adult film actress
-
'నా ఇష్టం.. నేను అలాంటి సినిమాలే చేస్తా': నెటిజన్స్‌కు ఇచ్చిపడేసిన ఏక్తా కపూర్
భూమి ఫడ్నేకర్, షెహనాజ్ గిల్, కుషా కపిలా ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'థ్యాంక్యూ ఫర్ కమింగ్'. కరణ్ బూలానీ దర్శకత్వంలో ఏక్తాకపూర్, రియా కపూర్, అనిల్ కపూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలే రిలీజైన ఈ అడల్ట్ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చిన ఈ చిత్రంపై నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. తాజాగా మూవీ ప్రమోషన్లలో నిర్మాత ఏక్తా కపూర్ ట్విటర్ వేదికగా 'ఆస్క్ మీ ఎనిథింగ్' సెక్షన్ నిర్వహించారు. అయితే ఇందులో పాల్గొన్న నెటిజన్స్ నిర్మాతపై విమర్శలు చేశారు. (ఇది చదవండి: నిజం కాబోతున్న సినిమా కథ.. ప్రాణాలకు ముప్పు తప్పదా?) ఓ నెటిజన్ రాస్తూ..'నీ వల్ల ఎంతోమంది యువత చెడిపోతున్నారు. మంచి సినిమాలు చేయడం తెలుసుకో' అంటూ కామెంట్ చేశాడు. కొందరైతే ఏకంగా.. నువ్వు, కరణ్ జోహార్ కలిసి చాలామంది చెడగొడుతున్నారు.. ఎంతోమంది విడాకులకు మీ ఇద్దరే కారణమని పోస్ట్ చేశాడు. దీనికి ఏక్తా కపూర్ స్పందిస్తూ అవునా అని రిప్లై ఇచ్చింది. మరో నెటిజన్ రాస్తూ..దయచేసి మీరు అడల్ట్ సినిమాలు చేయడం మానండి అని విజ్ఞప్తి చేశాడు. దీనిపై స్పందిస్తూ.. 'ఆ ఛాన్సే లేదు.. నేనొక అడల్ట్ కాబట్టి అలాంటి సినిమాలే చేస్తా’ అని కౌంటరిచ్చింది. నెటిజన్ల విమర్శలను ఏమాత్రం లెక్క చేయకుండా తనదైన శైలిలో ఇచ్చిపడేసింది. (ఇది చదవండి: హీరో రవితేజపై విరుచుకుపడ్డ 'కేజీఎఫ్' యష్ ఫ్యాన్స్!) కాగా.. జితేంద్ర, శోభా కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏక్తా కపూర్ సినిమాలు, సీరియల్స్‌ను కూడా నిర్మించారు. రాగిణి ఎంఎంఎస్, ది డర్టీ పిక్చర్, షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్, ఏక్ విలన్, ఉడ్తా పంజాబ్, సూపర్ సింగ్, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, డ్రీమ్‌గర్ల్ వంటి చిత్రాలకు ఆమె నిర్మాతగా వ్యవహరించారు. -
షాకింగ్: నటి బ్లాక్మెయిల్.. భరించలేక సూసైడ్ యత్నం
డబ్బు కోసం తమపై ఓ ఎయిర్‌హోస్టెస్ కమ్ నటి వేధింపులకు పాల్పడటాన్ని భరించలేక.. ఓ కుటుంబం ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఇందుకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఆ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ముంబైకి చెందిన ఓ పోర్న్ స్టార్ తమ కుటుంబాన్ని డబ్బు కోసం గత కొంతకాలంగా బ్లాక్మెయిల్ చేస్తోందని, వివాహేతర సంబంధాలున్నాయని తనను బద్నాం చేసి తన కుటుంబానికి నరకం చూపిస్తోందని అషి ఖాన్ అనే వ్యక్తి(ఆ వీడియోలో ఉంది) ఆరోపించాడు. ఈ మేరకు తల్లీ, భార్యతో కలిసి విషం తాగి వీడియో తీసి ఆత్మహత్యకు యత్నించారు. నా పేరు అషి ఖాన్, ఉజ్జయినిలోని లోహె పుల్లో ఉంటున్నాం. ముంబైకి చెందిన రిమ్జిమ్ అనే పోర్న్‌స్టార్ గత కొంతకాలంగా నాపై వేధింపులకు పాల్పడుతోంది. ముంబైలో ఉన్నప్పుడు ఆమెతో నాకు పరిచయం అయ్యింది. అయితే కొంతకాలానికి ఆమె నాకు షాక్ ఇచ్చింది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే.. ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరిపిస్తోంది. ఏం చేయాలో తెలియక.. నా పెళ్లి టైంలో కొంత డబ్బు ఇచ్చాను. మళ్లీ ఇప్పుడు ఇంకా డబ్బు కావాలని బ్లాక్ మెయిల్ చేస్తోంది. ముంబైలో ఉన్నప్పుడు నాపై రేప్ కేసు పెట్టి జైలుకు పంపింది. ఇప్పుడు.. మళ్లీ పంపుతామని బెదిరిస్తోంది. ఆమె వేధింపులను భరించలేకపోతున్నాం. అందుకే కుటుంబంతో ఆత్మహత్యకు యత్నిస్తున్నాం అని అషి ఖాన్ అందులో పేర్కొన్నాడు. బాధితుడు స్థానికంగా ఓ బట్టల దుకాణం నడుపుతున్నట్లు సమాచారం. ఇక నిందితురాలు రిమ్జిమ్ స్వస్థలం అసోం గువాహతి. ముంబైలో ఎయిర్‌హోస్టెస్‌గా పని చేస్తోంది. అయితే.. తరచూ నీలి చిత్రాలు, అడల్ట్ యాప్ సినిమాల్లో నటిస్తూ.. వివాహితులను లక్ష్యంగా చేసుకుని ఆమె డబ్బు గుంజుతోందని తెలుస్తోంది. ఘటన జరిగాక.. బంధువులు అప్రమత్తం అయ్యి స్థానికుల సాయంతో ఆ కుటుంబాన్ని ఆస్పత్రిలో చేర్పించారు. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? లేదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
నటిని ముక్కలుగా చేసి.. ఆపై బతికే ఉందని నమ్మించాడు
ఆమె ఒక శృంగార తార. రెండు నెలల నుంచి బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా.. సైలెంట్‌గా ఉండిపోయింది. ఈలోపు పోలీసులకు ఓ మహిళ మృతదేహం కేసు పెద్ద తలనొప్పిగా మారింది. చివరాఖరికి.. ముచ్చటపడి ఒంటి మీద వేయించుకున్న టాటూలే, ఆ శృంగార తార మిస్సింగ్ మిస్టరీ, హత్యను బయటపెట్టాయి. ఇటలీ బ్రెసియా ప్రావిన్స్‌లోని ‘బోర్నో’లో నటి కరోల్ మాల్టేసి(26) హత్యోదంతం సంచలనం సృష్టించింది. దాదాపు రెండు నెలల తర్వాత.. ఊరి శివారులో 15 చెత్త సంచుల్లో ఆమె మృతదేహాం ముక్కలుగా లభ్యమైంది. ముఖం పూర్తిగా కాలిపోయి ఉంది. దీంతో ఆమె ఎవరనేది పోల్చుకోవడానికి పోలీసులకు కష్టంగా మారింది. కరోల్ మాల్టేసి అలియాస్ ఛార్లోట్టె యాంగీ.. ఓన్లీఫ్యాన్స్ స్టార్. ఆరేళ్ల ఓ బిడ్డకు తల్లి కూడా. అంతకు ముందు ఓ రెస్టారెంట్లో పని చేసేదామె. అయితే కరోనా వల్ల ఉద్యోగం పోవడంతో.. అడల్ట్ స్టార్ అవతారం ఎత్తింది . ఆపై కొన్ని అడల్ట్ సినిమాల్లో నటించింది కూడా. అయితే.. జనవరి నుంచి ఆమె అకౌంట్ వాడకంలో లేదు. ఏ కొత్త చిత్రానికి సైన్ చేయలేదు. ఈలోపు.. వారం కిందట.. బోర్నో శివారులో ప్లాస్టిక్ సంచుల్లో ముక్కలుగా ఉన్న గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే నమోదు అయిన మిస్సింగ్ కేసులతో ఆ బాడీ ఆనవాలు మ్యాచ్ కాలేదు. దీంతో పోలీసులకు విచారణ కష్టతరంగా మారింది. ఈ తరుణంలో బాడీపై ఉన్న టాటూల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. ఆ రాతలు ప్రత్యేకమైనవి కావడంతో ఆమె స్నేహితులు పోల్చుకోగలిగారు. చివరికి అవి ఇటలీ-డచ్ సంతతికి చెందిన కరోల్ మాల్టేసివే అని నిర్ధారించుకున్నారు. అద్దె కట్టడంతో అనుమానం జనవరి నుంచి కరోల్ తన సోషల్ మీడియా అకౌంట్లో యాక్టివ్‌గా లేదు. దీంతో ఆమె విదేశాలకు వెళ్లి ఉంటుందని ఆమె స్నేహితులు భావించారట. అందుకే ఆమె మిస్సింగ్ కేసు నమోదు కాలేదు. ఈ లోపు ఆమె క్రమం తప్పకుండా అద్దె చెల్లిస్తుండడంపై పోలీసులు దృష్టి పెట్టారు. ఆ పని చేస్తోంది.. కరోల్ పక్కింట్లో ఉండే 43 ఏళ్ల డేవిడ్ ఫోంటానా. బ్యాంక్ ఉద్యోగి అయిన డేవిడ్ ఫోంటానాను పోలీసులు విచారించగా.. హత్య తానే చేసినట్లు అంగీకరించాడు. ముక్కలు చేసి ఫ్రీజర్‌లో.. పరస్పర అంగీకారంతో.. శృంగారంలో పాల్గొనే సమయంలోనే పొరపాటున ఆమెను హత్య చేశానని నిందితుడు డేవిడ్ ఫొంటానా చెప్పాడు. హత్య అనంతరం పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ఆమె బాడీని ముక్కలుగా చేసి సంచుల్లో దాచేసి.. ఫ్రీజర్‌లో భద్రపరిచాడట. అప్పటి నుంచి ఆమె ఇంటి అద్దెను చెల్లించడంతో పాటు బాధితురాలి తల్లికి, ఆమె బాయ్‌ఫ్రెండ్‌కు ఫోన్ ద్వారా సందేశాలు ఇస్తూ.. ఆమె బతికే ఉందని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆమె నుంచి బదులు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఓ స్నేహితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమె ఇంటికి ఎంక్వైరీకి వచ్చారు. ఈ పరిణామంతో భయపడ్డ నిందితుడు.. ఫ్రీజర్ నుంచి ఆ సంచుల్ని తీసేసి ఊరి చివర పడేసి వచ్చాడు. ఆపై ఒంటి మీద టాటూల ఆధారంగా మొత్తానికి ఈ కేసును చేధించారు పోలీసులు. -
మరో పోర్నోగ్రఫీ రాకెట్.. వర్ధమాన నటి అరెస్ట్
హిందీ సినిమా ఫైనాన్షియర్, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ వ్యవహారం వార్తల్లో కొనసాగుతుండగానే.. మరో పోర్న్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్లో గుట్టుచప్పుడు కాకుండా అశ్లీల చిత్రాల వ్యవహారం నడిపిస్తున్న ఓ మోడల్ కమ్ నటిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా దొరకబట్టి.. అరెస్ట్ చేశారు పోలీసులు. వర్ధమాన నటి నందితా దత్తా(30) ఒకప్పుడు బిజీ మోడల్. చాలాకాలంగా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఛాన్స్‌లు దొరక్క బీ గ్రేడ్, చివరికి సెమీ పోర్నోగ్రఫిక్ కంటెంట్ సినిమాల్లో నాన్సీ భాబీ పేరిట నటిస్తూ వస్తోంది. అయితే తనకున్న పరిచయాలతో యంగ్ మోడల్స్‌కు వెబ్ సిరీస్ అవకాశాలను ఎరగా చూపెట్టింది. చివరికి వాళ్లు వలలో చిక్కాక.. నీలి చిత్రాల్లో నటించాలని ఒత్తిడి చేస్తూ వస్తోంది. ఈ మేరకు ఇద్దరు బాధితురాళ్లు ఇచ్చిన సమాచారంతో పోలీసులు డమ్ డమ్, నక్‌టాలాలోని కొన్ని ఇళ్లలో శుక్రవారం ఏకకాలంలో దాడులు జరిపారు. నక్‌టాలాలో తన ఇంట్లో ఓ మోడల్ నగ్నంగా మారాలని బెదిరిస్తున్న టైంలో పోలీసులు నందితాను అడ్డుకుని.. అరెస్ట్ చేశారు. మరోవైపు డమ్ డమ్లోని మరో ఇంట్లో ఆమె అనుచరుడు మైనక్ నేతృత్వంలో పోర్న్ షూటింగ్ జరుపుతున్న టైంలో పోలీసులు దాడులు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అవకాశాల ఆశజూపి తమను ఇందులోకి దింపిందని.. మాట వినకుంటే తన మనుషులతో చంపిస్తానని బెదిరించిందని నందితపై ఆ ఇద్దరు మోడల్స్ ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు బాలీగుంజేలోని ఓ ప్రైవేట్ స్టూడియోలో తనపై అఘాయిత్యం జరిగిందని పేర్కొంటూ ఈ మేరకు జులై 26న న్యూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. ఇక ఈ కేసులో నందితతో పాటు మైనక్ ఘోష్ కీలక వ్యక్తులుగా భావిస్తున్నారు. ఇది భారీ సెక్స్ రాకెట్ అనే అనుమానం ఉందని, రాజ్‌కుంద్రాతో లింక్‌లు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలోనూ దర్యాప్తు చేపడతామని ఓ సీనియర్ అధికారి చెప్తున్నాడు. అయితే నందితను పూర్తిస్థాయిలో ప్రశ్నించాకే ఏ విషయం అనేదానిపై స్పష్టత వస్తుందని ఆయన అంటున్నాడు. -
డబ్బులు తీసుకోలేదు.. ఫ్రీగా చేశా: మియా ఖలీఫా
ఎక్స్-పోర్న్‌స్టార్, ప్రయుఖ వెబ్‌కామ్ మోడల్ మియా ఖలీఫా మరోసారి వార్తల్లోకి నిలిచింది. క్యూబా అల్లకల్లోలంపై ఆమె చేసిన పోస్ట్‌తో రాజకీయపరమైన విమర్శలు మొదలయ్యాయి. ఏకంగా క్యూబా అధ్యక్షుడు మిగ్యుయెల్ దిజాయ్-కనెల్ ఆమెపై విరుచుకుపడ్డాడు. మియాను ఓ క్యారెక్టర్‌లేని పర్సనాలిటీగా పేర్కొన్న మిగ్యుయెల్.. ఆమె ఒక అమెరికా పెయిడ్ ఏజెంట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆమె స్పందించింది. ‘ప్రజల పట్ల మానవత్వం లేకుండా ప్రదర్శిస్తున్న మీ తీరును ఇతరులకు తెలియజేయాలనే ఆ పని చేశా. నేనేం డబ్బులు తీసుకుని ఆ పని చేయలేదు. ఏ ప్రభుత్వం కూడా నాకు ఆ పని అప్పజెప్పలేదు. నా పరిధిలో ఉచితంగా ఆ ట్వీట్ చేశా’ అంటూ ట్వీట్ ద్వారా బదులిచ్చింది ఆమె. అంతేకాదు క్యూబా అయినా, పాలస్తీనా అయినా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడమే నా పని అంటూ మరో ట్వీట్ ద్వారా పేర్కొంది. ఇదిలా ఉంటే క్యూబా ప్రజల ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు బైడెన్ మద్దతు తెలిపిన రోజే.. మియా ఖలీఫా ట్వీట్ చేసింది. దీంతో మీడియా ప్రతినిధులు క్యూబా అధ్యక్షుడు మిగ్యుయెల్ దగ్గర ఆమె ప్రస్తావన తీసుకురావడంతో ‘ఆమె అమెరికా చేతిలో కీలు బొమ్మ. క్యారెక్టర్ లేని వ్యక్తి. పెయిడ్ ఏజెంట్’ అంటూ ఆయన విరుచుకుపడ్డాడు. ఇక మియాకు ఇలా ఇన్‌న్యూస్ విషయాలపై కొత్తేం కాదు. గతంలో పాలస్తీనా విషయంలో అమెరికా తప్పుల్ని సైతం వెలేత్తి చూపించిందామె. సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ లెబనీస్-అమెరికన్ సెలబ్రిటీ.. తరచూ కొందరికి సాయం అందించడంతో పాటు ఇలా వివాదాల్లో కూడా నిలుస్తోంది. It’s tough not to see the faces of my people in the suffering of Cubans. Lebanon, Palestine, Cuba, it doesn’t matter where it’s happening, all that matters is it needs to be talked about because look at the result: PRESSURE forces change https://t.co/OG6QeEM7QL — Mia K. (@miakhalifa) July 15, 2021 -
కన్యత్వం కోల్పోతే తప్పేంటి?
సాక్షి, చెన్నై: బోల్డ్‌గా ఫీలవుతూ సెలబ్రిటీలు చెప్పే సమాధానాలు ఒక్కోసారి వాళ్లను చిక్కులో పడేస్తుంటాయి. యువ హీరోయిన్ యాషిక ఆనంద్(19) ఓ ఆన్లైన్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పెళ్లికి ముందే అమ్మాయిలు కన్యత్వం కోల్పోతే తప్పేం కాదని ఆమె వ్యాఖ్యానించటంతో విమర్శలు మొదలయ్యాయి. అడల్ట్ హర్రర్ కామెడీగా తెరకెక్కిన ‘ఇరుట్టు అరైయిల్ మొరట్టు కుత్తు’ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. ప్రమోషన్లో భాగంగా ఓ ఆన్లైన్ ఇంటర్వ్యూలో ఈ చిత్ర హీరోయిన్ యాషిక పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ‘పెళ్లికి ముందు అమ్మాయిలు తప్పు చేయటం సరైందేనా?’ అన్న ఓ ప్రశ్నకు ఆమె బదులిస్తూ... ‘అందులో పెద్ద సందేహం ఏముంది. పెళ్లికి ముందు అబ్బాయిలు ఎలా అయితే వారి వర్జినిటి కోల్పోతారో అమ్మాయిలు కూడా అదే విధంగా కోల్పోతారు. ఇద్దరిలో పెద్దగా తేడాలు ఉండవు. అందులో తప్పు కూడా లేదు. ఎవరి ఇష్టం వాళ్లది’ అని వ్యాఖ్యానించారు. తానూ పోర్న్ వీడియోలు చూస్తానని, ఓసారి ఇంట్లో తల్లిదండ్రులకు అడ్డంగా దొరికిపోయానని, అయినా వాళ్లు తనని ఏం అనలేదని ఆమె చెప్పుకొచ్చారు. ఇక కొందరు ఆమెను సోషల్ మీడియాలో మియా ఖలీపాతో పోల్చటంపై స్పందిస్తూ అడల్ట్ చిత్రం చేసినంత మాత్రం అలా కామెంట్లు చేయటం సరికాదన్నారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో ఆమె నోటి వెంట కొన్ని బూతు డైలాగులు, అడల్ట్ జోకులు పేలాయి. దీంతో యషికపై విమర్శలు మొదలయ్యాయి. సోమవారం కొన్ని మహిళా సంఘాలు యాషిక ఇంటర్వ్యూపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ చెన్నైలో సినిమా ఆడుతున్న థియేటర్ల వద్ద ధర్నా నిర్వహించాయి. మరోవైపు కోలీవుడ్ సీనియర్ నటీనటులు ఈ చిత్రంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్ కార్తీక్, యాషిక, వైభవి శాండిల్య, వీజే షారా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంతోష్ జయకుమార్ దర్శకత్వం వహించారు. కన్యగా చనిపోయిన ఓ యువతి దెయ్యంగా మారి, ఓ బంగ్లాకు వచ్చే యువకులతో రొమాన్స్ చేయటమే ఈ చిత్ర ఇతివృత్తం. హాలీవుడ్ చిత్రం హ్యాండ్ జాబ్ క్యాబిన్ ఆధారంగా ఇది తెరకెక్కింది. -
మతబోధకురాలిగా మారిన పోర్న్ స్టార్
న్యూయార్క్: ఏడాదికి దాదాపు రూ. రెండు కోట్ల సంపాదన. విలాసవంతమైన జీవితం. వందకు పైగా పోర్న్ చిత్రాల్లో నటించి పోర్న్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది. ఒక్క సంఘటనతో వీటన్నిటిని వదిలేసింది. ఓ చిన్న టౌన్ ఫాల్టన్లోని చర్చిలో మతబోధకురాలిగా మారింది ఒకప్పటి ప్రముఖ పోర్న్ స్టార్ క్రిస్టల్ బస్సెట్టె. చిన్న తనంలోనే లైంగిక దాడికి గురైన బస్సెట్టె పదహారేళ్లకే గర్భం దాల్చింది. తన కుమారుడు జస్టిన్‌కు అండగా నిలవాలనుకుంది. వెంటనే కాలిఫోర్నియా నుంచి హాలివుడ్‌కు మకాం మార్చింది. ముందుగా మోడలింగ్, తర్వాత డబ్బు కోసం బార్లలో డ్యాన్సులు కూడా చేసింది. ఓ అడల్ట్ చిత్ర ఏజెంట్ అమెను సంప్రదించి పోర్న్ మూవీల్లో నటించడానికి అవకాశం కల్పించాడు. నెలకు రూ.20 లక్షలు సంపాదించే అవకాశం దొరకడంతో వెనకాముందు చూసుకోకుండా ఓకే చెప్పేసింది. అనంతరం కొద్ది రోజుల్లోనే మలిబు హౌస్‌లో తొలిసారి పోర్న్ చిత్రంలోని ఓ సన్నివేశంలో నటించింది. 'ఆ రోజు తొలిసారి పోర్న్లో నటించిన తర్వాత షవర్ కింద దాదాపు రెండు గంటలు కూర్చొని ఏడవడం నాకు ఇంకా గుర్తుంది. ఆ షూటింగ్ పూర్తయిన తర్వాత నెల వరకు మరో షూటింగ్‌కు వెళ్లలేదు. పోర్న్ చిత్రాల్లో నటిస్తున్న సమయంలో స్పర్శలేకుండా ఉండటానికి మద్యం సేవించడం, పెయిన్లెస్ మెడిసిన్లు వాడటం ప్రారంభించాను' అని తన చీకటి రోజులను బస్సెట్టె గుర్తు చేసుకుంది. అనతికాలంలోనే పోర్న్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. మలీబూలో అత్యంత విలాసవంతమైన భవంతి, ఖరీదైన ఫెరారీ కారుతో పాటూ మరో ఆరు కార్లు కూడా కొనేసింది. కుమారున్ని స్కూల్లో వదిలి అటు నుంచే షూటింగ్‌కు వెళ్లడం బస్సెట్టె రోజూవారి దిన చర్యగా మారింది. ఆ సమయంలో కేవలం తన గురించి, తన కుమారుని గురించి మాత్రమే ఆలోచించాను అని చెప్పింది. 2014 మే లో జరిగిన ఓ సంఘటన బస్సెట్టెను పూర్తిగా మార్చివేసింది. తాగిన మత్తులో బస్సెట్టె నడుపుతున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో ఆమెపై డ్రంక్ డ్రైవ్ కింద కేసుకూడా నమోదైంది. ప్రమాదంతో దాదాపు చావు అంచువరకు వెళ్లొచ్చిన ఆమె ఎవరి కోసం బతుకుతున్నానో కూడా అర్థం కాని పరిస్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే తన పదేళ్ల పోర్న్ జీవితానికి స్వస్థి చెప్పాలని భావించింది. తన కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్లి వారితో కలిసి ఉండటం ప్రారంభించింది. చర్చిలో తన సోదరి వివాహానికి హాజరయినప్పుడు పాస్టర్ డెవిడ్‌ను కలుసుకుంది. తన సోదరి తరచూ చర్చికి వెళ్లడంతో బస్సెట్టె గతం డెవిడ్కు తెలిసింది. ఆమె గతాన్ని పట్టించుకోకుండా ఆమెను వివాహమాడాడు డేవిడ్. ఇప్పుడు వారిద్దరికి కలిసి ఓ కుమారుడు జన్మించాడు. కారు ప్రమాదం నుంచి బయటపడినటప్పుడు దేవుడిచ్చిన పునర్జన్మగా భావించానని బస్సెట్టె తెలిపింది. డేవిడ్ సహకారంతో పాస్టర్ ట్రైనింగ్ తీసుకుంది. వీరిద్దరుకలిసి ఓ చర్చిని సొంతంగా నిర్మించి అక్కడే కొత్త జీవితం ప్రారంభించారు. ప్రస్తుతం నా గురించి ఎవరు ఏమనుకుంటున్నారో అని ఆలోచించడం లేదు. డబ్బు సంపాదన గురించి అసలు ఆలోచనే లేదు. పేదలకు సహాయం చేయడం, మంచి వాఖ్యాలు భోధించడం పైనే ఇప్పుడు నా దృష్టి పెట్టాను అంటోంది బస్సెట్టె.