయ్‌కిరణ్ భద్రాద్రి రామున్ని దర్శించుకున్నారు. భద్రాద్రి చూడముచ్చటగా ఉందన్నారు. కష్టపడితే విజయం దక్కుతుందని, అదే ప్రయత్నంలో తొలిసినిమా నుంచి పట్టుదలతో శ్రమిస్తున్నానని తెలిపారు. ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న వర్దమాన హీరో ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉదయ్‌కిరణ్‌తో తన నటనా అనుభవాలను హీరోయిన్ రేష్మ ‘న్యూస్‌లైన్’కు వివరించారు. ఉదయ్ పిరికివాడు కాదు: రేష్మ, ‘జై శ్రీరామ్’ చిత్ర హీరోయిన్ జై శ్రీరామ్’ చిత్రంలో ఉదయ్‌తో నటిం చిన స్మృతులను ఎన్నటికీ మరచిపోలేను. ఆయన మరణం ఓ కలగా ఉంది. ఉదయ్ చాలా ధైర్యంగా ఉండేవారు. తాను నటించిన సినిమాలు ఫెయిల్ అవుతున్నాయనే మనస్తాపంతో చనిపోయేటంతటి పిరికివాడు కాదు. షూటింగ్లో తోటి నటీనటులతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. అతనితో నటించిన ‘జై శ్రీరామే’ నా తొలి యాక్షన్ మూవీ. షూటింగ్ సందర్భంలో నా నటనలో లోటుపాట్లను గుర్తించి మెలకువలు చెప్పేవారు. నాకు తెలిసి ఉదయ్ దంపతులు హ్యాపీగా, ఫ్రెండ్లీగా ఉండేవారు. ఆర్థిక ఇబ్బందులు కూడా ఏమీ లేవు. ఉదయ్ చనిపోవడం ఇప్పటికీ కలగా ఉంది. సినీ పరిశ్రమ కూడా నమ్మలేకపోతోంది. త్వరలో మరికొన్ని సినిమాల్లోనూ నటించేం దుకు ఉదయ్ ప్రణాళిక వేసుకున్నారు. షూటింగ్ సమయంలో ఆయన ఎప్పుడూ చిరాకు, విసుగ్గా ఉండేవారు కాదు. చాలా రిలాక్స్డ్గా ఉండేవారు. ఉదయ్‌కిరణ్‌తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. నాకంటే సీనియర్ అయినప్పటికీ నన్నెప్పుడూ తన జూనియర్‌గా చూడలేదు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను.