భూమి ఫడ్నేకర్, షెహనాజ్ గిల్, కుషా కపిలా ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'థ్యాంక్యూ ఫర్ కమింగ్'. కరణ్ బూలానీ దర్శకత్వంలో ఏక్తాకపూర్, రియా కపూర్, అనిల్ కపూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలే రిలీజైన ఈ అడల్ట్ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చిన ఈ చిత్రంపై నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. తాజాగా మూవీ ప్రమోషన్లలో నిర్మాత ఏక్తా కపూర్ ట్విటర్ వేదికగా 'ఆస్క్ మీ ఎనిథింగ్' సెక్షన్ నిర్వహించారు. అయితే ఇందులో పాల్గొన్న నెటిజన్స్ నిర్మాతపై విమర్శలు చేశారు.
(ఇది చదవండి: నిజం కాబోతున్న సినిమా కథ.. ప్రాణాలకు ముప్పు తప్పదా?)
ఓ నెటిజన్ రాస్తూ..'నీ వల్ల ఎంతోమంది యువత చెడిపోతున్నారు. మంచి సినిమాలు చేయడం తెలుసుకో' అంటూ కామెంట్ చేశాడు. కొందరైతే ఏకంగా.. నువ్వు, కరణ్ జోహార్ కలిసి చాలామంది చెడగొడుతున్నారు.. ఎంతోమంది విడాకులకు మీ ఇద్దరే కారణమని పోస్ట్ చేశాడు. దీనికి ఏక్తా కపూర్ స్పందిస్తూ అవునా అని రిప్లై ఇచ్చింది. మరో నెటిజన్ రాస్తూ..దయచేసి మీరు అడల్ట్ సినిమాలు చేయడం మానండి అని విజ్ఞప్తి చేశాడు. దీనిపై స్పందిస్తూ.. 'ఆ ఛాన్సే లేదు.. నేనొక అడల్ట్ కాబట్టి అలాంటి సినిమాలే చేస్తా’ అని కౌంటరిచ్చింది. నెటిజన్ల విమర్శలను ఏమాత్రం లెక్క చేయకుండా తనదైన శైలిలో ఇచ్చిపడేసింది.
(ఇది చదవండి: హీరో రవితేజపై విరుచుకుపడ్డ 'కేజీఎఫ్' యష్ ఫ్యాన్స్!)
కాగా.. జితేంద్ర, శోభా కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏక్తా కపూర్ సినిమాలు, సీరియల్స్‌ను కూడా నిర్మించారు. రాగిణి ఎంఎంఎస్, ది డర్టీ పిక్చర్, షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్, ఏక్ విలన్, ఉడ్తా పంజాబ్, సూపర్ సింగ్, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, డ్రీమ్‌గర్ల్ వంటి చిత్రాలకు ఆమె నిర్మాతగా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment