సోలార్ తోడు.. వాహనాల దౌడు
ఆసక్తికరంగా, సోలార్ వెహికల్ చాంపియన్‌షిప్ పోటీలు, విష్ణు కళాశాల ఆవరణలో
interesting, solar vehicle championship competitions, in vishnu collage
భీమవరం టౌన్ : విష్ణు మహిళా ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి ఎలక్ట్రిక్ సోలార్ వెహికల్ చాంపియన్‌షిప్ పోటీలు గురువారం రెండోరోజుకు చేరుకున్నాయి. ఇంపీరియల్ సొసైటీ ఆఫ్ ఇన్నోవేటివ్ ఇంజినీర్స్(ఐఎస్‌ఐఈ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి 87 ఇంజినీరింగ్ విద్యార్థుల బృందాలు హాజరయ్యాయి. సాంకేతిక, వ్యాపార ఆధారిత పరీక్షలు పూర్తయిన వాహనాలకు వేగం, యాక్సిలరేషన్, వాహన బరువు పరీక్షలు నిర్వహించినట్టు ఐఎస్‌ఐఈ సంచాలకుడు వినోద్ గుప్త, ప్రిన్సిపాల్ డాక్టర్ జి.శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాసరాజు తెలిపారు. ఆయా జట్లు రూపొందించిన వాహనాలు తొలి రోజు సాంకేతిక, వ్యాపార అభివృద్ధి పరీక్షలో నెగ్గాయన్నారు. వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా, రోడ్డు ప్రమాదాలు నియంత్రించే విధంగా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి విద్యార్థులు ఈ వాహనాలను తయారు చేశారన్నారు.