కేవలం మగపిల్లలనే కబళించే భయంకరమైన వ్యాధి ఇది. వచ్చిందో అంతే సంగతులు. సరైన చికిత్స కూడా అందుబాటులో లేదు. కుటుంబంలో ఒక్కరూ బారిన పడ్డారంటే..ఆ తల్లి కడుపున పుట్టిన వారందరికీ కూడా వచ్చేస్తుంది. ఇంతకీ ఈ వ్యాధి పేరేంటంటే..?
ఈ వ్యాధి పేరు డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ (డీఎండీ). దీన్ని ‘పీడియాట్రిక్ న్యూరోమస్కులర్ డిజార్డర్’ అని కూడా అంటారు. ఇది ఒక జన్యుపరమైన వ్యాధి. ఈ వ్యాధి ఎక్కువగా మగ పిల్లలను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి కారణంగా కండరాల బలహీనత ఏర్పడుతుంది. సాధారణంగా నాలుగు ఏళ్ల వయస్సు నుంచి మొదలై ఊహకందని విధంగా వేగంగా వ్యాప్తి చెందుతుంది.
అయితే జన్యువులోపం వల్ల మగ పిల్లలో సంభవించే వంశపారంపర్య నాడీ కండరాల రుగ్మతగా వైద్యులు పేర్కొన్నారు. ఇది సోకిన వారు తీవ్రమైన కండరాల క్షీణతకు లోనవుతారు. నడవలేకపోవడం, శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇటీవల తెలంగాణలోనే ఇద్దరు అన్నదమ్ములు డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధి బారిన పడటం అందరీలోనూ తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది.
ఒకేసారి తోబుట్టువులకీ వచ్చే అవకాశం..
ఈ అన్నదమ్ములిద్దరూ నాలుగేళ్లపాటు చాలా సాధారణంగా ఉన్నారు. అందరి పిల్లల మాదిరిగా చక్కగా ఆడుతూ పాడుతూ చలాకీగా ఉండేవారు. సడెన్‌గా పెద్దవాడు శారీరకంగా బలహీనంగా కనిపించడం ప్రారంభించాడు. దీంతో వైద్యులను సంప్రదించగా ..అసలు విషయం విని షాకయ్యారు.
వెంటనే తమ్ముడుకు కూడా ఇవే టెస్టులు చేయగా.. ఇద్దరూ మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధిబారిన పడ్డట్లు పేరెంట్స్‌కు తెలిపారు. ఒకే తల్లి గర్భంలో పుట్టిన తోబుట్టువులందరికీ ఈ వ్యాధి సోకే అవకాశం 99% ఉంటుందని వైద్యులు చెప్పారు. అయితే దీనికి చికిత్స అందుబాటులో లేదని, కొంతకాలం ఇలాగే జీవించి చనిపోతారని వెల్లడించారు. ఈ వ్యాధి బారినపడిన పిల్లలు యుక్తవయస్సు దాటి బతకడం కష్టమేనని అన్నారు.
తీరని కడుపుకోత..
అలాంటి ఈ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం అత్యంత ముఖ్యం. మన టాలీవుడ్ సినీ నటుడు అవసరాల శ్రీనివాస్ కూడా ఈ వ్యాధిపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తున్నారు. తనను ఒక పేరెంట్ ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో సహాయం చేయమని కోరడంతోనే ఈ కార్యక్రమానికి పూనుకున్నానని చెప్పారు. అంతేగాదు గర్భం దాల్చిన 3వ నెలలో దాదాపు రూ. 3000 రూపాయలకే ప్రతి స్త్రీ ప్రీ-నేటల్ టెస్ట్ చేయించుకోవాలని శ్రీనివాస్ సూచిస్తున్నారు.
పిండానికి డీఎండీ ఉన్నట్లు గుర్తించినట్లయితే తక్షణమే గర్భం తీయించుకోవడం లేదా అబార్షన్ చేయించడం వంటివి చేయొచ్చని అన్నారు. లేదంటే వారిని బతికించుకోలేక కళ్ల ముంగిటే చనిపోతున్న బిడ్డలను చూసి తట్టుకోవడం ప్రతి తల్లిదండ్రులకు కష్టమేనని అన్నారు. అలాగే ఇలా గర్భం దాల్చిన సమయంలోనే ఆ టెస్ట్‌లు చేయించుకుంటే.. ఏ తల్లిదండ్రులకు కడుపు కోత అనుభవించాలన్సి పరిస్థితి ఎదురవ్వదని చెబుతున్నారు శ్రీనివాస్ అవసరాల.
(చదవండి: International Chocolate Day: చర్మ సంరక్షణకు డార్క్ చాక్లెట్..!)
Comments
Please login to add a commentAdd a comment