in vishnu collage
-
సోలార్ తోడు.. వాహనాల దౌడు
ఆసక్తికరంగా, సోలార్ వెహికల్ చాంపియన్‌షిప్ పోటీలు, విష్ణు కళాశాల ఆవరణలో interesting, solar vehicle championship competitions, in vishnu collage భీమవరం టౌన్ : విష్ణు మహిళా ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి ఎలక్ట్రిక్ సోలార్ వెహికల్ చాంపియన్‌షిప్ పోటీలు గురువారం రెండోరోజుకు చేరుకున్నాయి. ఇంపీరియల్ సొసైటీ ఆఫ్ ఇన్నోవేటివ్ ఇంజినీర్స్(ఐఎస్‌ఐఈ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి 87 ఇంజినీరింగ్ విద్యార్థుల బృందాలు హాజరయ్యాయి. సాంకేతిక, వ్యాపార ఆధారిత పరీక్షలు పూర్తయిన వాహనాలకు వేగం, యాక్సిలరేషన్, వాహన బరువు పరీక్షలు నిర్వహించినట్టు ఐఎస్‌ఐఈ సంచాలకుడు వినోద్ గుప్త, ప్రిన్సిపాల్ డాక్టర్ జి.శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాసరాజు తెలిపారు. ఆయా జట్లు రూపొందించిన వాహనాలు తొలి రోజు సాంకేతిక, వ్యాపార అభివృద్ధి పరీక్షలో నెగ్గాయన్నారు. వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా, రోడ్డు ప్రమాదాలు నియంత్రించే విధంగా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి విద్యార్థులు ఈ వాహనాలను తయారు చేశారన్నారు. -
భీమవరంలో ‘తను నచ్చెనంట’..
భీమవరం : స్థానిక శ్రీ విష్ణు మహిళా ఇంజినీరింగ్ కళాశాలకు శుక్రవారం ‘తను నచ్చెనంట’ సినిమా బృందం ప్రమోషన్ కోసం వచ్చింది. ఈ సినిమా హీరోయిన్, టీవీ యాంకర్ రేష్మీ గౌతమ్ సందడి చేశారు. విద్యార్థులతో సెల్ఫీలు దిగడంతో పాటు డ్యాన్స్‌లు వేసి హుషారెత్తించారు. ఈ సందర్భంగా రేష్మీ మాట్లాడుతూ కళాశాలలోని విద్యార్థులకు తాను సంబ్రమాశ్చర్యాలు కలిగించాలనుకున్నానని, అయితే విద్యార్థినులు యాంకరింగ్, డ్యాన్స్‌లకు తాను ఎంతగానో థ్రిల్లయ్యానన్నారు. తాను ఎన్నో కళాశాలలు తిరిగినా ఇటువంటి వాతావరణం, విద్యార్థుల హుషారు ఇక్కడే ఎక్కువగా ఆశ్వాదించానని రేష్మి చెప్పారు. అనంతరం విద్యార్థులు అడిగిన అనేక ప్రశ్నలకు రేష్మీ సమాధానాలు చెప్పారు. తొలుత చిత్ర బందానికి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాసరాజు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో సినిమా డైరెక్టర్ వెంకట్, నిర్మాత చంద్రశేఖర్ ఆజాద్, కొరియోగ్రాఫర్ యాండి పిళై, కమెడియన్ ఫణి, యాంకర్ నరేష్రాయ్, నటుడు భార్గవ్ పాల్గొన్నారు. -
సైబర్ సెక్యూరిటీపై జాగ్రత్త అవసరం
భీమవరం: కంప్యూటర్లలో నిక్షిప్తమైన సమస్థ సమాచారం ఇతరుల పరం కాకుండా సైబర్ సెక్యూరిటీపై జాగ్రత్తగా ఉండాలని ఆంధ్రా వర్శిటీ ప్రిన్సిపాల్ డాక్టర్ పీఎస్ అవధాని అన్నారు. భీమవరం శ్రీవిష్ణు మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘సైబర్ సెక్యూరిటీ అండ్ ఫోరెన్సిక్స్’ అంశంపై ఐదు రోజుల పాటు జరిగేlజాతీయ స్థాయి శిక్షణ శిబిరాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. సైబర్ సెక్యూరిటీ విధానాలు, నిపుణులు అవలంబించే ప్రక్రియ, సమాచారం దోపిడీ, వెబ్సైట్ హ్యాకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డుల మోసాలపై అవగాహన కల్పించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ జి.శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ పి.శ్రీనివాసరాజు, వి.శ్రీకాంత్, వి.పురుషోత్తమరాజు పాల్గొన్నారు.