'సెక్స్ అడిక్ట్'గా తెలుగు నటుడు | 'Hunterrr' Telugu remake will be bold, emotional: Srinivas Avasarala | Sakshi
Sakshi News home page

'సెక్స్ అడిక్ట్'గా తెలుగు నటుడు

Published Tue, Jul 26 2016 1:05 PM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

'సెక్స్ అడిక్ట్'గా తెలుగు నటుడు

'సెక్స్ అడిక్ట్'గా తెలుగు నటుడు

చెన్నై: ఇప్పటివరకు సాఫ్ట్ రోల్స్ చేస్తూ వచ్చిన నటుడు అవసరాల శ్రీనివాస్ బోల్డ్ రోల్‌ చేయడానికి సిద్ధమయ్యాడు. బాలీవుడ్ అడల్డ్ కామెడీ 'హంటర్రర్' తెలుగు రీమేక్ లో లీడ్ రోల్ చేయనున్నాడు. ఈ సినిమాలో 'సెక్స్ అడిక్ట్'గా అతడు నటించనున్నాడు. బోల్డ్ సీన్లతో పాటు ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని శ్రీనివాస్ చెప్పాడు.

'సెకాండాఫ్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. అందుకే ఈ సినిమా చేస్తున్నా. ఈ చిత్రాన్ని అందరూ అడల్ట్ కామెడీ అంటున్నారు. కానీ స్టోరీ, నా కేరెక్టర్ కు లోతైన అర్థం ఉంద'ని శ్రీనివాస్ పేర్కొన్నాడు. ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ గా సంతకం చేయలేదని, కొద్ది రోజుల్లో ఫైనల్ అవుతుందని వెల్లడించాడు. ఇప్పటికే సినిమా షూటింగ్ ప్రారంభమైందని, ఆగస్టు నుంచి తాను చిత్రీకరణలో పాల్గొంటానని చెప్పాడు. హీరోయిన్ ను ఇంకా ఎంపిక చేయలేదన్నాడు. రెజినా, రాశిఖన్నా పేర్లు విన్పిస్తున్నాయి. ఈ సినిమాకు నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement