varma tweets
-
అయ్యా.. నన్ను ఒగ్గెయ్యండయ్యా..: రాజమౌళి
ఒకవైపు నాలుగు రోజుల్లో భారీ సినిమా విడుదల కాబోతోంది. అదికూడా ముందు ఒక భాగం అనుకున్నది రెండు భాగాలుగా తీసిన సినిమా. అలాంటప్పుడు దర్శకుడు ఎంత టెన్షన్‌తో ఉంటాడో ఊహించగలం కదా. కానీ ఇలాంటి సమయంలో రాంగోపాల్ వర్మ తనతో కలిసి తీయించుకున్న ఫొటోను ట్వీట్ చేసి.. దానికి ఏవేవో కామెంట్లు పెట్టడంతో రాజమౌళి ఏమనుకున్నారో ఏమో.. 'అయ్యా, నన్ను ఒగ్గెయండయ్యా' అంటూ వర్మను బతిమాలుకున్నారు. దర్శకధీరుడు రాజమౌళితో కలిసి గతంలో ఎప్పుడో ఒక సందర్భంలో తాను ఉన్న ఫొటోను రాంగోపాల్ వర్మ పొద్దున్నే ట్వీట్ చేశారు. దానికి 'బ్యూటీ అండ్ అగ్లీ' అని కేప్షన్ పెట్టారు. ఇక అప్పటినుంచి ట్వీట్ల యుద్ధం మొదలైంది. తాను అగ్లీగా ఉన్నానని, రాజమౌళి మాత్రం అందమైన బాహుబలి కంటే కూడా చాలా సెక్సీగా కనపడుతున్నారని ఆ తర్వాత మరింత వివరణ ఇచ్చారు వర్మ. అయితే ఈ సంవాదంలోకి ఉన్నట్టుండి బాలీవుడ్ క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ ప్రవేశించాడు. మీరిద్దరూ గొప్ప దర్శకులన్నది వాస్తవమని, అయితే ఇద్దరూ అగ్లీగానే ఉన్నారని ట్వీట్ చేశాడు. దాంతో వర్మకు చిర్రెత్తుకొచ్చింది. మీరు చాలా బాగా చెప్పారని, అందరూ మీ అంత, షారుక్ ఖాన్ అంత అందంగా ఉండలేరని వెటకారంగా సమాధానం ఇచ్చారు. దానికి మళ్లీ కమాల్ స్పందిస్తూ తాను అందంగా ఉన్నానన్న విషయం తనకు తెలుసని, అయితే షారుక్ ఖాన్ గురించి మాత్రం చెప్పలేనని అన్నాడు. దానికి ఈ ప్రపంచం మొత్తం అంగీకరిస్తుందని వర్మ అన్నారు. ఆ తర్వాత తనదైన శైలిలో అగ్లీ.. బ్యూటీ అంటూ ఆ రెండు పదాల కలయికతో ఓ పెద్ద వాక్యాన్ని ట్వీట్ చేశారు. @RGVzoomin Ayyaaa...nannu oggeyyandayyaa.... -
జీవితంలో అత్యంత దారుణమైన రోజులు అవే..
-
ఈ రాంగోపాల్ వర్మకు ఏమైంది?
తల్లి.. తండ్రి.. గురువు.. ఈ ముగ్గురూ దైవంతో సమానం అంటారు. ఎంత ఎత్తుకు ఎదిగినా, మనకు చిన్నతనం నుంచి పాఠాలు బోధించిన గురువులను ఎట్టి పరిస్థితుల్లోనూ మరువం. వారిని తలుచుకుంటేనే గౌరవభావం ఉప్పొంగుతుంది. కానీ ఊరందరిదీ ఒక దారైతే ఉలిపికట్టెది మరో దారి అంటారు. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తీరు అలాగే ఉంది. తాను ఎప్పుడూ నేర్చుకోలేదని.. అందరికీ నేర్పేవాడినని, అందువల్ల తనకు తానే హ్యాపీ టీచర్స్ డే చెప్పుకొంటానని, మిగిలినవాళ్లకు మాత్రం అన్‌హ్యాపీ టీచర్స్‌డే అంటూ ట్వీట్ల వర్షం మొదలుపెట్టాడు. పనిలో పనిగా పిల్లలకు ఓ పనికిమాలిన సలహా కూడా ఇచ్చాడు. స్కూల్లో టీచర్లతో సమయం వృథా చేసుకోవద్దని, కేవలం గూగుల్ నుంచే నేర్చుకోవాలని తెలిపాడు. తాను తన టీచర్లందరినీ ద్వేషించేవాడినని, అందుకే క్లాసులు ఎగ్గొట్టి సినిమాలు చూడటం వల్ల తాను దర్శకుడిని అయ్యానని చెప్పుకొచ్చాడు. తన టీచర్లందరికంటే తానే ఎక్కువ విజయాలు సాధించానని, దాన్నిబట్టి తనకు తన టీచర్లు అందరికంటే ఎక్కువ తెలుసని అర్థమవుతోందని రాంగోపాల్ వర్మ అన్నాడు. టీచర్ల కంటే క్లాసులో గొడవల నుంచే తాను ఎక్కువగా నేర్చుకున్నానని.. వాటిలో తాను తిరగబడే మనస్తత్వం గురించి తెలుసుకుని, దాన్ని శివ, సత్య లాంటి సినిమాల్లో ఉపయోగించానని చెప్పాడు. టీచర్లను ద్వేషించడానికి ప్రధాన కారణం.. వాళ్లు తనను క్లాసులో కామిక్ పుస్తకాలు చదవనివ్వకపోవడమేనని అన్నాడు. స్కూలు, కాలేజిలో కొందరు టీచర్లు తనతో బలవంతంగా చదివించేవాళ్లని, జీవితంలో అత్యంత దారుణమైన రోజులు అవేనని చెప్పాడు. ప్రతిరోజూ స్కూల్లో పాఠాలు అయిపోయిన తర్వాత.. వాళ్లు చెప్పినవి మర్చిపోడానికి రెండు కామిక్ పుస్తకాలు, ఫిక్షన్ నవలలు చదివేవాడినని కూడా అన్నాడు. సాధారణంగా తాను విస్కీ తాగనని, కానీ టీచర్స్ విస్కీ మాత్రం ఇష్టమని ముక్తాయించాడు. మరోవైపు ఉపాధ్యాయులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని..వర్మపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీఎస్టీయూ సంఘం విజయవాడలోని గవర్నర్ పేట పీఎస్‌లో రాంగోపాల్ వర్మపై ఫిర్యాదు చేసింది. కర్నూలు జిల్లాలోని నంద్యాల టూటౌన్ పీఎస్‌లోనూ వర్మపై ఏపీ ఎస్టీయూ ఫిర్యాదు చేసింది. I never learnt but I always taught,so I am wishing myself Happy Teacher's Day #UnHappyTeachersDay — Ram Gopal Varma (@RGVzoomin) September 5, 2016 I hated all my teachers nd n that's why I bunked classes nd saw films nd that's why I became filmmaker #UnHappyTeachersDay — Ram Gopal Varma (@RGVzoomin) September 5, 2016 I became more successful than all my teachers and that proves that I knew much more than all my teachers #UnHappyTeachersDay — Ram Gopal Varma (@RGVzoomin) September 5, 2016 More than from teachers,I learnt from bullies in class who gave my first insights into rebel psychology which I employed in Shiva,Satya etc — Ram Gopal Varma (@RGVzoomin) September 5, 2016 I used to hate my teachers because they used to constantly disrupt me from reading comic books in class #UnHappyTeachersDay — Ram Gopal Varma (@RGVzoomin) September 5, 2016 The worst days of my life were when I was being forcefully taught by my various teachers at school and college #UnHappyTeachersDay — Ram Gopal Varma (@RGVzoomin) September 5, 2016 Everyday after I got away from teachers,I used 2 read comics nd fiction novels whole night 2 unlearn what they taught #UnHappyTeachersDay — Ram Gopal Varma (@RGVzoomin) September 5, 2016 My sincere advise to all youngsters on #UnHappyTeachersDay is to not waste time with teachers and learn only from Google — Ram Gopal Varma (@RGVzoomin) September 5, 2016 I normally don't drink whiskey but I loveeeeee Teacher's Whisky #UnHappyTeachersDay — Ram Gopal Varma (@RGVzoomin) September 5, 2016 -
విజయవాడ వెళ్తున్నా: వర్మ
తాను ఈనెల 26వ తేదీన విజయవాడ వెళ్లనున్నట్లు దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. తాను త్వరలో తీయబోతున్న 'వంగవీటి' సినిమా గురించి పరిశోధన చేయడానికి, కొంతమంది వ్యక్తులను కలవడానికి వెళ్తున్నట్లు చెప్పాడు. వంగవీటి సినిమా తర్వాత ఇక తాను తెలుగులో సినిమాలు తీయబోనని, ఇదే చివరిది అవుతుందని అంతకుముందు వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. విజయవాడలోనే చదువుకున్న వర్మ.. అప్పట్లో తాను చూసిన విషయాలతో పాటు.. మరిన్ని విషయాలు తెలుసుకుని ఆ సినిమాను రూపొందించే ప్రయత్నాలలో పడ్డాడు. ఇంతకుముందే.. తన సినిమాలో వంగవీటి మోహనరంగా పాత్రధారి ఎలా ఉండబోతున్నాడో చూడమంటూ ఓ ఫొటోను కూడా వర్మ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. Going to Vijayawada on 26th to meet some people for the research on "Vangaveeti" — Ram Gopal Varma (@RGVzoomin) February 22, 2016 -
వందల కోట్లుండి.. లక్షలు బిచ్చమేస్తారా?
చెన్నై వర్షాల మీద రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించాడు. ఎప్పటిలాగే దేవుడి మీద, సినిమా నటుల మీద తీవ్రస్థాయిలో సెటైర్లు వేశాడు. వందల కోట్లు ఉన్న సూపర్స్టార్లు కేవలం లక్షల్లో మాత్రమే విరాళాలు ప్రకటించడం, బాగా పెద్దనటులు కొంతమంది అసలు స్పందించకపోవడం, ఇంకొందరు కేవలం ప్రార్థనలతో సరిపెట్టేయడం.. అన్నింటినీ విమర్శించాడు. వర్మ ఏమన్నాడో ఆయన మాటల్లోనే... ''వర్షాలు కురిసేది దేవుడివల్లే కాబట్టి.. ప్రతిఒక్కరూ ప్రార్థించడానికి బదులు దేవుడిని విమర్శించాలి. లేకపోతే చెన్నైవాసులందరూ పాపులని, అందుకే దేవుడు శిక్షించాడని చెప్పాలి. చెన్నై వాసులను చూసి చాలా బాధపడుతున్నాను, సోకాల్డ్ దేవుడి మీద, ఆయన సాగించిన ఉగ్రవాద విధ్వంసం మీద పిచ్చ కోపంగా ఉన్నాను. సెలబ్రిటీలందరూ ప్రార్థించడానికి బదులు దేవుడి చర్యను ఖండించాలి. ఇకనైనా ప్రజలు వెన్నుపోటుదారుడైన దేవుడిని నమ్మి సమయం వృథా చేసుకోడానికి బదులు తమ మీద తాము నమ్మకం పెట్టుకోవాలి. చెన్నైలో దేవుడు సృష్టించిన విధ్వంసం ముందు ప్రపంచంలో ఏ ఉగ్రవాద చర్య అయినా బలాదూరే. చెన్నై వాసుల కష్టాలు చూసి నా గుండె చెదిరిపోతోంది. అందుకే నేను రాయడానికి వీల్లేనంత దారుణమైన భాషలో దేవుడిని తిడుతున్నాను. చెన్నై కష్టాల నేపథ్యంలో దేవుడిని ప్రార్థించిన సెలబ్రిటీలందరినీ కూడా నేను ఖండిస్తున్నాను. ఇది ఉగ్రవాదిని ప్రార్థించడం లాంటిదే అవుతుంది. చెన్నైవాసులు ఇప్పటికైనా తమ దేవుడిని మార్చుకోవాలి. వందల వందల కోట్లున్న సూపర్ స్టార్లు.. వేలవేల కోట్లు నస్టపోయిన చెన్నై వాసులకు ఐదు, పది లక్షలు బిచ్చమేయడం ఏంటి? అయ్యబాబోయ్.. సూపర్ స్టార్లు 10 లక్షలు, 5 లక్షలు ఇస్తే అంత డబ్బు ఏం చేసుకోవాలో తెలియక చెన్నై ప్రజలు మూర్ఛపోతారు. దానికంటే ఇవ్వకపోవడం బెటర్. నా విషయానికొస్తే, నేనెప్పుడూ ఒక్క రూపాయి కూడా దానం చేయలేదు. నేను చాలా స్వార్థపరుడిని. సెలబ్రిటీలలా క్వింటాళ్ల కొద్దీ ప్రార్థనలు, టన్నులకొద్దీ ప్రేమ కురిపించలేను. ఆ సెలబ్రిటీలు కూడా ఇవన్నీ ఇస్తారు గానీ, రూపాయల దగ్గరకొచ్చేసరికి మాత్రం చాలా తక్కువ ఇస్తారు. ఎందుకంటే ప్రార్థనలు, ప్రేమ అంటే చవగ్గా వస్తాయి గానీ డబ్బులు కాదుకదా!'' కొసమెరుపు: అవును, అసలు ఈ వర్షాలను ఆపడానికి రజనీకాంత్ ఎందుకు ఏమీ చేయలేదోనని నేను ఆశ్చర్యపోతున్నాను. Since rain is act of God instead of praying shouldn't every1 b condemning God,unless they blve all Chennaities r sinners n God is punishing — Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2015 I feel so sad for the Chennaities and I feel so fucking angry about the so called God and his this dastardly terrorist act — Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2015 All the celebs instead of praying should condemn God unless they believe that Chennaities are sinners — Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2015 Chennai situation is proof enough that people should start believing in themselves instead of wasting their time on the betrayer God — Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2015 No act of any Terrorist in the world can create more tragedy than what the Act of God created in Chennai — Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2015 My heart goes out to the sufferings of Chennaities and I condemn God in the most harshest unprintable language for this dastardly act — Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2015 I condemn all celebs who pray to God in context of Chennai sufferings because it amounts to praying to a Terrorist for his dastardly act — Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2015 Like one votes out a government for a dastardly act Chennaites should change their God hereafter — Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2015 Vandala vandala kotlunna super starlu vela vela kotlu nashtaoyina chennailaki aidhu Padhi lakshalu bichchameyyadam? — Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2015 Ayyababooi super starlu 10 lakshalu 5 lakshslu isthe antha dabbu yem chesulovalo theliyaka chennaiprajalu moorchapotharu.ivvakapovadam btr — Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2015 As per me I never donated one rupee and am supremely selfish unlike celebs who give quintals of prayers and tonnes of love — Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2015 Celebs give quintals of prayers and tonnes of love,but very very few rupees because prayers and love are cheap and money costs money — Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2015 I wonder why Rajnikant dint do anything to stop the rain? — Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2015 -
యాపిల్ మహిళలు కూడా వస్తారా?
ఎప్పుడూ వివాదాల్లో మునిగి తేలడం.. అవి లేవంటే కొత్తగా వివాదాలు సృష్టించడం దర్శకుడు రాంగోపాల్ వర్మకు అలవాటే. అందులోనూ మహిళల మీద వ్యాఖ్యలు చేయమంటే ఆయన అందరికంటే ముందుంటారు కూడా. ఇప్పుడు తాజాగా అదే పనిచేశారు. ఓవైపు చేతిలో రెండు సినిమాలున్నా.. వాటి మధ్యలో ఖాళీ చూసుకుని మరీ ఈ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. యాపిల్ కంపెనీ ఫోన్లు, వాచీలు, కార్లు తయారుచేస్తోందని.. అంతా బాగానే ఉంది గానీ, మరి యాపిల్ మహిళలను కూడా తయారుచేస్తే చాలా బాగుంటుందని ఆశిస్తున్నట్లు ఆయన తన ట్వీట్లో చెప్పారు. అలాగే.. అసలు లక్ష్మీదేవిని పూజించని అమెరికాలో మనకంటే ఎక్కువ డబ్బుందని మొదలుపెట్టారు. అది లక్ష్మీదేవి లోపమా.. లేక ఆమెను పూజించే మన మూర్ఖత్వమా అని ప్రశ్నించారు. దటీజ్ వర్మ! Apple phones Apple watches Apple cars are all fine but I sincerely wish Apple will also make Apple women — Ram Gopal Varma (@RGVzoomin) March 15, 2015 Lakshmi Devini poojinchani Americalo Manakanna yekkuva dabbundhante Lakshmi Devi lopama leka thanani poojinche mana moorkhathwama? — Ram Gopal Varma (@RGVzoomin) March 15, 2015 -
మూసీనదికి గిన్నిస్ రికార్డు ఖాయం: వర్మ
ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన నది అంటూ ఏమైనా ఉందంటే.. అది మూసీయేనని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. ఈ విషయమై ఆయన తాజాగా వరుసపెట్టి మూడు ట్వీట్లు చేశారు. మూసీనది వీడియో ఫుటేజిని పోటీలకు పంపితే.. ప్రపంచంలోనే అత్యంత చెత్త నదిగా అది గిన్నిస్ రికార్డులు సాధించి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్, ఆయన పార్టీ టీఆర్ఎస్ దీనిపై దృష్టిపెట్టి దాన్ని శుభ్రం చేయిస్తారని ఆశిస్తున్నట్లు వర్మ చెప్పారు. ఏ నగరమైనా తనను తాను నగరం అని చెప్పుకోవాలంటే ముందుగా తన నదులను శుభ్రం చేసుకోవాలని.., భవిష్యత్తులో మూసీనది తెలంగాణకు పర్యాటక కేంద్రంగా మారాలని ఆశిస్తున్నానని తెలిపారు. I think the Musi river of the Telangana state has to be dirtiest river in the whole world...I wish KCR and his TRS will get it cleaned up — Ram Gopal Varma (@RGVzoomin) March 14, 2015 Any city which calls itself a city will first keep its river clean and I wish Musi will become a tourist attraction for Telangana state — Ram Gopal Varma (@RGVzoomin) March 14, 2015 If video footage of Musi river is sent for competition it will for sure win a Guinness book record for the dirtiest river in world — Ram Gopal Varma (@RGVzoomin) March 14, 2015 -
ఈ చిన్నోడు ఎవరో తెలుసా?
ఎంచక్కా తాత చంకెక్కి ఆయన చేతి మీద చెయ్యివేసి అమాయకంగా చూస్తున్న ఈ చిన్నోడు ఎవరో తెలుసా? మరోవైపు.. రెండు చేతులకు రెండు వాచీల్లాంటివి కూడా కనిపిస్తున్నాయి కదూ. ఇంత అమాయకంగా కనిపిస్తూ, కళ్లకు కాటుక కూడా పెట్టుకున్న ఈ పిల్లాడు ఎవరో గుర్తుపట్టారా? ప్రస్తుతం తన సినిమాలతో పాటు ట్వీట్లు, వ్యాఖ్యలతో కూడా సంచలనాలు సృష్టిస్తున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఎప్పటిదో తన చిన్ననాటి ఫొటో ఆల్బం తీసుకుని, అందులోని రెండు ఫొటోలను ఇప్పుడు తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. వాటిలో ఒకటి తానొక్కడే ఉన్న ఫొటో కాగా, మరొకటి.. తన తాతగారితో ఉన్న ఫొటో అంటూ పెట్టాడు. Me and my grandfather pic.twitter.com/hxXxRebRgq — Ram Gopal Varma (@RGVzoomin) March 5, 2015 Me pic.twitter.com/ydm6t2Phgs — Ram Gopal Varma (@RGVzoomin) March 5, 2015 -
ప్రజారాజ్యం పెట్టడం కంటే అదే పెద్దతప్పు!
వివాదాస్పద ట్వీట్లతో ఎప్పుడూ సంచలనం సృష్టించే దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈసారి పెద్ద బాంబే పేల్చాడు. మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమాకు తానే దర్శకత్వం వహించుకోవాలని సూచించాడు. అలా చేయకపోతే ప్రజారాజ్యం పార్టీ స్థాపించడం కంటే కూడా పెద్ద తప్పు అవుతుందన్నాడు. ఆయనకు దర్శకుల కంటే చాలా ఎక్కువ విషయాలు తెలుసని.. ఆ సంగతి తాను ఆయనతో కలిసినప్పుడే తనకు అర్థమైందని అన్నాడు. త్రివిక్రమ్, వినాయక్ లాంటి వాళ్లతో చిరంజీవి 150వ సినిమా చేస్తే అది ఏదో మామూలు సినిమాయే అవుతుందని, అదే ఆయన దర్శకత్వం వహిస్తే బ్రహ్మాండమైన సినిమా అవుతుందని అన్నాడు. తన 150వ సినిమాకు స్వయంగా దర్శకత్వం వహించుకునే తెలివితేటలు, విజ్ఞత చిరంజీవికి ఉన్నాయనే తాను గట్టిగా నమ్ముతున్నట్లు ట్వీట్లలో వర్మ చెప్పాడు. ఆయన దర్శకత్వం వహించకపోతే.. ప్రజారాజ్యం పార్టీ పెట్టడం కంటే ఇది మరింత పెద్ద తప్పు అవుతుందని వర్మ కుండ బద్దలుకొట్టినట్లు చెప్పాడు. ఆయన మూడు దశాబ్దాల సినీ చరిత్రలో ఇది అద్భుతమైన ఘట్టం అవుతుందన్నాడు. ఆయనే దర్శకత్వం వహిస్తే అది చిరంజీవికి మరో బాహుబలి అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. I hope chiranjeevi gaaru will direct his 150th film himself because from whatever my interaction with him he knows more than every director — Ram Gopal Varma (@RGVzoomin) January 27, 2015 If Chiranjeevigaaru works wth directors Trivikram Vinayak etc it will be just another etc film but if he does himself it will b the film — Ram Gopal Varma (@RGVzoomin) January 27, 2015 I am very sure that Chiranjeevigaaru has the wisdom nd intelligence to direct his 150th film himself — Ram Gopal Varma (@RGVzoomin) January 27, 2015 I am very sure that Chiranjeevigaaru has the wisdom nd intelligence to direct his 150th film himself — Ram Gopal Varma (@RGVzoomin) January 27, 2015 If Chiranjeevigaaru doesn't direct his 150 th film himself it will be a bigger mistake than him starting prajaraajyam party — Ram Gopal Varma (@RGVzoomin) January 27, 2015 Chiranjeevigaaru directing his 150th film himself wil b a spectacular event of his 3 decades and his truly true fans will have an orgasm — Ram Gopal Varma (@RGVzoomin) January 27, 2015 Chiranjeevigaaru's 150th film if directed by Chiranjeevigaaru himself wil b Bahubali of Chiranjeevis films nd if not wil b Jst anthr film — Ram Gopal Varma (@RGVzoomin) January 27, 2015