కన్యత్వం కోల్పోతే తప్పేంటి? | Yaashika Aanand Virginity Comments Creates Troubles | Sakshi
Sakshi News home page

Published Tue, May 15 2018 6:08 PM | Last Updated on Tue, May 15 2018 6:22 PM

Yaashika Aanand Virginity Comments Creates Troubles - Sakshi

సాక్షి, చెన్నై: బోల్డ్‌గా ఫీలవుతూ సెలబ్రిటీలు చెప్పే సమాధానాలు ఒక్కోసారి వాళ్లను చిక్కులో పడేస్తుంటాయి. యువ హీరోయిన్‌ యాషిక ఆనంద్‌(19) ఓ ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పెళ్లికి ముందే అమ్మాయిలు కన‍్యత్వం కోల్పోతే తప్పేం కాదని ఆమె వ్యాఖ్యానించటంతో విమర్శలు మొదలయ్యాయి. అడల్ట్‌ హర్రర్‌ కామెడీగా తెరకెక్కిన ‘ఇరుట్టు అరైయిల్‌ మొరట్టు కుత్తు’ బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. ప్రమోషన్‌లో భాగంగా ఓ ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలో ఈ చిత్ర హీరోయిన్‌ యాషిక పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.

‘పెళ్లికి ముందు అమ్మాయిలు తప్పు చేయటం సరైందేనా?’ అన్న ఓ ప్రశ్నకు ఆమె బదులిస్తూ... ‘అందులో పెద్ద సందేహం ఏముంది. పెళ్లికి ముందు అబ్బాయిలు ఎలా అయితే వారి వర్జినిటి కోల్పోతారో అమ్మాయిలు కూడా అదే విధంగా కోల్పోతారు. ఇద్దరిలో పెద్దగా తేడాలు ఉండవు. అందులో తప్పు కూడా లేదు. ఎవరి ఇష్టం వాళ్లది’ అని వ్యాఖ్యానించారు. తానూ పోర్న్‌ వీడియోలు చూస్తానని, ఓసారి ఇంట్లో తల్లిదండ్రులకు అడ్డంగా దొరికిపోయానని, అయినా వాళ్లు తనని ఏం అనలేదని ఆమె చెప్పుకొచ్చారు. ఇక కొందరు ఆమెను సోషల్‌ మీడియాలో మియా ఖలీపాతో పోల్చటంపై స్పందిస్తూ అడల్ట్‌ చిత్రం చేసినంత మాత్రం అలా కామెంట్లు చేయటం సరికాదన్నారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో ఆమె నోటి వెంట కొన్ని బూతు డైలాగులు, అడల్ట్‌ జోకులు పేలాయి. దీంతో యషికపై విమర్శలు మొదలయ్యాయి. సోమవారం కొన్ని మహిళా సంఘాలు యాషిక ఇంటర్వ్యూపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ చెన్నైలో సినిమా ఆడుతున్న థియేటర్ల వద్ద ధర్నా నిర్వహించాయి.

మరోవైపు కోలీవుడ్‌ సీనియర్‌ నటీనటులు ఈ చిత్రంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్‌ కార్తీక్‌, యాషిక, వైభవి శాండిల్య, వీజే షారా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంతోష్‌ జయకుమార్‌ దర్శకత్వం వహించారు. కన్యగా చనిపోయిన ఓ యువతి దెయ్యంగా మారి, ఓ బంగ్లాకు వచ్చే యువకులతో రొమాన్స్‌ చేయటమే ఈ చిత్ర ఇతివృత్తం. హాలీవుడ్‌ చిత్రం హ్యాండ్‌ జాబ్‌ క్యాబిన్‌ ఆధారంగా ఇది తెరకెక్కింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement