ఆర్‌జీవీ యువర్‌ ఫిల్మ్‌  | Ramgopal Varma created a concept called Your Film | Sakshi
Sakshi News home page

ఆర్‌జీవీ యువర్‌ ఫిల్మ్‌ 

Published Sun, Apr 7 2024 1:40 AM | Last Updated on Sun, Apr 7 2024 1:40 AM

Ramgopal Varma created a concept called Your Film - Sakshi

దర్శక–నిర్మాత రామ్‌గోపాల్‌ వర్మ (ఆర్‌జీవీ) ‘యువర్‌ ఫిల్మ్‌’ అంటూ ఓ కాన్సెప్ట్‌ను క్రియేట్‌ చేశారు. ప్రేక్షకులే ఓ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులను ఫైనలైజ్‌ చేసే విధానానికి శ్రీకారం చుడుతూ ఆర్‌జీవీడెన్‌.కామ్‌ అనే వెబ్‌సైట్‌ను మొదలుపెట్టారు ఆర్‌జీవీ. ఈ వెబ్‌సైట్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణులు, క్లుప్తంగా సినిమా కథాంశం వంటి వివరాలను ఉంచుతారు.

ఆడిషన్స్‌ ఇచ్చే వారి వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ ఆడిషన్స్‌లో ప్రేక్షకులు ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తే, వారు ఆ ప్రాజెక్ట్‌కి ఫైనలైజ్‌ అవుతారు. అలా ఫైనల్‌ అయినవారితో ఆరు నెలల్లో సినిమా నిర్మిస్తారట రామ్‌గోపాల్‌ వర్మ. ఆర్‌జీవీ డెన్‌ ద్వారా భాషతో సంబంధం లేకుండా ఈ ఎంపిక జరుగుతుందని రామ్‌గోపాల్‌ వర్మ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement