ఆ చిత్రంలో నటించడం అవసరమా? | Riyamikka Worried About X Videos Movie | Sakshi
Sakshi News home page

ఆ చిత్రంలో నటించడం అవసరమా?

Published Thu, Aug 2 2018 8:33 AM | Last Updated on Thu, Aug 2 2018 8:33 AM

Riyamikka Worried About X Videos Movie - Sakshi

రియామిక

తమిళసినిమా: ఆ చిత్రంలో నటించడం అవసరమా అని స్నేహితులు, సన్నిహితులు అన్నారని నటి రియామిక పేర్కొంది. సమీపకాలంలో తెరపైకి వచ్చిన ఎక్స్‌ వీడియోస్‌ చిత్రంలో కథానాయకిగా నటించిన నటి రియామిక. చెన్నైలో ఉన్నత విద్యను పూర్తి చేసిన బెంగళూర్‌ బ్యూటీ ఈమె. అమ్మ ఆశను పూర్తి చేసిన కూతురుల పట్టికలో రియామిక ఒకరు. కళాశాలలో చదువుతుండగానే కొన్ని వాణిజ్య చిత్రాల్లో నటించిన రియామికకు ప్రముఖ ఛాయాగ్రాహకుడు బాలసుబ్రమణియన్‌ కుటుంబ స్నేహితుడన్నది గమనార్హం. రియామికకు తొలి చిత్రం కుండ్రత్తిలే కుమరనుక్కు కొండాట్టం అయినా పేరు తెచ్చి పెట్టింది మాత్రం ఎక్స్‌ వీడియోస్‌నేనట. ఈ చిత్రంలో నటించడం కూడా అనూహ్యంగా జరిగిందని రియామిక చెప్పింది. మొదట దర్శకుడు కథ చెప్పకుండా తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలనే తెలిపారని అంది. అంతే కాకుండా చిత్రంలో నటించడం మొదలెట్టిన తరువాతే టైటిల్‌ చెప్పారని పేర్కొంది.

అయితే ఎక్స్‌ వీడియోస్‌ చిత్రంలో తన నటనను పలువురు ప్రశంసించినా, సన్నిహితులు, స్నేహితులు కొందరు ఇలాంటి చిత్రంలో నటించడం అవసరమా అని ప్రశ్నించారని చెప్పింది. అయినా ఒక మంచి అవగాహనాత్మక చిత్రంలో నటించానని సంతృప్తి చెందినట్లు అంది. ఈ చిత్రం తరువాత అఘోరి చిత్రంలో నటించానని, హర్రర్‌ థ్రిల్లర్‌ ఇతివృత్తంతో కూడిన ఇందులో ఐదే పాత్రలు ఉంటాయని, అందులో తనదే మహిళ పాత్ర అని చెప్పింది. ఈ చిత్ర షూటింగ్‌ కేరళలో నెల రోజుల పాటు జరిగిందని తెలిపింది. అక్కడ షూటింగ్‌ గ్యాప్‌లో పిల్లలకు క్లాసిక్‌ డాన్స్‌ నేర్పించడంతో పాటు చిత్ర యూనిట్‌కు సాంకేతిక కళాకారిణిగానూ పనిచేసినట్లు చెప్పింది. ప్రస్తుతం మాయవన్‌ చిత్రం ఫేమ్‌ దర్శక నిర్మాత సీవీ.కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తున్నట్లు తెలిపింది. మొదట ఆయన నిర్మించే చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని, తరువాత ఒన్‌ ప్లస్‌ ఒన్‌లా ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రంలోనూ నటించే అవకాశాన్ని కల్పించారని చెప్పింది. తన నటన చూసి అందరూ చాలా బాగా నటిస్తున్నావు.కూత్తుపట్టరై (ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌)లో శిక్షణ పొందావా అని అడుగుతుండడంతో, ఆ కూత్తుపట్టరైలో శిక్షణ ఎలా ఉంటుందో చూద్దామని, ప్రస్తుతం అక్కడ చేరినట్లు రియామిక తెలిపింది. మంచి ఛాలెంజింగ్‌లో కూడిన కథా పాత్రల్లో నటించాలని ఆశపడుతున్నట్లు చెబుతున్న ఈ బ్యూటీకి బాలీవుడ్‌ నటి కంగనా రావత్, కోలీవుడ్‌లో నయనతార నచ్చిన నటీమణులని తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement