షాకింగ్‌: నటి బ్లాక్‌మెయిల్‌.. భరించలేక సూసైడ్‌ యత్నం | Blackmailed by Mumbai Actress family consume poison video viral | Sakshi
Sakshi News home page

షాకింగ్‌: నటి బ్లాక్‌మెయిల్‌.. భరించలేక సూసైడ్‌ యత్నం

Published Fri, Dec 23 2022 9:20 PM | Last Updated on Mon, Dec 26 2022 12:39 PM

Blackmailed by Mumbai Actress family consume poison video viral - Sakshi

డబ్బు కోసం తమపై ఓ ఎయిర్‌హోస్టెస్‌ కమ్‌ నటి వేధింపులకు పాల్పడటాన్ని భరించలేక.. ఓ కుటుంబం ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఇందుకు సంబంధించిన వీడియో.. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఆ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

ముంబైకి చెందిన ఓ పోర్న్‌ స్టార్‌ తమ కుటుంబాన్ని డబ్బు కోసం గత కొంతకాలంగా బ్లాక్‌మెయిల్‌ చేస్తోందని, వివాహేతర సంబంధాలున్నాయని తనను బద్నాం చేసి తన కుటుంబానికి నరకం చూపిస్తోందని అషి ఖాన్‌ అనే వ్యక్తి(ఆ వీడియోలో ఉంది) ఆరోపించాడు. ఈ మేరకు తల్లీ, భార్యతో కలిసి విషం తాగి వీడియో తీసి ఆత్మహత్యకు యత్నించారు. 

నా పేరు అషి ఖాన్‌, ఉజ్జయినిలోని లోహె పుల్‌లో ఉంటున్నాం. ముంబైకి చెందిన రిమ్‌జిమ్‌ అనే పోర్న్‌స్టార్‌ గత కొంతకాలంగా నాపై వేధింపులకు పాల్పడుతోంది. ముంబైలో ఉన్నప్పుడు ఆమెతో నాకు పరిచయం అయ్యింది. అయితే కొంతకాలానికి ఆమె నాకు షాక్‌ ఇచ్చింది.  అడిగినంత డబ్బు ఇవ్వకపోతే.. ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరిపిస్తోంది. ఏం చేయాలో తెలియక.. నా పెళ్లి టైంలో కొంత డబ్బు ఇచ్చాను. మళ్లీ ఇప్పుడు ఇంకా డబ్బు కావాలని బ్లాక్‌ మెయిల్‌ చేస్తోంది. ముంబైలో ఉన్నప్పుడు నాపై రేప్‌ కేసు పెట్టి జైలుకు పంపింది. ఇప్పుడు.. మళ్లీ పంపుతామని బెదిరిస్తోంది. ఆమె వేధింపులను భరించలేకపోతున్నాం. అందుకే కుటుంబంతో ఆత్మహత్యకు యత్నిస్తున్నాం అని అషి ఖాన్‌ అందులో పేర్కొన్నాడు. 

బాధితుడు స్థానికంగా ఓ బట్టల దుకాణం నడుపుతున్నట్లు సమాచారం. ఇక నిందితురాలు రిమ్‌జిమ్‌ స్వస్థలం అసోం గువాహతి. ముంబైలో ఎయిర్‌హోస్టెస్‌గా పని చేస్తోంది. అయితే.. తరచూ నీలి చిత్రాలు, అడల్ట్‌ యాప్‌ సినిమాల్లో నటిస్తూ.. వివాహితులను లక్ష్యంగా చేసుకుని ఆమె డబ్బు గుంజుతోందని తెలుస్తోంది. ఘటన జరిగాక.. బంధువులు అప్రమత్తం అయ్యి స్థానికుల సాయంతో ఆ కుటుంబాన్ని ఆస్పత్రిలో చేర్పించారు.  నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? లేదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement