విజయవాడ వెళ్తున్నా: వర్మ
తాను ఈనెల 26వ తేదీన విజయవాడ వెళ్లనున్నట్లు దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. తాను త్వరలో తీయబోతున్న 'వంగవీటి' సినిమా గురించి పరిశోధన చేయడానికి, కొంతమంది వ్యక్తులను కలవడానికి వెళ్తున్నట్లు చెప్పాడు.
వంగవీటి సినిమా తర్వాత ఇక తాను తెలుగులో సినిమాలు తీయబోనని, ఇదే చివరిది అవుతుందని అంతకుముందు వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. విజయవాడలోనే చదువుకున్న వర్మ.. అప్పట్లో తాను చూసిన విషయాలతో పాటు.. మరిన్ని విషయాలు తెలుసుకుని ఆ సినిమాను రూపొందించే ప్రయత్నాలలో పడ్డాడు. ఇంతకుముందే.. తన సినిమాలో వంగవీటి మోహనరంగా పాత్రధారి ఎలా ఉండబోతున్నాడో చూడమంటూ ఓ ఫొటోను కూడా వర్మ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
Going to Vijayawada on 26th to meet some people for the research on "Vangaveeti"
— Ram Gopal Varma (@RGVzoomin) February 22, 2016