‘క్రేజీ అంకుల్స్‌’తో వస్తున్న శ్రీముఖి.. | Anil Ravipudi Releases Crazy Uncles Title Song | Sakshi
Sakshi News home page

క్రేజీ అంకుల్స్: లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌

Published Sun, Jul 25 2021 8:17 PM | Last Updated on Sun, Jul 25 2021 8:37 PM

Anil Ravipudi Releases Crazy Uncles Title Song - Sakshi

యాంకర్ శ్రీముఖి, సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా క్రేజీ అంకుల్స్.. సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించిన ఈ చిత్రం ఇటీవలె ట్రైలర్‌ విడుదలైంది. కామెడీ జానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టులో థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా క్రేజీ అంకుల్ టైటిల్ లిరిక‌ల్ సాంగ్‌ని చేసింది చిత్ర యూనిట్‌.


ఇక క్రేజీ అంకుల్స్‌ సినిమాపై యాంకర్‌ శ్రీముఖి మాట్లాడుతూ..సినిమాకు మొదట్నుంచే మంచి రెస్పాన్స్‌ వస్తుంది. థియేటర్స్‌లో చూడాల్సిన చక్కని ఫ్యామిలీఎంటర్‌టైనర్‌ మూవీ ఇది. ఈ సినిమాలో చాలా మంది ఫేమస్‌ యాక్టర్స్‌ నటించారు అని తెలిపింది. ప్రస్తుతం పెద్ద సినిమాలు సైతం థియేటర్స్‌లో రిలీజ్‌ అవుతున్న ఈ తరుణంలో క్రేజీ అంకుల్స్‌ సినిమాను కూడా థియేటర్స్‌లో  ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న నిర్మాతలకు ధన్యవాదాలు అని నటుడు రాజా రవీంద్ర అన్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement