బంగళాలో ఏం జరిగింది? | What is happening in Bungalow? | Sakshi
Sakshi News home page

బంగళాలో ఏం జరిగింది?

Published Tue, Feb 9 2016 12:47 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 PM

బంగళాలో  ఏం జరిగింది?

బంగళాలో ఏం జరిగింది?

ఆనంద్ నందా, రేష్మి, శివకృష్ణ ప్రధాన పాత్రల్లో వి.సినీ స్టూడియో నిర్మాణంలో డి. దివాకర్ నిర్మించిన చిత్రం ‘రాణి గారి బంగళా’.  ఈ చిత్రం లోగోను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రం షూటింగ్ డిసెంబరులో మొదలు పెట్టి ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేశాం. రాణిగారి బంగళాలో ఏం జరిగింది? అనేది ఆసక్తికరమైన అంశం.

మార్చి చివరి వారంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. ‘‘ ‘జయం’ చిత్రం తర్వాత అంత ప్రాముఖ్యమున్న కాటికాపరి పాత్రలో నటించడం సంతోషంగా ఉంది’’ అని నటుడు శివకృష్ణ తెలిపారు. నిర్మాత ప్రసన్న కుమార్, నటుడు వైజాగ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రభాకర్ రెడ్డి, సమర్పణ: బాలాజీ నాగలింగం, సహ నిర్మాత: శ్రీనివాసరావు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement