భీమవరంలో ‘తను నచ్చెనంట’..
భీమవరంలో ‘తను నచ్చెనంట’..
Published Fri, Oct 7 2016 11:16 PM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM
భీమవరం : స్థానిక శ్రీ విష్ణు మహిళా ఇంజినీరింగ్ కళాశాలకు శుక్రవారం ‘తను నచ్చెనంట’ సినిమా బృందం ప్రమోషన్ కోసం వచ్చింది. ఈ సినిమా హీరోయిన్, టీవీ యాంకర్ రేష్మీ గౌతమ్ సందడి చేశారు.
విద్యార్థులతో సెల్ఫీలు దిగడంతో పాటు డ్యాన్స్‌లు వేసి హుషారెత్తించారు. ఈ సందర్భంగా రేష్మీ మాట్లాడుతూ కళాశాలలోని విద్యార్థులకు తాను సంబ్రమాశ్చర్యాలు కలిగించాలనుకున్నానని, అయితే విద్యార్థినులు యాంకరింగ్, డ్యాన్స్‌లకు తాను ఎంతగానో థ్రిల్లయ్యానన్నారు. తాను ఎన్నో కళాశాలలు తిరిగినా ఇటువంటి వాతావరణం, విద్యార్థుల హుషారు ఇక్కడే ఎక్కువగా ఆశ్వాదించానని రేష్మి చెప్పారు. అనంతరం విద్యార్థులు అడిగిన అనేక ప్రశ్నలకు రేష్మీ సమాధానాలు చెప్పారు. తొలుత చిత్ర బందానికి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాసరాజు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో సినిమా డైరెక్టర్ వెంకట్, నిర్మాత చంద్రశేఖర్ ఆజాద్, కొరియోగ్రాఫర్ యాండి పిళై, కమెడియన్ ఫణి, యాంకర్ నరేష్‌రాయ్, నటుడు భార్గవ్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement