ఆ బంగ్లాలో.... | Rajugari Bangla Audio Release | Sakshi
Sakshi News home page

ఆ బంగ్లాలో....

Published Mon, Apr 11 2016 2:34 AM | Last Updated on Sun, Sep 3 2017 9:38 PM

ఆ బంగ్లాలో....

ఆ బంగ్లాలో....

‘గుంటూరు టాకీస్’ వంటి ఎడల్ట్ కామెడీతో ఓ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న రష్మి ఓ హారర్ చిత్రంలో కనిపించడానికి సిద్ధమవుతున్నారు. బాలాజీ నాగలింగం సమర్పణలో ఆనంద్ నందా, రష్మీ గౌతమ్ జంటగా డి.దివాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాజుగారి బంగ్లా’. ఈ చిత్రం పాటలను దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్.వి. కృష్ణారెడ్డి మాట్లాడుతూ- ‘‘మంచి హారర్ సబ్జెక్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అందరికీ మంచి పేరు తీసుకురావాలి’’ అని ఆకాంక్షించారు.

దర్శకుడు దివాకర్ మాట్లాడుతూ- ‘‘సింగిల్ షెడ్యూల్‌లో ఈ చిత్రం పూర్తిచేశాం. ఈశ్వర్ అందించిన బాణీలు ఈ చిత్రానికి హైలైట్’’ అని చెప్పారు. ఈ పాటల విడుదల వేడుకలో నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సి.కల్యాణ్, సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement