వర్మ మమ్మల్ని మోసం చేశారు | ramgopal varma has cheated us, says vangaveeti yuvasena | Sakshi
Sakshi News home page

వర్మ మమ్మల్ని మోసం చేశారు

Published Sun, Dec 25 2016 6:01 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 PM

వర్మ మమ్మల్ని మోసం చేశారు

వర్మ మమ్మల్ని మోసం చేశారు

వంగవీటి సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ తమను మోసం చేశారని వంగవీటి యువసేన తీవ్రంగా మండిపడింది. ఈ సినిమాలో రంగాను హీరోగా చూపిస్తామని తమకు చెప్పారని, తాము షూటింగ్‌లో పాల్గొన్న సమయంలో రంగాను హీరోగానే చూపించారు గానీ, అసలు విడుదలైన సినిమాలో అలాంటి సీన్లు ఎక్కడా లేవని యువసేన ప్రతినిధులు అన్నారు. 
 
రంగా చేసిన సామాజిక సేవలను ఎక్కడా చూపించలేదని మండిపడ్డారు. వర్మ తీరుతో తమ మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, వంగవీటి మోహనరంగా చేసిన సమాజసేవను మళ్లీ చిత్రీకరించి రెండు రోజుల్లో సినిమాను రీ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే తాము తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement