మతబోధకురాలిగా మారిన పోర్న్‌ స్టార్ | From porn star to pastor | Sakshi
Sakshi News home page

మతబోధకురాలిగా మారిన పోర్న్‌ స్టార్

Published Mon, Mar 13 2017 11:49 AM | Last Updated on Tue, Sep 18 2018 8:00 PM

మతబోధకురాలిగా మారిన పోర్న్‌ స్టార్ - Sakshi

మతబోధకురాలిగా మారిన పోర్న్‌ స్టార్

న్యూయార్క్:
ఏడాదికి దాదాపు రూ. రెండు కోట్ల సంపాదన. విలాసవంతమైన జీవితం. వందకు పైగా పోర్న్ చిత్రాల్లో నటించి పోర్న్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది. ఒక్క సంఘటనతో వీటన్నిటిని వదిలేసింది. ఓ చిన్న టౌన్‌ ఫాల్టన్లోని చర్చిలో మతబోధకురాలిగా మారింది ఒకప్పటి ప్రముఖ పోర్న్ స్టార్ క్రిస్టల్‌ బస్సెట్టె. చిన్న తనంలోనే లైంగిక దాడికి గురైన బస్సెట్టె పదహారేళ్లకే గర్భం దాల్చింది. తన కుమారుడు జస్టిన్‌కు అండగా నిలవాలనుకుంది. వెంటనే కాలిఫోర్నియా నుంచి హాలివుడ్‌కు మకాం మార్చింది. ముందుగా మోడలింగ్‌, తర్వాత డబ్బు కోసం బార్లలో డ్యాన్సులు కూడా చేసింది. ఓ అడల్ట్‌ చిత్ర ఏజెంట్‌ అమెను సంప్రదించి పోర్న్‌ మూవీల్లో నటించడానికి అవకాశం కల్పించాడు. నెలకు రూ.20 లక్షలు సంపాదించే అవకాశం దొరకడంతో వెనకాముందు చూసుకోకుండా ఓకే చెప్పేసింది.

అనంతరం కొద్ది రోజుల్లోనే మలిబు హౌస్లో తొలిసారి పోర్న్ చిత్రంలోని ఓ సన్నివేశంలో నటించింది. 'ఆ రోజు తొలిసారి పోర్న్లో నటించిన తర్వాత షవర్‌ కింద దాదాపు రెండు గంటలు కూర్చొని ఏడవడం నాకు ఇంకా గుర్తుంది. ఆ షూటింగ్ పూర్తయిన తర్వాత నెల వరకు మరో షూటింగ్‌కు వెళ్లలేదు. పోర్న్ చిత్రాల్లో నటిస్తున్న సమయంలో స్పర్శలేకుండా ఉండటానికి మద్యం సేవించడం, పెయిన్‌లెస్‌ మెడిసిన్లు వాడటం ప్రారంభించాను' అని తన చీకటి రోజులను బస్సెట్టె గుర్తు చేసుకుంది.



అనతికాలంలోనే పోర్న్‌ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. మలీబూలో అత్యంత విలాసవంతమైన భవంతి, ఖరీదైన ఫెరారీ కారుతో పాటూ మరో ఆరు కార్లు కూడా కొనేసింది. కుమారున్ని స్కూల్‌లో వదిలి అటు నుంచే షూటింగ్‌కు వెళ్లడం బస్సెట్టె రోజూవారి దిన చర్యగా మారింది. ఆ సమయంలో కేవలం తన గురించి, తన కుమారుని గురించి మాత్రమే  ఆలోచించాను అని చెప్పింది.

2014 మే లో జరిగిన ఓ సంఘటన బస్సెట్టెను పూర్తిగా మార్చివేసింది. తాగిన మత్తులో బస్సెట్టె నడుపుతున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో ఆమెపై డ్రంక్‌ డ్రైవ్ కింద కేసుకూడా నమోదైంది. ప్రమాదంతో దాదాపు చావు అంచువరకు వెళ్లొచ్చిన ఆమె ఎవరి కోసం బతుకుతున్నానో కూడా అర్థం కాని పరిస్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే తన పదేళ్ల పోర్న్ జీవితానికి స్వస్థి చెప్పాలని భావించింది. తన కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్లి వారితో కలిసి ఉండటం ప్రారంభించింది. చర్చిలో తన సోదరి వివాహానికి హాజరయినప్పుడు పాస్టర్‌ డెవిడ్‌ను కలుసుకుంది. తన సోదరి తరచూ చర్చికి వెళ్లడంతో బస్సెట్టె గతం డెవిడ్కు తెలిసింది. ఆమె గతాన్ని పట్టించుకోకుండా ఆమెను వివాహమాడాడు డేవిడ్‌. ఇప్పుడు వారిద్దరికి కలిసి ఓ కుమారుడు జన్మించాడు. కారు ప్రమాదం నుంచి బయటపడినటప్పుడు దేవుడిచ్చిన పునర్జన్మగా భావించానని బస్సెట్టె తెలిపింది. డేవిడ్‌ సహకారంతో పాస్టర్‌ ట్రైనింగ్‌ తీసుకుంది. వీరిద్దరుకలిసి ఓ చర్చిని సొంతంగా నిర్మించి అక్కడే కొత్త జీవితం ప్రారంభించారు.

ప్రస్తుతం నా గురించి ఎవరు ఏమనుకుంటున్నారో అని ఆలోచించడం లేదు. డబ్బు సంపాదన గురించి అసలు ఆలోచనే లేదు. పేదలకు సహాయం చేయడం, మంచి వాఖ్యాలు భోధించడం పైనే ఇప్పుడు నా దృష్టి పెట్టాను అంటోంది బస్సెట్టె.





Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement